• తాజా వార్తలు

కొట్టేసిన ఫోన్‌తో క్యాబ్ బుక్ చేసి డ్రైవ‌ర్‌ను దోచుకున్న ఓ డెస్ప‌రేట్ దొంగ‌!

సాధార‌ణంగా మ‌నం క్యాబ్ ఎక్కాలంటే ఒక‌ప్పుడు ముందు వెనుకా ఆలోచించేవాళ్లం. కానీ ఇప్పుడు అంతా ఆన్‌లైన్ అయిపోయిన త‌ర్వాత‌.. జీపీఎస్‌లో అంతా బ‌హిర్గ‌తం అయిపోతున్న నేప‌థ్యంలో అర్ధ‌రాత్రి కూడా క్యాబ్స్‌లో వెళ్ల‌డానికి ఎవ‌రూ సంకోచించ‌ట్లేదు.  ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా అక్క‌డ‌క్క‌డా డ్రైవ‌ర్ల వ‌ల్ల ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. అయితే ఇక్క‌డ జ‌రిగింది మాత్రం దీనికి రివ‌ర్స్‌. అంద‌రూ క్యాబ్ డ్రైవ‌ర్ల గురించి ఆలోచిస్తుంటే ఇక్క‌డ క‌స్ట‌మ‌రే డ్రైవ‌ర్‌కు ఝుల‌క్ ఇచ్చాడు. కొట్టేసిన ఫోన్‌తో క్యాబ్ బుక్ చేసిన  ఆ త‌ర్వాత డ్రైవ‌ర్‌ను దోచుకున్నాడో దొంగ‌? ఆ సంగ‌తేంటో చూద్దాం.

మ‌హిళ‌ల దగ్గ‌ర నుంచి ఫోన్ కొట్టేసి..
చాలా మంది ఫోన్లు పోయాయంటే లైట్ తీసుకుంటారు. క‌నీసం వాటి గురించి వెతికే ప‌ని కూడా పెట్టుకోరు. రేర్‌గా కొంత‌మంది మాత్ర‌మే ఫోన్ పోయింద‌ని పోలీసు కంప్లైంట్ ఇస్తారు. అయితే ఇలాంటి దొంగ‌ల్ని చూశాక క‌చ్చితంగా మ‌న ఫోన్ పోతే కంప్లైంట్ ఇవ్వాల‌నే విష‌యం అర్ధం అవుతుంది. బెంగ‌ళూరులోని కోలార్‌లో ఒక మహిళ ద‌గ్గ‌ర నుంచి ఫోన్ కొట్టేసిన ఒక దొంగ‌.. ఆ త‌ర్వాత ఆ ఫోన్ సాయంతో ఓలా క్యాబ్‌ను బుక్ చేశాడు. డ్రైవ‌ర్‌ను ఒక నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి రూ.5 వేల న‌గదుతో అత‌ని ఫోన్ కూడా తీసుకెళ్లాడు. అయితే అత‌నేమీ తుపాకీతోనో క‌త్తితోనో బెదిరించి తీసుకెళ్ల‌లేదు 

లోన్ కోస‌మ‌ని..
డ్రైవ‌ర్‌తో తానో ప్రైవేటు బ్యాంకులో మేనేజ‌ర్‌న‌ని చెప్పుకున్నాడు. కారులో వెళ్తున్నంత సేపు లోన్ల గురించే మాట్లాడాడు.  మీకు లోన్ అవ‌స‌రం ఉంటే ఇప్పిస్తా అని డ్రైవ‌ర్‌తో చెప్పాడు. త‌న‌కు రూ.10 ల‌క్ష‌లు అవ‌స‌ర‌మ‌ని డ్రైవ‌రు చెప్ప‌గానే తాను ఇప్పిస్తాన‌ని చెప్పాడు. అత‌ని డ్రైవింగ్ లైసెన్స్‌, ఆఫీస్ ఐడీ కార్డు జిరాక్స్‌లు తీసుకున్నాడు. ఇన్సిడెంట‌ల్ ఛార్జీల కింద రూ.10 వేలు చెల్లించాల‌ని చెప్పాడు. అయితే డ్రైవ‌రు త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేద‌ని రూ.5 వేలు మాత్ర‌మే చెల్లించాడు. మ‌రో  రెండు రోజుల్లో మిగితా అమౌంట్ చెల్లిస్తాన‌ని చెప్పాడు. స‌రే మీ ఫోన్ ఇవ్వండి మా బ్యాంక్ లోన్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి అని చెప్పాడు. దీని కోసం మీ ఫోన్‌ను మా ఆఫీసుకు తీసుకెళ్లాల‌ని చెప్పాడు.  గుడ్డిగా నమ్మిన డ్రైవ‌ర్ త‌న ఫోన్ కూడా ఇచ్చేశాడు. ఒక బిల్డింగ్ ముందు కారు ఆపించి లోప‌లికి వెళ్లాడు. బ‌య‌టే రెండు గంట‌లు వెయిట్ చేశాను. ఆ త‌ర్వాత నా ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వ‌చ్చింది.  దీంతో  డ్రైవ‌ర్ ల‌బో దిబో అన్నాడు. కారు బుక్ చేసిన మొబైల్ నంబ‌ర్‌ను సెర్చ్ చేస్తే ఒక మ‌హిళ‌ద‌ని తేలింది. ఆమె కూడా ఫోన్ పోయింద‌ని చెప్ప‌డంతో పోలీసులు కంగుతిన్నారు. ఎంత టెక్నాల‌జీ చేతిలో ఉన్నా.. ఇలాంటి సంఘ‌ట‌నలు పెద్ద క‌నువిప్పు. 

జన రంజకమైన వార్తలు