• తాజా వార్తలు

ఫేస్‌బుక్‌లో గుడ్‌మార్నింగ్ చెప్పినందుకు అరెస్ట‌యిన వైనం

ఫేస్‌బుక్‌లో గుడ్‌మార్నింగ్  పోస్టు పెట్టినందుకు  ఓ పాల‌స్తీనా జాతీయుణ్ని ఇజ్రాయ‌ల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేం చోద్యం? మ‌న దగ్గ‌ర సినిమా హీరోల‌ను, పొలిటీషియ‌న్ల‌ను ట్రాల్ చేసినా కూడా ఎవ‌రూ పట్టించుకోరే!  గుడ్మార్నింగ్ చెప్పినందుకే అరెస్టు చేసేశారా? అని డౌట్ల మీద డౌట్లు వ‌చ్చేస్తున్నాయా? అయితే చ‌ద‌వండి.
ఏం జ‌రిగిందంటే.. 
పాల‌స్తీనాకు చెందిన ఓ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్ బుల్‌డోజ‌ర్ ముందు కాఫీ క‌ప్పు, సిగ‌రెట్‌తో నిల‌బ‌డి ఉన్న ఫొటోను పోస్ట్ చేసి గుడ్మార్నింగ్ అని అర‌బిక్ లాంగ్వేజ్‌లో  మెసేజ్ పెట్టాడు. అయితే ఫేస్‌బుక్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాల‌జీ దాన్ని ట్రాన్స్‌లేట్ చేసేస‌రికి అది వాళ్ల‌పై దాడి చేయండి  (attack them) అని హిబ్రూ భాష‌లో,   hurt them అని ఇంగ్లీష్‌లోనూ పోస్ట్ అయింది. ఇంకేముంది సో|ష‌ల్ మీడియా మానిట‌రింగ్ సెల్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు పోస్ట్‌ల‌ను మానిట‌ర్ చేసే  ఇజ్రాయ‌ల్ పోలీసులు అల‌ర్ట‌యిపోయారు. అస‌లే పాల‌స్తీనాకు, ఇజ్రాయ‌ల్‌కు ప‌డ‌దు. సోష‌ల్ మీడియాలో మానిట‌రింగ్ చేసి పాల‌స్తీనియ‌న్లు ఇజ్రాయ‌ల్ వాళ్ల‌పై దాడి చేయ‌డానికి చేసిన 2,200 ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకున్నామ‌ని ఇజ్రాయ‌ల్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎటాక్ దెమ్ అని పోస్ట్ క‌న‌ప‌డితే ఊరుకుంటారా?  వెంట‌నే మ‌నోణ్ని ప‌ట్టుకుని కట‌క‌టాల వెన‌క్కి నెట్టేశారు. 
త‌ప్పెక్క‌డ జ‌రిగింది? 
ఫేస్‌బుక్ త‌న సొంత ట్రాన్స్‌లేష‌న్ స‌ర్వీస్‌తో వేరే లాంగ్వేజ్‌లో ఉన్న పోస్ట్‌ల‌ను ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఇది చాలా గొప్ప స‌ర్వీస‌ని, చాలా యాక్యురేట్‌గా, సెన్సిబుల్‌గా ట్రాన్స్‌లేట్ చేసేస్తుంద‌ని ఫేస్‌బుక్ గొప్ప‌లు పోయింది. తీరా ఈ సొంత  ట్రాన్స్‌లేష‌న్ స‌ర్వీస్ వాడితే ఇలా  అర్థం మారిపోయింది.  అయితే ఇజ్రాయల్ పోలీసులు కూడా ఇక్క‌డ త‌ప్పు చేశారు. పాల‌స్తీనీయుడు వాడిన అర‌బ్  భాష‌ను ట్రాన్స్‌లేట్ చేయ‌గ‌లిగిన‌వాళ్ల‌కు చూపిస్తే వాళ్లు దానికి గుడ్మార్నింగ్ అని అర్ధం చెప్పేవారు. అలా కాకుండా ఫేస్‌బుక్ టెక్నాల‌జీనే ఆ పోలీసులూ న‌మ్మ‌డంతో పాపం ఓ అమాయకుడు జైల్లో ప‌డ్డాడు. 

జన రంజకమైన వార్తలు