• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో మ‌న‌ల్ని నిగూఢంగా ట్రాక్ చేసి సొమ్ము చేసుకుంటున్న డేటా బ్రోకర్స్ 


 

డు నాట్ డిస్ట్ర‌బ్ లో  రిజిస్ట్రేష‌న్ చేసుకున్నా రోజుకు నాకు రోజుకు నాలుగైదు స్పామ్‌కాల్స్ వ‌స్తున్నాయి ..  అనిల్ రైనా అనే ఢిల్లీ వాసి కంప్ల‌యింట్ ఇది. ఈ స‌మ‌స్య అనిల్‌దే కాదు ఇండియాలో ఉన్న మొబైల్ యూజ‌ర్ల‌లో ల‌క్ష‌లాది మందిది. డు నాట్ డిస్ట్ర‌బ్ (డీఎన్‌డీ)లో రిజిస్ట‌ర్ చేసుకున్నాక ఏదైనా ప్రొడ‌క్ట్‌, స‌ర్వీస్‌కు సంబంధించిన అన్‌వాంటెడ్ కాల్స్ మ‌న‌కు రాకూడ‌దు. అలా వ‌స్తే మొబైల్ కంపెనీల‌పై ట్రాయ్‌కు కంప్ల‌యింట్ చేయొచ్చు. కంప్ల‌యింట్ సివియార్టీని ట్రాయ్.. టెలిఫోన్ కంపెనీల‌కు ఫైన్ వేస్తుంది.  కానీ ఇక్క‌డ రైనా నెంబ‌ర్ బెంగళూరు బేస్డ్ HNIs (high net worth individuals) శాంపిల్ స్ప్రెడ్ షీట్‌లో ఉంది. వీళ్ల‌కెలా చేరింద‌ని ఆరా తీస్తే అది నోయిడా నుంచి ప‌ని చేస్తున్న ఓ డేటా బ్రోక‌ర్ అమ్మాడ‌ని తెలిసింది.  ఇలాంటి డేటా బ్రోకింగ్ ఇప్పుడు ఇండియాలో చాలా పెద్ద బిజినెస్‌గా మారిపోతుంది.  

మ‌నీ బాగా స్పెండ్ చేయ‌గ‌లిగే ( high net worth individuals)  10 వేల మంది వివ‌రాలు కావ‌లంటే 2వేల రూపాయ‌లు చెల్లిస్తే మీ చేతిలో ఉంటాయి.  ఏడు వేల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్ట‌గ‌లిగితే ఇలాంటివి ల‌క్ష మంది వివ‌రాలు మీకు చెప్పేసే డేటా బ్రోక‌ర్లున్నారు.  ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబ‌ర్‌, పేరు, అడ్ర‌స్‌లాంటి వివ‌రాల‌న్నీ ఇందులో ఉంటాయి. వీటిని ప‌ట్టుకుని కంపెనీలు ఆన్‌లైన్ ప్ర‌మోష‌న్‌, ప్రొడ‌క్ట్ సెల్లింగ్ చేస్తున్నాయి. 
ట్రూ కాల‌ర్‌తో బ్లాక్ చేయొచ్చు 
ట్రూ కాల‌ర్ ద్వారా చూసి రోజుకు నాలుగైదు ఫోన్ నెంబ‌ర్ల‌ను బ్లాక్ చేస్తుంటాను. ఇలా ఇప్ప‌టికి 200 కాంటాక్ట్‌లు బ్లాక్ చేశాను. అయినా ఇంకా స్పామ్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని రైనా చెప్పారు. 
ఎలా తెలుసుకుంటారు? 
డేటా బ్రోకర్లు ఈ వివ‌రాల‌ను జాబ్ పోర్ట‌ల్స్‌, ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్స్‌, టూర్ ఆప‌రేట‌ర్స్ వంటి వాళ్ల ద‌గ్గ‌ర నుంచి  సేక‌రిస్తారు.  ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ల నుంచి కూడా చాలా స‌మాచారం వారికి చేరిపోతుంది.  వీటిలో ఆన్‌లైన్‌లో మ‌నం ఎంట‌ర్ చేసే డిటెయిల్స్‌ను గేద‌ర్ చేసి కంపెనీల‌కు అమ్మేస్తున్నారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5వేల మంది డేటా బ్రోక‌ర్లున్నార‌ని స‌మాచారం.  క‌స్ట‌మ‌ర్ ఎంగేజ్‌మెంట్ కంపెనీ, క‌న్స్యూమ‌ర్ డేటా క‌లెక్ష‌న్ కంపెనీ, ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీసెస్‌, క‌న్స్యూమ‌ర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌తో వీరు డేటా సేక‌రించి కంపెనీల‌కు అమ్ముకుంటున్నారు. డేటా డ్రివెన్ మార్కెటింగ్ వేలు, ల‌క్ష‌ల కోట్ల‌లో జరుగుతోంది. అమెరికాలో 2014లో ఈ బిజినెస్ 202 బిలియన్ డాల‌ర్లు (మ‌న క‌రెన్సీలో వంద కోట్ల కోట్ల రూపాయ‌లు)  దాటింది.  అంతేకాదు ఫ్రాడ్ కాల్స్ , మెయిల్స్‌, మెసేజ్‌లు   చేసి డ‌బ్బులు కొట్టేయాల‌ని చూసే వారికి కూడా ఇలాంటి డేటా బ్రోక‌ర్ల నుంచే మ‌న డేటా వెళ్లిపోవ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రం. 
ప‌రిష్కార‌మేంటి? 
మీ డేటా లీక్ చేసిన సైట్‌, సంస్థ‌పైన యాక్ష‌న్ తీసుకోవ‌చ్చు. అయితే వాళ్లే డేటా లీక్ చేశార‌ని ప్రూవ్ చేయాలి. అంతేకాదు మ‌నం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఫ్రీ యాప్స్‌లో కూడా చాలా వ‌ర‌కు డేటాను లీక్ చేసేవి ఉన్నాయి. మ‌నం ఎవ‌రు, ఎక్క‌డుంటాం, ఏం చేస్తాం, ఏం కొన్నాం, ఏం తిన్నాం వంటివ‌న్నీ తవ్వి తీసే డేటా మైనింగ్ కూడా మీ డేటాను లీక్ చేస్తోంది. వీటి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఫోన్ చేస్తున్న‌వారెవ‌రో తెలుసుకునే కాల‌ర్ ఐడీ యాప్ ట్రూ కాల‌ర్ తో కాల్స్ ను గుర్తించి బ్లాక్ చేయొచ్చు.  

జన రంజకమైన వార్తలు