• తాజా వార్తలు
  •  

ఫోన్ ద్వారా జ‌రిగే స్కామ్స్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి వ‌న్‌స్టాప్ గైడ్‌

రోజూ మ‌న ఫోన్‌కు ఎన్నో కాల్స్ వ‌స్తుంటాయి?  ఫ‌లానా గిఫ్ట్ వ‌చ్చింది కొంత అమౌంట్ క‌డితే మీకు పంపిస్తామ‌ని, మీ ఫోన్ నెంబ‌ర్ ఫ‌లానా కంపెనీ లాట‌రీలో ప్రైజ్ వ‌చ్చింది. క‌లెక్ట్ చేసుకోవ‌డానికి మీ క్రెడిట్ కార్డ్ చెప్ప‌మ‌ని ఇలా ఏవో కాల్స్‌, మెసేజ్‌లు వ‌స్తుంటాయి. చాలామంది వాటిని ప‌ట్టించుకోరు. కానీ ఇలాంటి సైబ‌ర్ నేర‌గాళ్లు ఓ ప‌ట్టాన వ‌ద‌లరు.  ఫ్రీ అన‌గానే ఎంతో కొంత ఆశ అంద‌రిలో ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ర‌క‌ర‌కాల జిమ్మిక్కులు చేస్తుంటారు.  
ఎస్ ఆర్ నో అంటే జాగ్ర‌త్త‌
చాలా కంపెనీలు క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ కోసం ఆటోమేటెడ్ వాయిస్ సిస్ట‌మ్స్‌ను పెట్టుకున్నాయి.  వీటితోనే చిక్కే. Can you hear me clearly? , Are you the landlady?, Do you pay the household bills? ఇలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారు. దీనికి “yes” or no అనే ఆప్ష‌న్లు మాత్ర‌మే ఉంటాయి.  వీటిలో ఏదో ఒక‌టి సెలెక్ట్ చేసుకోవాల్సిందే. దీన్ని రికార్డు చేసి మీ క్రెడిట్ కార్డ్స్ లిమిట్ పెంచ‌డం, కొత్త‌గా ఏవో యాడ్ ఆన్స్ చేయ‌డం, బిల్స్ ఆటో డెబిట్ అయ్యే ఆప్ష‌న్లు పెట్టుకునే ట్రిక్స్ చేస్తుంటాయి. వీటివ‌ల్ల ఒక్కోసారి మ‌న‌కు తెలియ‌కుండానే బిల్లు పెరిగిపోతుంది.   
ఫ్రీ హాలీడే ట్రిప్‌, ప్రైజులు  
ఫ్రీ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు. అదిగో ఆ ఫ్రీ అంటే వ‌చ్చే ఎక్సైట్‌మెంట్‌నే పెట్టుబ‌డిగా మీ దగ్గ‌ర నుంచి దోచేయ‌డానికి సైబ‌ర్ క్రిమినల్స్ సిద్ధంగా ఉంటారు. మీ మొబైల్  నెంబ‌ర్‌కు లాట‌రీ త‌గిలింది. లేదంటే మీరు మొన్న షాపింగ్ మాల్‌లో ఫాం ఫిల్ చేశారు క‌దా అందులో మీ వివ‌రాల‌తో ల‌క్కీ డ్రా తీశాం. ఫ్రీ  హాలీడే ట్రిప్ వ‌చ్చింది. ఇలాంటి మాట‌ల‌తో బురిడీ కొట్టిస్తారు.  ఈ ఫ్రీ గిఫ్ట్‌ల‌ను పొందాలంటే కొంత అమౌంట్  వాళ్ల అకౌంట్లో వేయ‌మ‌ని, లేదా క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ చెప్ప‌మ‌ని అడుగుతారు.  ఇలాంటి వాటి వివ‌రాలు  checkup.tel.లో ఉంటాయి. గ‌మ‌నించ‌వ‌చ్చు. 
ఛారిటీ, మెడిక‌ల్ స్కామ్స్ 
విక‌లాంగులు, అనాథ‌లు, వృద్ధుల‌కు సేవ‌చేస్తున్నామ‌ని డ‌బ్బులు మింగే బ్యాచ్‌లున్నాయి.  ఇలాంటి వారు చేసిన కాల్స్‌ను కూడా లెక్క‌లోకి తీసుకోకండి.   వ‌య‌సు మ‌ళ్లిన‌వారే టార్గెట్‌గా మీకు అన్ని జ‌బ్బుల‌కు ప‌నికొచ్చే హెల్త్ ప్యాకేజి ఉంది.  జ‌స్ట్ నాలుగైదు వేలు క‌డితే ఫ్యామిలీ అంతా క‌వ‌రేజ్‌లోకి వ‌స్తార‌ని దోచేసే మెడిక‌ల్ స్కామ్స్ కూడా ఉన్నాయి.   
ఎలా త‌ప్పించుకోవాలి?  
* మీ ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్ అంటే అడ్ర‌స్‌, బ్యాంక్ ఇన్ఫ‌ర్మేష‌న్‌, ఆఫీస్ ఐడీ నెంబ‌ర్‌ను ఎవ‌రికీ ఫోన్ కాల్‌లో ఇవ్వ‌ద్దు.
* ఇలా ఎవ‌రైనా కాల్ చేస్తే వాళ్ల గురించి ఎక్కువ ఇన్ఫ‌ర్మేష‌న్ తెలుసుకోండి. నెంబ‌ర్ ఇవ్వండి నేనే ఆలోచించుకుని కాల్ చేస్తా అని చెప్పండి.  ఈలోగా దాని గురించి నెట్‌లో వెత‌కండి.  ఇలాంటి సంద‌ర్భాల్లో వాళ్లు మ‌ళ్లీ కాల్ చేయ‌రు.  
3. వైర్ ట్రాన్స్‌ఫ‌ర్ లేదా ప్రీ పెయిడ్ కార్డ్‌ల ద్వారా డ‌బ్బులు పంప‌డం, క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్‌లు నెంబ‌ర్లు చెప్ప‌డంకూడా చేయకండి. 
4. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోండి. ఫోన్ నెంబ‌ర్ మారిస్తే దాన్ని బ్యాంక్‌లో  మీ అకౌంట్‌కు లింక్ చేసుకోవ‌డం మ‌ర్చిపోకండి. 
5. ఆధార్ రిలేటెడ్ ఫ్రాడ్స్ పెరిగాయి. కాబ‌ట్టి ఆధార్ నెంబ‌ర్ కూడా ఎవ‌రైనా ఫోన్‌లో అడిగినా చెప్పొద్దు. 
 

జన రంజకమైన వార్తలు