• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్‌లో రూ.10 ల‌క్ష‌లు మోస‌పోయిన భారత యోగా మాస్ట‌ర్‌!

యోగా మాస్ట‌ర్ ఏమిటి?..ఫేస్‌బుక్ ఏమిటి?.. రూ.10 ల‌క్ష‌లు న‌ష్ట‌పోవ‌డం ఏంటి? ఒక్కో మాట‌కు సంబంధ‌మే కుద‌ర‌ట్లేదు క‌దా! కానీ ఇది నిజం. యోగా మాస్ట‌ర్‌కి ఫేస్‌బుక్‌కి ఏంటి రిలేష‌న్‌! అత‌నెందుకు అంత పెద్ద మొత్తం డ‌బ్బులు పోగొట్టుకున్నాడు? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లే! కానీ దానికి స‌మాధానాలు ఇవిగో. కానీ ఈ సంఘ‌ట‌న జ‌రిగింది  భార‌త్‌లో కాదు విదేశాల్లో. మ‌రి ఆ యోగా మాస్ట‌ర్ ఎలా ఆన్‌లైన్‌లో డ‌బ్బులు పోగొట్టుకున్నాడు. ఎలా ఫ్రాడ్‌లో ఇరుక్కున్నాడో చూద్దామా!

12000 పౌండ్లు హుష్‌కాకి
ఒక‌టి  కాదు రెండు కాదు ఏకంగా12000 పౌండ్లు గాలికి ఎగిరిపోయాయి. అదీ ఒక ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్ ద్వారా! బ్రిట‌న్‌లోని వార్విక్‌షైర్‌లో యోగా స్టూడియో న‌డిపే జ‌స్‌బీర్ మాన్‌కు ఈ  అనుభ‌వం ఎదురైంది. త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఉప‌యోగించి ఏకంగా 110 ట్రాన్సాక్ష‌న్లు జ‌రిగిన‌ట్లు  అత‌ను గ్ర‌హించాడు. పోక‌ర్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్ ద్వారా ఈ ట్రాన్సాక్ష‌న్లు జ‌రిగిన‌ట్లు అత‌ను తెలుసుకున్నాడు. దీనికి ప‌రోక్షంగా జ‌స్‌బీరే కార‌ణం. ఎందుకంటే ఫేస్‌బుక్ అకౌంట్లో త‌న డెబిట్ కార్డు వివ‌రాలు ఉంచాడు. త‌న బిజినెస్ కోసం ఫేస్‌బుక్ అడ్వ‌ర్టేజ్‌మెంట్ స‌ర్వీస్ వాడుకున్నాడు. ఇదే అత‌న్ని ముంచింది. 

అడ్వ‌ర్టేజ్‌మెంట్ విలువ‌ 30 పౌండ్లైతే..
ఫేస్‌బుక్‌లో అడ్వ‌ర్టేజ్‌మెంట్ చేస్తే 30 పౌండ్లు అయితే జ‌స్‌బీర్‌కు మాత్రం ఏకంగా 215 పౌండ్లు అయ్యాయి.  త‌న‌కు తెలియ‌కుండానే21 పౌండ్ల నుంచి 215 పౌండ్ల వ‌ర‌కు ట్రాన్సా క్ష‌న్లు జ‌రిగిన‌ట్లు అత‌ను తెలుసుకున్నాడు. ఎప్పుడైనా లాట‌రీ టిక్కెట్ కొన‌డం త‌ప్పించి తాను గ్యాంబ్లింగ్‌లోకి వెళ్ల‌న‌ని..  అస‌లు పోక‌ర్ ఆడ‌డం అంటే  త‌న‌కు తెలియ‌ద‌ని అత‌న‌న్నాడు. త‌న అకౌంట్లో మ‌నీ ఎందుకు క‌ట్ అయింద‌ని అత‌ను బ్యాంకును సంప్ర‌దిస్తే అత‌ని డెబిట్ కార్డును క్యాన్సిల్ చేసిన అత‌ని బ్యాంకు.. ఫేస్‌బుక్‌లో డెబిట్ కార్డు వివ‌రాలు తీసేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది. అయితే అప్ప‌టికే ఆల్య‌మైపోయింది జ‌స్‌బీర్ చాలా న‌ష్ట‌పోయాడు.  ఫేస్‌బుక్‌కు కంప్లైంట్ చేస్తే కొంత మొత్తమే ఈ యోగా మాస్ట‌ర్‌కు రిఫండ్‌గా వ‌చ్చింది. మిగిలిన డ‌బ్బుల కోసం అత‌ను ఇప్ప‌టికీ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాబ‌ట్టి ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు