• తాజా వార్తలు
  •  

ఒక్క వాట్సాప్ మెసేజ్‌కు అరెస్ట‌యిన టీనేజ‌ర్ అరుణ్ త్యాగి

 యూపీలోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌కు చెందిన  జ‌కీర్ అలీ త్యాగి  అనే కుర్రాడు  గంగాన‌ది లివింగ్ ఎంటైటీ ఎలా అవుతుంద‌ని ఫేస్‌బుక్‌లో క్వ‌శ్చ‌న్ చేశాడు.  అంతేకాదు అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి బీజేపీ ప్లాన్ చేస్తుంద‌ని  సోష‌ల్ మీడియాలో డిస్క‌స్ చేశాడు.  దీంతో పోలీసులు అత‌ణ్ని  పోలీసులు అత‌ణ్ని ఐపీసీ సెక్ష‌న్ 420 (చీటింగ్ కేసు)తోపాటు ఐటీ యాక్ట్‌లోని 66వ సెక్ష‌న్ కింద అరెస్టు చేశారు.  జైల్లో ప‌డేసి 42 రోజులపాటు చిత‌క్కోట్టేశారు. ఆఖరికి ఉగ్ర‌వాది అని కూడా ముద్ర‌వేయ‌బోయారు. ఈ గొడ‌వ‌తో త్యాగి ప‌ని చేస్తున్న స్టీల్ ఫ్యాక్ట‌రీలో ఉద్యోగం కోల్పోయాడు. 
ఇండియాలో ఇది కొత్త కేసేం కాదు.  సోష‌ల్ మీడియాలో పొలిటీషియ‌న్స్‌పైన,వాళ్ల భావజాలంపైన కామెంట్స్ చేసిన చాలా మంది ఇలాగే చిక్కుల్లో ప‌డ్డారు. మ‌హారాష్ట్రలో 2013లో బాల్ థాక‌రే అంతిమ యాత్ర‌మీద ఫేస్‌బుక్‌లో కామెంట్ చేసిన అమ్మాయికి, దాన్ని లైక్ చేసిన ఆమె ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  ఈ నెల 2న మీర‌ట్‌కు చెందిన అఫ్గాన్ సోనీ అనే జ‌ర్న‌లిస్ట్‌ను కూడా కంప్యూట‌ర్ రిలేటెడ్ అఫెన్సెస్ ( ఐటీ చ‌ట్టంలోని 66వ సెక్ష‌న్) కింద అరెస్ట్ చేశారు.  ప్ర‌ధాని మోడీ అచ్చేదిన్ అంటున్నారు.. ఇది ప్ర‌జ‌ల‌కు చెప్ప‌కండి. గొర్రెల‌కు చెప్పండి అని విమ‌ర్శించ‌డం ఆ జ‌ర్న‌లిస్ట్ చేసిన నేరం.
వాట్సాప్‌లోనూ.. 
వాట్సాప్ గ్రూప్‌లో  ఇలాంటి కామెంట్స్ వ‌స్తే అడ్మినే బాధ్యుడ‌వుతాడ‌ని ఆ మ‌ధ్య  పోలీసులు, సెంట్ర‌ల్ నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. ఇలాంటివి అడ‌పాద‌డ‌పా జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.  అంతేకాదు దీనిమీద పోలీసులు అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని కంప్ల‌యింట్స్ వ‌స్తున్నాయి.
భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ ఏదీ? 
ఇండియా ప్ర‌జాస్వామిక దేశం. ఇక్క‌డ అంద‌రికీ భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ ఉంది. అంటే త‌మ‌కు న‌చ్చింది చెప్పొచ్చు. అయితే యూపీఏ గ‌వ‌ర్న‌మెంట్ తీసుకొచ్చిన ఐటీ చ‌ట్టంలోని 66వ సెక్ష‌న్ ప్ర‌కారం సోష‌ల్ మీడియాలో ఏదైనా అల‌జ‌డి క‌లిగించే అంశాలు పోస్ట్ చేయ‌డం, కులాలు, మ‌తాలు, వ‌ర్గాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టే కామెంట్లు చేయ‌డం, వాటిని షేర్ లేదా లైక్ చేయ‌డం నేరం. అయితే త‌ర్వాత దీనికి అమెండ్‌మెంట్స్ తీసుకొచ్చినా పోలీసులు, నిఘా వ‌ర్గాల దూకుడు త‌గ్గ‌డం లేదు. పొలిటీషియ‌న్ల మీద కామెంట్లు చేస్తే మ‌రింత తీవ్రమైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇది భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు విరుద్ధ‌మే.  పోలీసులు ఇలాంటి కామెంట్లు చూసి అరెస్టు చేయ‌డానికి దూకుడు ప్ర‌ద‌ర్శించే ముందు అసలు నిజంగా ఆ కామెంట్ వ‌ల్ల స‌మాజంలో అల‌జ‌డి రేగేంత సీన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవ‌డం అత్య‌వ‌స‌ర‌మ‌ని ఇండియ‌న్ పోలీస్ ఫౌండేష‌న్ ప్రెసిడెంట్‌, రిటైర్డ్ డీజీపీ ఎన్‌. రామ‌చంద్ర‌న్ చెబుతున్నారు. వ్య‌క్తుల‌ను ముఖ్యంగా ఆడ‌వారిని, చిన్న‌పిల్ల‌ల ఇమేజ్‌లు మార్ఫ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం నేరం కానీ రాజకీయ నేత‌ల వ్యంగ్య చిత్రాలు వేయ‌డంపై నిషేధం లేద‌ని ఇంట‌ర్నెట్ ఫ్రీడం అడ్వ‌కేట్ అప‌ర్ గుప్తా అంటున్నారు.  ఏదైనా ఇలాంటి వాటివ‌ల్ల సామాన్యులే ఇబ్బంది ప‌డుతున్నారు. కాబ‌ట్టి సోష‌ల్ మీడియాలో అలాంటి కామెంట్లు, పోస్టులు 
లైక్ లేదా షేర్ చేసేట‌ప్పుడు బీకేర్ ఫుల్ అంటున్నారు నిపుణులు. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు