• తాజా వార్తలు
  •  

ఆధార్ డేటా లా మన వేలిముద్రలు లీకైతే ఏమౌతుంది ?

ఆధార్‌... ఆధార్‌! ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. ఎక్క‌డ విన్నా ఇదే మాట‌. ప్ర‌భుత్వం అయితే ప్ర‌తి ప‌థ‌కానికి ఆధార్‌తో లింక్ పెడుతోంది. బ్యాంకులు, ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌న్నీ ఆధార్ ఉంటేనే అనే కండిష‌న్ పెడుతున్నాయి. చివ‌రికి సిమ్ కార్డు తీసుకోవ‌డానికి కూడా ఆధార్ త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. మ‌రి ఆధార్‌కు నిజంగా అంత శ‌క్తి ఉందా? ఆధార్‌తో బ్యాంకు అకౌంట్, పాన్ కార్డు, సిమ్ కార్డులను లింక్ చేసుకుంటే ఇబ్బంది లేదా?

హ్యాక‌ర్లు ఉన్నారు జాగ్ర‌త్త‌...
ఆధార్ ప‌ని చేసేది బ‌యోమెట్రిక్ ఆధారంగానే. మ‌న వేలి ముద్ర‌లు యూనిక్‌గా ఉండ‌డంతో పౌరుల ఐడెంటిటీని గుర్తించ‌డానికి ఆధార్‌కు మించిన ఆప్ష‌న్ లేద‌నేది ప్ర‌భుత్వం ఆలోచ‌న‌. అయితే ఇదే బ‌యోమెట్రిక్ విధానం హ్యాక‌ర్లు చొర‌బ‌డేందుకు అవ‌కాశాన్ని ఇస్తోంది. ఒకప్పుడు పాస్‌వ‌ర్డ్స్ లాంటి వాటినే హ్యాక‌ర్లు దొర‌క‌బుచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు బ‌యోమెట్రిక్‌ను కూడా హ్యాక‌ర్లు హ్యాక్ చేస్తున్నారు.  12 అంకెల యూనిక్ ఆధార్ ఐడెంటిఫికేష‌న్ నంబ‌ర్ కూడా ఇప్పుడు సేఫ్ జోన్‌లో లేదు. 

దొంగిలిస్తున్నారిలా..
పాస్‌వ‌ర్డ్స్‌ను మార్చిన‌ట్లు బ‌యోమెట్రిక్ డేటాను అస్త‌మానం ఛేంజ్ చేయ‌డం కుద‌ర‌దు. అందుకే ఫింగ‌ర్‌ప్రింట్స్‌ను కాపీ చేయ‌గ‌లిగితే చాలు బ‌యోమెట్రిక్‌ను సైతం గుప్పిట్లోకి తెచ్చుకోవ‌చ్చు. హ్యాక‌ర్లు ప్ర‌స్తుతం చేస్తుంది ఇదే. ప్ర‌స్తుతం ఆధార్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను సెంట్ర‌ల్ ఆధార్ ఇన్ఫ‌ర్మేష‌న్ వెరిఫై చేస్తుంది.   అయితే వారు ఫింగ‌ర్‌ప్రింట్స్‌ను స‌రిగా చెక్ చేయ‌క‌పోతే అంతే! హ్యాక‌ర్ల‌కు ఆ ఆధార్ డేటా దొరికేసిన‌ట్లే.  మీ స్మార్ట్‌ఫోన్‌లో సింగిల్ ట‌చ్  ద్వారా ఈ ఆధార్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. స్మార్ట్‌ఫోన్ డేటాను క్యాప్చ‌ర్ చేస హ్యాక‌ర్లు ఈ ఆధార్ డేటాను కూడా దొంగిలిస్తున్నారు. జ‌స్ట్ వారికి  ఫింగ‌ర్ ప్రింట్ దొరికితే చాలు. డేటా మొత్తం చిక్కిపోయిన‌ట్లే.  అయితే ప్ర‌భుత్వం మాత్రం ఆధార్ టెంప‌రింగ్ ఎట్టి ప‌రిస్థితుల్లో జ‌ర‌గ‌ట్లేద‌ని చెబుతోంది .కానీ హ్యాక‌ర్లు మాత్రం త‌మ ప‌నిలో తాము ఉన్నారు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు