కుల్దీప్సింగ్.. 46 ఏళ్ల ఈ ఇండియన్ ఓ సెక్యూరిటీ ఎంటర్‌ప్రైజస్ కంపెనీలో సేల్స్ హెడ్. ఎథికల్ హ్యాకర్. ఐటీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. అంతేకాదు ఐరన్ మ్యాన్ కు ఇండియాలో ఒకే ఒక అఫీషియల్ ట్రైనర్. ఇవే ఆయన క్వాలిఫికేషన్స్ అయితే అతని గురించి గొప్పగా చెప్పుకోనక్కర్లేదు. కానీ 3వేల రూపాయలకే హ్యాకింగ్ డివైస్ తయారుచేసి ఔరా అనిపించాడు. దీంతో ఎలాంటి ఫోన్, కంప్యూటర్, ట్రాఫిక్ సిగ్నల్, సీసీ కెమెరాలనైనా హ్యాక్ చేయొచ్చు.
అలా మొదలైంది..
కుల్దీప్ భార్య.. అతణ్ని నా ఫోన్ హ్యాక్ చేయగలవా అని సవాల్ చేసింది. దీంతో కుల్దీప్ ఆండ్రాయిడ్ డివైస్‌కు బ్యాక్‌డోర్ ఎంట్రీ ఎలా అని సెర్చ్ చేశాడు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మీద బాగా రీసెర్చి చేశాడు. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ (CEH)v9, కంప్యూటర్ హ్యాకింగ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ (CHFI)v9 కోర్సులు పూర్తి చేశాడు. రెండు నెలలపాటు రకరకాల డివైస్‌లు కొని వాటిమీద హ్యాకింగ్ ప్రాక్టీస్ చేశాడు. చివరికి 60 ఇంచెస్పరిమాణంలో జస్ట్ 59 గ్రాముల బరువున్న హ్యాకింగ్ డివైస్‌ను తయారుచేశాడు.
ఇవీ వాడింది..
ఒక రూటర్, సాన్‌డిస్క్ మెమరీ కార్డ్, కీబోర్డ్, HDMI కేబుల్, మరో పెద్ద కేబుల్, ప్యాకేజర్స్, డేటా ట్రాన్స్ఫర్ కేబుల్, హైస్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కేబుల్, మొబైల్ అడాప్టర్స్, ఓటీజీ, వైఫై జామర్, సింగిల్ బోర్డ్ మినీ కంప్యూటర్లతో ఈ హ్యాకింగ్ డివైస్‌ను తయారుచేశాడు. హానికర వ్యవస్థలను ఎలా పరిష్కరించాలనే ఆలోచనలతో హ్యాకింగ్ మీద దృష్టి పెట్టాను. అయితే ఎంత సులభంగా హ్యాక్ చేయవచ్చో అర్ధమైంది. దాన్ని అందరికీ తెలియజెప్పాలనే ఈ డివైస్ తయారుచేశాను అని కుల్దీప్ చెబుతున్నారు. ఈ డివైస్ తన సొంత ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఆయన హ్యాక్ చేశాడు కూడా. ఆన్‌లైన్‌కు దూరంగా బతకడం ఇప్పుడు కష్టం అయితే ఎంత ఈజీగా హ్యాక్ చేయొచ్చో చెప్పడానికి తన డివైజే ఎగ్జాంపుల్ అని చెబుతున్నాడు. . కానీ హ్యాకింగ్‌ను ప్రివెంట్ చేయడానికి మార్గాలున్నాయని చెప్పాడు.