• తాజా వార్తలు
  •  

7 రోజులు.. 30 మంది ఆన్‌లైన్‌లో ఎలా మోస‌పోయారంటే...

ఆన్‌లైన్‌లో మ‌నం లావాదేవీలు చేస్తున్నామంటే మ‌న ప‌క్క‌నే ప్ర‌మాదం పొంచి ఉంటుంది. హ్యాక‌ర్లే లేదా అది ఫ్రీ.. ఇది ఫ్రీ అంటూ బుట్ట‌లో వేసే వాళ్లో మ‌న‌కు తగులుతూనే ఉంటారు. అన్నింట్లోంచి ఏదో విధంగా త‌ప్పించుకున్నా.. ఎక్క‌డో ఒక చోట ఇరుక్కుపోతూ ఉంటాం. ఇటీవల ఆన్‌లైన్ మోసాలు మ‌రింత ఎక్కువైపోయాయి. అలాంటి మోస‌మే ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చింది. ల‌ఖ్‌న‌వూలో తాజాగా ఆన్‌లైన్ మోసంలో ఇరుక్కుపోయిన మోసపోయారు. ఒక‌ళ్తు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 30 మంది! 

ఏడు రోజులు.. 30 మంది
ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ వేదిక‌గా చాలా మోసాలు బ‌య‌ట‌కొస్తున్నాయి.  సోష‌ల్ ట్రేడ్ లాంటి ఫోంజీ స్కామ్ ఇక్క‌డ నుంచి వ‌చ్చిందే. ముఖ్యంగా నోయిడా కేంద్రంగా భారీ స్థాయిలో మోసాలు జ‌రుగుతున్నాయి. కొన్ని బ‌య‌ట‌కొస్తున్నాయి. కొన్ని అలాగే ఉండిపోతున్నాయి. గ‌త ఏడు రోజుల్లోనే ఏకంగా 30 మంది   ఈ ఆన్‌లైన్ ద‌గాకు గురయ్యారు.   అది కూడా ఫేస్‌బుక్ ద్వారా! విన‌డానికి విచిత్రంగా ఉన్నా మోస‌పోయిన‌వాళ్లు మాత్రం ల‌బోదిబోమంటూ పోలీస్ స్టేష‌న్‌కు ప‌రుగులెత్తారు. తమ ఫేస్‌బుక్ ఖాతాల‌ను హ్యాక్ చేసిన అప‌రిచిత వ్య‌క్తులు తాము కోరినంత డ‌బ్బు ఇస్తేనే వాటిని రిలీజ్ చేస్తామంటూ బేరాలు ఆడారు.  ఈ  బెదిరింపుల‌కు లొంగిన 20 మంది రూ.3 వేల చొప్పున స‌మ‌ర్పించుకున్నారు.

బ్యాంకు పేరు చెప్పి..
ఫేస్‌బుక్ కేసు ఒక‌టైతే..బ్యాంకు కేసు మ‌రొక‌టి.. ప్రీతి  అనే అమ్మియిక కాల్ చేసిన ఒక‌త‌ను తాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నామ‌ని చెప్పిన  మీ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్  చేసుకోవాలని కోరాడు. అంతేకాదు ఇందుకోసం డెబిట్ కార్డు నంబ‌ర్ వివ‌రాలు అడిగాడు. ఆ త‌ర్వాత  వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ కూడా చెప్ప‌మ‌న్నాడు. అర‌గంట విరామం త‌ర్వాత త‌న అకౌంట్లో రెండుసార్లు రూ.25 వేలు క‌ట్ అయిన‌ట్లు ఆమెకు మెసేజ్ వ‌చ్చింది.  దీంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. మ‌రో కేసులో క‌మ‌ల్ అనే అత‌ణ్ని ఇన్సురెన్స్ మ‌నీ డ‌బుల్ చేస్తామ‌ని చెప్పి వివరాలు తీసుకుని ఆపై అత‌ని ఖాతాలో మొత్తాన్ని కాజేశారు అప‌రిచితులు. ఇవి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే ఇలా ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల్లో జ‌నాల‌ను మోసం చేయ‌డానికి ఆన్‌లైన్ దుండ‌గులు రంగంలోకి దిగిపోయారు. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా.. మీరు తీవ్రంగా న‌ష్ట‌పోవ‌డం ఖాయం.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు