• తాజా వార్తలు

జియో డాటా లీక్ చేసిన డ్రాపవుట్ స్టూడెంట్ అరెస్ట్


 

జియో  డేటా బేస్ లీక్ అయ్యాయ‌నే వార్త‌లు రెండు, మూడు రోజులుగా సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి..   ముఖ్యంగా యూజ‌ర్లు త‌మ డేటా ఎలా లీక‌యింద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.  తమ మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబ‌ర్లు హ్యాక‌ర్ల‌కు తెలిసిపోతే సెక్యూరిటీప‌రంగా ఇబ్బందులుంటాయ‌ని భ‌య‌ప‌డుతున్నారు.  ఈ ప‌రిస్థితుల్లో లీకేజికి కార‌ణ‌మైన వ్య‌క్తిని ముంబ‌యి పోలీసులు  రాజ‌స్థాన్‌లో అరెస్ట్ చేశారు. 
 Magicapk.com పేరుతో ఉన్న  వెబ్‌సైట్‌.. జిమో క‌స్ట‌మ‌ర్ల డేటాతో కూడిన జాబితాను పోస్ట్ చేసింది. దీనిలో 120 మిలియ‌న్ యూజ‌ర్ల స‌మాచారం ఉన్న‌ట్లు తెలిసింది.  దీనిలో నంబ‌ర్, పేరు టైప్ చేస్తే చాలు మెయిల్ ఐడీ, ఆధార్‌కార్డు స‌హా వివ‌రాల‌న్నీ వ‌చ్చేస్తున్నాయ‌న్న వార్త‌ల‌తో యూజ‌ర్లు కంగారుప‌డ్డారు.  అయితే  ఈ సైట్ త‌ర్వాత ఒక్క‌సారిగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయింది.  అయితే వినియోగ‌దారుల డేటాకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఈ సైట్ గురించి శోధించి దోషుల‌ను ప‌ట్ట‌కుంటామ‌ని రిల‌య‌న్స్ తెలిపింది.

 ఈ విష‌యంపై క్షుణ్ణంగా విచారించ‌డానికి జియో పోలీసుల‌కు  సమాచారం అందించింది.  కేజీకి కార‌ణ‌మైన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు.  Magicapk.com  అనే వెబ్‌సైట్ ద్వారా రాజ‌స్థాన్‌కు చెందిన ఓ వ్య‌క్తి జియో యూజ‌ర్ల ఇన్ఫోను లీక్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అత‌ని పేరు ఇమ్రాన్ చిప్పా అని భావిస్తున్నారు.  35 ఏళ్ల వ‌య‌సున్న ఈ హ్యాక‌ర్ కంప్యూట‌ర్ సైన్స్ డ్రాప‌వుట్‌గా గుర్తించారు.  సైబ‌ర్ పోలీసులు లొకేష‌న్ బేస్డ్ ఇన్ఫ‌ర్మేష‌న్‌తో హ్యాక‌ర్‌ను గుర్తించి రాజ‌స్థాన్‌లో అరెస్ట్ చేశారు.  అత‌ని ద‌గ్గ‌ర మొబైల్ ఫోన్‌, కంప్యూట‌ర్‌, స్టోరేజ్ డివైస్‌ల‌ను సీజ్ చేశారు. హ్యాక‌ర్‌ను ముంబ‌యికి తీసుకెళ్ల‌నున్నారు. 

జన రంజకమైన వార్తలు