• తాజా వార్తలు
  •  

తస్మాత్ జాగ్రత్త ! జియో కాయిన్ అంట !

ముఖేష్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ జియో తన స్వంత క్రిప్టో కరెన్సీ ని లాంచ్ చేసుకునే ప్లానింగ్ లో ఉంది. ఈ నేపథ్యం లో ఒక నకిలీ వెబ్ సైట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫేక్ వెబ్ సైట్ పట్ల మనం చాలా జాగ్రత్త గా ఉండవలసిన అవసరం ఉంది.

ఈ ఫేక్ వెబ్ సైట్ ఎలా ఉంటుంది ?       

ఈ నకిలీ వెబ్ సైట్ యొక్క యుఆర్ఎల్ reliance-jiocoin-.com లా ఉంటుంది. చూడడానికి అచ్చం రిలయన్స్ యొక్క యుఆర్ఎల్ లానే ఉంటుంది. దీనిని చూడగానే రిలయన్స్ యొక్క మరొక వెబ్ సైట్ అనిపించేలా ఇది ఉంటుంది. జియో యొక్క మాతృసంస్థ అయిన RIL యొక్క ఐకాన్ ను కూడా ఇది కలిగి ఉంటుంది.

అతి త్వరలో జియో కాయిన్ లాంచ్ అవ్వనుందనీ, దీనియొక్క లాంచ్ ప్రైస్ ఒక్కో కాయిన్ కూ రూ 100/- లు ఉంటుందనీ ఈ వెబ్ సైట్ చెబుతుంది. వినియోగదారులు తమ పూర్తి పేరు, ఈ మెయిల్ అడ్రెస్ లతో రిజిస్టర్ చేసుకోవలసిందిగా ఇది అడుగుతుంది. అయితే అవి ఎంటర్ చేసే సమయానికి ఈ వెబ్  సైట్ ఓపెన్ కావడం లేదు.

వాస్తవం ఏమిటి ?                 

రిలయన్స్ జియో ఇన్ఫో కాం తన స్వంత క్రిప్టో కరెన్సీ ని జియో కాయిన్ ల రూపం లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్న మాట నిజం. అయితే ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. అంబానీ యొక్క పెద్ద కుమారుడు అయిన ఆకాష్ నేతృత్వం లోని 50 మంది సభ్యుల బృందం ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వాడకం పై పరిశోధన చేస్తుంది. కాబట్టి ఇది ఇంకా ప్రణాళిక దశ లోనే ఉంది. అయితే ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్ళు RIL పేరుతో కొన్ని ఫేక్ వెబ్ సైట్ లు తీసుకువస్తున్నారు. ఈ ఫేక్ వెబ్ సైట్ ల పట్ల అప్రమత్తం గా ఉండవలసిన అవసరం ఉంది.

జన రంజకమైన వార్తలు