• తాజా వార్తలు

సైబ‌ర్ క్రైమ్‌లో కొత్త ర‌కం.. టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ క‌థేంటో తెలుసా?

మైక్రోసాఫ్ట్‌, యాపిల్ లాంటి పెద్ద పెద్ద టెక్నాల‌జీ కంపెనీల కాల్ సెంట‌ర్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ వ‌చ్చే టెక్నిక‌ల్ స‌పోర్ట్ స్కామ్స్ ఇప్పుడు సైబ‌ర్ క్రైమ్‌లో కొత్త డెవ‌ల‌ప్‌మెంట్‌. ఫ‌లానా కంపెనీ కాల్ సెంట‌ర్  నుంచి కాల్ చేస్తు్న్నాం.  మీ సిస్టంలో వైర‌స్ ఉంది..  మాల్‌వేర్స్ ఎక్కువ‌గా ఉన్నాయి. హార్డ్‌డిస్క్ ఫెయిల‌య్యే ప్ర‌మాద‌ముంది.  స‌ర్వ‌ర్ క్రాష్ అయిపోవ‌చ్చు..వెంట‌నే కాల్ చేయండి అంటూ టెక్నిక‌ల్ సపోర్ట్ స్టాఫ్‌లా సైబ‌ర్ నేర‌గాళ్లు కాల్ చేస్తున్నారు. ఆ కాల్‌కు రెస్పాండ్ అయి కాల్ చేస్తే చాలు మీరు స్కామ్‌లో ఇరుక్కుపోయినట్లే. 
యూతే ఎక్కువ విక్టిమ్స్‌
టెక్ సపోర్ట్ స్కామ్స్ గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా బాగా పెరిగాయి. అమెరికా సీక్రెట్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ లెక్క‌ల ప్ర‌కారం గ‌త సంవ‌త్స‌రం 51 కోట్ల  రూపాయ‌ల‌కు పైగా విలువైన టెక్ స‌పోర్ట్ స్కామ్‌లు జ‌రిగాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటివ‌ర‌కు ఇలాంటివి 3ల‌క్ష‌ల‌కు పైగా కంప్ల‌యింట్స్‌వ‌చ్చాయి. ఇప్ప‌టికీ నెలకు యావ‌రేజ్‌న 12వేల కంప్ల‌యింట్స్ టెక్ స‌పోర్ట్ స్కామ్స్ మీదే వ‌స్తున్నాయంటూ  మైక్రోసాఫ్ట్ గోల పెడుతోంది.మైక్రోసాఫ్ట్ గ్లోబ‌ల్ స‌ర్వే ప్ర‌కారం ప్ర‌తి ముగ్గురు మైక్రోసాఫ్ట్ క‌స్ట‌మ‌ర్ల‌లో ఇద్దరు ఇలాంటి స్కామ్ బారిన‌ప‌డుతున్నారు.  ఐదుగురిలో ఒక‌ర‌న్నా మ‌నీ లాస్ అవుతున్నార‌ట‌. అదీకాక మిలీనియల్స్ (18 నుంచి 34 వ‌య‌సున్న‌వారు)ఎక్కువ ఈ స్కామ్‌ల్లో బాధితుల‌ని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.
ఎలా  జ‌రుగుతుంది?                   
ఈ స్కామ్ చేసేవాళ్లు మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌లాంటి పెద్ద కంపెనీల టెక్నిక‌ల్ స‌పోర్ట్ టీమ్ అని కాల్ చేస్తారు. టెక్నిక‌ల్ ప‌రిభాష‌లో మాట్లాడి మిమ్మ‌ల్ని న‌మ్మించాల‌ని చూస్తారు.
* మీ కంప్యూట‌ర్ వైర‌స్ ఎఫెక్ట్ అయింద‌ని లేదా హ్యాక్ అయింద‌ని భ‌య‌పెడ‌తారు. 
* కొంత‌మంది మీ సిస్ట‌మ్‌కు పాప్ అప్ మెసేజ్‌లు పెడ‌తారు.
* కొంత‌మంది అయితే మ‌రో అడుగు ముందుకేసి మీ సిస్టం పాడ‌యింది.. మీరు ఇన్ని గంట‌ల్లోగా కాల్‌చేయ‌క‌పోతే హార్డ్‌డిస్క్ మొత్తం పాడైపోతుంద‌ని కౌంట్ డౌన్ టైమ‌ర్ల పెట్టి మ‌రీ మెసేజ్ చేస్తారు.  
*  ఫ్రీ సెక్యూరిటీ స్కాన్ ఆఫ‌ర్ చేస్తామ‌ని చెబుతారు. వాళ్లిచ్చిన నెంబ‌ర్‌కు కాల్ చేయ‌మ‌ని చెబుతారు. 
* న‌మ్మి కాల్ చేస్తే చాలు మీ కంప్యూట‌ర్‌లో వైర‌స్ ఉందని, ప్రాబ్ల‌మ్‌ను ఫిక్స్ చేయాల‌ని క‌న్విన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.  టెంప్ట్ అయ్యామంటే చాలు  మీ ద్వారానే మీ సిస్ట‌మ్‌కు రిమోట్ యాక్సెస్ సంపాదిస్తారు. ఆ త‌ర్వాత  మీ సిస్ట‌మ్‌ను వాళ్ల గ్రిప్‌లోకి తీసుకుని దాని ద్వారా మీ డేటాను, బ్యాంక్ అకౌంట్ల‌ను కూడా హ్యాక్‌చేసి డ‌బ్బులు కొట్టేస్తారు.
 

జన రంజకమైన వార్తలు