• తాజా వార్తలు
  •  

ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్స్‌కు ఫోన్ కంటే పీసీయే సేఫ్.. ఎందుకో తెలుసా? 

డీమానిటైజేష‌న్ అంటూ గ‌తేడాది న‌వంబ‌ర్ 8న ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను స‌డెన్‌గా ర‌ద్దు చేసింది. దీంతో ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, నెట్‌లోనే మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌, వాలెట్ల ద్వారా పాలు, ప‌ళ్లు కూడా కొనుక్కోవ‌డం లాంటివి మొద‌ల‌య్యాయి.  పేటీఎం, మొబీక్విక్‌, ఫ్రీఛార్జిలాంటి మొబైల్ వాలెట్స్ ద్వారా ట్రాన్సాక్ష‌న్లు 2016 ఆగ‌స్టు నుంచి 2017 ఆగ‌స్టు వ‌ర‌కు చూస్తే 7,262 కోట్ల‌రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిగాయి. అంత‌కు ముందు సంవ‌త్స‌రం ఇది 3,704 కోట్లు మాత్ర‌మే.అంటే డ‌బుల్ అయింద‌న్న‌మాట‌.  వెబ్‌సైట్ల ద్వారా జ‌రిగే ట్రాన్సాక్ష‌న్స్ 142%, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్ష‌న్లు  93% పెరిగాయి.
స్మార్ట్‌ఫోన్ వ‌ల్లే..
  వీట‌న్నింటికీ డీమానిటైజేష‌న్తోపాటు స్మార్ట్‌ఫోన్ పెనిట్రేష‌న్ పెర‌గ‌డ‌మూ కార‌ణ‌మే. దేశంలో దాదాపు 34 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నార‌ని అంచనా  ఎక్కువ‌గా యూత్‌, ఎంప్లాయిస్‌, ర‌క‌ర‌కాల రంగాల్లో స్థిర‌ప‌డిన‌వారంతా సినిమా టికెట్ల నుంచి మ‌నీ ట్రాన్స్ఫ‌ర్ వ‌ర‌కూ ఎక్కువ‌గా స్మార్ట్‌ఫోన్‌నే యూజ్ చేస్తున్నారు. డెస్క్‌టాప్‌లో అయితే క్రోమ్‌, ఫైర్‌ఫాక్స‌లాంటి బ్రౌజ‌ర్‌లో బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయి ట్రాన్సాక్ష‌న్ చేసుకోవాలి. అదే మొబైల్‌లో అయితే యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు మీ పాస్‌వ‌ర్డ్ లేదా ఫింగ‌ర్ ప్రింట్ యాక్సెస్‌తో సెక‌న్స్‌లో ఓపెన్ చేసి చిటికెలో ట్రాన్సాక్షన్‌ చేయొచ్చు.  పేటీఎం, ఫ్రీఛార్జి, ట్రూకాల‌ర్ లాంటి వాలెట్ల‌యితే క్యూఆర్ కోడ్ స్కాన్‌తో పేమెంట్ చేసేయొచ్చు.  
ఎంత‌వ‌ర‌కు సేఫ్‌?
మొబైల్‌తో ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ ఎంత‌ వ‌ర‌కు సేఫ్ అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. పీసీలో అయితే ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ సేఫ్ అని ఇప్ప‌టికీ చాలామంది న‌మ్ముతున్నారు.   దానికి కార‌ణం లేక‌పోలేదు. పీసీలో యాప్స్ లేవు కాబ‌ట్టి వెబ్‌సైట్ల‌లోకి వెళ‌తాం. అవి ట్ర‌స్టెడ్ కాబ‌ట్టి మాల్వేర్స్ ఎంట‌ర్ కావు. ట్రాన్సాక్ష‌న్ సెక్యూర్‌గా ఉంటుంది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్  మొబైల్ యాప్స్‌లో అంత సెక్యూరిటీ ఉండ‌దు. 
* న‌కిలీయాప్స్‌కు లోటేం లేదు. ఒకోసారి ఒకే పేరుతో 20, 30 యాప్స్ కూడా క‌నిపిస్తాయి. కాబ‌ట్టి అఫీషియ‌ల్ వాలెట్‌, బ్యాంకింగ్ యాప్స్‌నే డౌన్‌లోడ్ చేసుకోవాలి. 
* హ్యాక‌ర్లు పాపుల‌ర్ యాప్స్ డౌన్లోడ్ చేసి, వాటిలో మాలిషియ‌స్ కోడ్ పెట్టి దాన్ని ప్లే స్టోర్‌లో ఆ పాపుల‌ర్ యాప్‌కు ఫ్రీ కాపీలా పెట్టేస్తారు. ఇలాంటి వాటిప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి.
* మంచి సెక్యూరిటీ సొల్యూష‌న్స్‌ను సెలెక్ట్ చేసుకుని ఫోన్‌లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. 
* అనుమానాస్ప‌దంగా, ఆఫ‌ర్స్‌, గిఫ్ట్‌లు, లాట‌రీలని ఊరించే ఈ మెయిల్స్‌ను ఓపెన్ చేయ‌కండి. ఎందుకంటే వాటిలో ఉండే మాల్‌వేర్ మీ ఫోన్‌లేదా పీసీలోకి ఎంట‌రై మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌,  మొబైల్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డ్‌ల‌ను రీడ్ చేస్తుంది. బీకేర్‌ఫుల్‌. 
 

జన రంజకమైన వార్తలు