• తాజా వార్తలు
  •  

టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

మైక్రోసాఫ్ట్‌, యాపిల్ లాంటి పెద్ద పెద్ద టెక్నాల‌జీ కంపెనీల కాల్ సెంట‌ర్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ వ‌చ్చే టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ ఇప్పుడు యూజ‌ర్ల‌ను కంగారు పెడుతున్నాయి. ఈ సైబ‌ర్ క్రైమ్స్ రెండు సంవ‌త్స‌రాలుగా బాగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటివ‌ర‌కు ఇలాంటివి 3ల‌క్ష‌ల‌కు పైగా కంప్‌ెయింట్స్‌వ‌చ్చాయి. మైక్రోసాఫ్ట్ గ్లోబ‌ల్ స‌ర్వే ప్ర‌కారం ప్ర‌తి ముగ్గురు మైక్రోసాఫ్ట్ క‌స్ట‌మ‌ర్ల‌లో ఇద్దరు ఇలాంటి స్కామ్ బారిన‌ప‌డుతున్నారు.  ఐదుగురిలో ఒక‌ర‌న్నా మ‌నీ లాస్ అవుతున్నార‌ట‌.  ఇలాంటి స్కామ్‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? ఒక‌వేళ పొర‌పాటున స్కామ్‌లో చిక్కుకుంటే త‌ర్వాత ఏం చేయాలో తెలుసుకోవ‌డానికి ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి.
ఎలా కంట్రోల్ చేయాలి?
*  టెక్నిక‌ల్ స‌పోర్ట్ అంటూ కాల్స్ వ‌చ్చిన‌ప్పుడు వాటికి స్పందించ‌కండి. ఎందుకంటే కంపెనీలు అలా ఇండివిడ్యువ‌ల్‌గా మీకు మెసేజ్‌లు పంప‌డం, కాల్స్‌చేయ‌డం చాలా రేర్‌గా జ‌రుగుతుంది.  ఎందుకంటే మైక్రోసాఫ్ట్‌, యాపిల్ యూజ‌ర్లు కోట్ల మంది ఉంటారు. మిమ్మ‌ల్ని ఒక్క‌రినే గుర్తు పెట్టుకుని మీ సిస్ట‌మ్ గురించి ఎందుకు కేర్ తీసుకుంటాయి అని లాజిక‌ల్‌గా ఆలోచించండి.  
* ఇలాంటి కాల్స్ చేసేవాళ్లు త‌మ‌ను కంపెనీ టెక్నిక‌ల్ స‌పోర్ట్ టీమ్‌గా మిమ్మ‌ల్ని న‌మ్మించడానికి అన్నిప్ర‌య‌త్నాలు చేస్తారు. లోక‌ల్ నెంబ‌ర్ల నుంచి కాల్ చేస్తారు. అలాంటివి న‌మ్మాల్సిన ప‌ని లేదు,
* కంపెనీలు కొత్త అప్‌డేట్స్‌లో  సెక్యూరిటీని డెవ‌ల‌ప్ చేస్తాయి. అంతే త‌ప్ప పనిగ‌ట్టుకుని ప్ర‌తి క‌స్ట‌మ‌ర్‌కు ఫోన్ చేసి మీ సిస్టంలో ప్రాబ్లం ఉంద‌ని చెప్ప‌డం సాధ్య‌మేనా అన్న‌ది కూడా ఆలోచించండి. 
*మీ సిస్టం ఇన్‌ఫెక్ట్ అయింద‌ని పాప్ అప్ మెసేజ్‌లు పెడుతుంటారు. అయినా రెస్పాండ్ కావ‌ద్దు.
* వాళ్లు కౌంట్‌డౌన్ టైమ‌ర్లు పెట్టి కంగారు పెట్టినా అస్స‌లు కాల్ చేయ‌వ‌ద్దు
* కాల్ చేసినా రిమోట్ యాక్సెస్ ఇవ్వ‌ద్దు. అస‌లు వాటిని పట్టించుకోకండి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మీ కంప్యూట‌ర్ పాస్‌వ‌ర్డ్ చెప్పి వారికి యాక్సెస్ ఇవ్వ‌కండి.
* ఇలాంటి స్కామ‌ర్స్ మీకు ప‌దే ప‌దే కాల్స్ లేదా మెసేజ్ చేస్తారు. నిజంగా కంపెనీలే చేస్తే అవి ప‌దేప‌దే మెసేజ్‌లు, కాల్స్‌పెట్ట‌వనే సంగ‌తి గుర్తు పెట్టుకోండి.
* నిజంగా మీ సిస్టం సెక్యూరిటీ మీద అనుమానం వ‌స్తే మీ కంపెనీ టెక్నిక‌ల్ స‌పోర్ట్ తీసుకోండి. అంతేకానీ పాప్ అప్ మెసేజ్‌లో వ‌చ్చిన నెంబ‌ర్‌కు కానీ, కాలర్స్ చెప్పిన నెంబ‌ర్‌కు గానీ కాల్ చేయ‌కండి.
స్కామ్ బారిన‌ప‌డితే..
* మాల్‌వేర్‌ను వదిలించుకోండి. చట్టబద్ధమైన సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి. ఇప్ప‌టికీ మీకు అలాంటి సాఫ్ట్‌వేర్ లేక‌పోతే దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని మీ సిస్ట‌మ్‌ను స్కాన్ చేయండి. అనుమానాస్పదంగా చూపించిన ఏ ఫైల్‌, సాఫ్ట్‌వేర్‌ను అయినా వెంట‌నే తీసేయండి. 
* మీరు ఎవరితోనైనా పాస్‌వ‌ర్డ్‌ను షేర్ చేసుకుంటే వెంట‌నే వాటిని మార్చేయండి. మీ అకౌంట్ల పాస్‌వ‌ర్డ్‌లు కూడా మార్చేయ‌డం బెట‌ర్‌.
* టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్‌లో ఇరుక్కుని వాళ్ల స‌ర్వీస్‌కు మీరు  క్రెడిట్ కార్డుతో ఏమైనా పేమెంట్ చేస్తే మీ క్రెడిట్ కార్డు కంపెనీకి కాల్ చేసి, మీ ఛార్జీలను రిఫండ్ ఇవ్వ‌మ‌ని అడ‌గండి.  మీ క్రెడిట్ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకుని అలాంటి పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని ముందుగా నిర్ధారించుకోండి. 
రిఫండ్ కూడా స్కామ్ కావ‌చ్చు..
* మీరు టెక్ సపోర్ట్ సర్వీసెస్ కోసం చెల్లించినట్లయితే, తరువాత రిఫండ్ గురించి మీకు కాల్ వస్తుంది, ఆ కాల్ కూడా స్కామ్ కావచ్చు. ఆ కాల‌ర్‌కు మీ ఫైనాన్షియ‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ (కార్డ్ నెంబ‌ర్ లేదా ఇంట‌ర్నేట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ లాంటివి) ఏమీ ఇవ్వ‌కండి.
*టెక్ సపోర్ట్ సర్వీసెస్ కోసం డ‌బ్బులు చెల్లిస్తే కొన్ని నెల‌ల త‌ర్వాత,మీరు మా స‌ర్వీస్‌తో సంతృప్తిగా ఉన్నారా అని ఆ కాల‌ర్స్ మ‌ళ్లీ మెసేజ్ లేదా కాల్ చేస్తారు. మీరు నో అని చెబితే స్కామ‌ర్లు మీ మ‌నీని రిఫండ్ ఇస్తామ‌ని చెబుతారు. ఇందుకోసం మీ క్రెడిట్ కార్డ్ నెంబ‌ర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబ‌ర్ అడుగుతారు. అలా అడిగారంటే రిఫండ్ పేరిట వాళ్లు మ‌ళ్లీ మిమ్మ‌ల్ని మ‌రో స్కామ్‌లో ఇరికిస్తున్నార‌ని గుర్తు పెట్టుకోండి.
* ఒక‌వేళ మీరు క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబ‌ర్ చెప్పారా మీకు రిఫండ్ ఇవ్వ‌డం ప‌క్క‌న‌పెట్టండి. మీ అకౌంట్‌ను ఖాళీ చేసే ప్ర‌మాదం ఉంది. 

జన రంజకమైన వార్తలు