• తాజా వార్తలు
  •  

పోలీసుల‌కు టెక్ అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో జ‌రిగిన విడ్డూరం 

మోడ్ర‌న్ టెక్నాల‌జీ మీద పోలీసుల‌కు అవ‌గాహ‌న లేక‌పోతే ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయో చెప్ప‌డానికి ఇటీవ‌ల బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ ఘ‌ట‌నే ఉదాహర‌ణ‌.   గ‌త శుక్ర‌వారం మెట్రో రైల్ ఎనౌన్స్‌మెంట్ పెద్ద‌గా వ‌స్తుందని, సౌండ్ పొల్యూష‌న్ అవుతుంద‌ని చుట్టుప‌క్క‌ల ఉన్న ఇంటి నుంచి ఓ వ్య‌క్తి కంప్ల‌యింట్ ఇవ్వ‌డంతో బెంగ‌ళూరులో హొయ‌స‌ల పోలీస్‌స్టేష‌న్ కానిస్టేబుల్ ఒక‌రు విజ‌య‌న‌గ‌ర మెట్రోస్టేష‌న్‌కు వ‌చ్చారు. అక్క‌డున్న మెట్రో సిబ్బంది ఒక‌రిని అది త‌మ ఫాల్ట్ కాద‌ని, అది కంప్యూట‌ర్లో ప్రీ ప్రోగ్రాం అయి ఉంటుంద‌ని ఎంత‌చెప్పినా విన‌కుండా బ‌ల‌వంతంగా పోలీస్‌స్టేష‌న్ కు లాక్కెళ్లారు. 
ప్ర‌యాణికుల ప్రాణాల‌తో చెల‌గాటం
బెంగ‌ళూరు మెట్రో మొత్తం టెక్నాల‌జీ బేస్డ్‌గానే న‌డుస్తుంది. బ‌య్య‌ప్ప‌న‌హ‌ళ్లిలో ఉన్న ఆప‌రేష‌న్స్ కంట్రోల్ సెంట‌ర్ (OCC) నుంచే మెట్రో ర‌న్నింగ్‌,సిగ్న‌లింగ్, అనౌన్స్‌మెంట్స్ వంటివ‌న్నీ ర‌న్ చేస్తారు. 24 గంట‌లూ చాలా మంది ఇంజినీర్లు అక్క‌డ ప‌ని చేస్తూ మెట్రోను న‌డిపిస్తుంటారు. అలాంటి చోట‌కు వ‌చ్చి మెట్రో స్టాఫ్‌లో ఒక‌ర్ని పోలీసులు బ‌ల‌వంతంగా లాక్కెళ్ల‌డంపై బెంగ‌ళూరు మెట్రో అధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ  సిబ్బంది అక్క‌డ లేక‌పోతే దాదాపు 1000 మంది ప్ర‌యాణిస్తున్న మెట్రోకు ప్ర‌మాదం జ‌రిగితే బాధ్యులు ఎవ‌ర‌ని ప్ర‌శ్నించారు. దీనిపై బెంగ‌ళూరు సిటీ పోలీసు హ‌య్య‌ర్ అథారిటీస్‌కు కంప్ల‌యింట్ చేశారు.  
టెక్నాలజీపై అవ‌గాహ‌న లేకే
ఎనౌన్స్‌మెంట్ పెద్ద‌గా రావ‌డం అనేది త‌మ చేతుల్లో లేద‌ని, అది ప్రీప్రోగ్రామ్డ్ వాయిస్ అని మెట్రో అధికారి  చెప్పినా పోలీసు కానిస్టేబుల్ విన‌లేదు. తాను ఆన్‌డ్యూటీ కంట్రోల‌ర్‌న‌ని,  త‌ను ఇక్క‌డ లేక‌పోతే  మెట్రో ఆప‌రేష‌న్స్ డిస్ట్ర‌బ్ అవుతాయ‌ని చెప్పినా ప‌ట్టించుకోకుండా లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై క‌ర్నాట‌క హోం మినిస్ట‌ర్ రామ‌లింగారెడ్డి విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఎంక్వ‌యిరీ చేసి ఇలాంటివి మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా పోలీసుల‌కు ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇస్తామ‌ని చెప్పారు.  బెంగ‌ళూరు టెక్నాల‌జీ వాడ‌కంలో ప్ర‌పంచంలో టాప్ 25 న‌గ‌రాల్లో ఒక‌టిగా నిలిచింది. పోలీసులు ఇలా చిన్న చిన్న టెక్నిక‌ల్ ఇష్యూస్‌ను కూడా తెలుసుకోలేక‌పోతే ఇక దానికి విలువ ఏం ఉంటుంద‌ని మెట్రో అఫీషియ‌ల్స్ అంటున్నారు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు