• తాజా వార్తలు

మీ వైఫైని హ్యాకర్ల నుంచి కాపాడ‌టానికి ప‌ది సూత్రాలివిగో..

ఈరోజుల్లో వైఫై వాడ‌ని వాళ్లు చాలా అరుదు. ఒక‌ప్పుడు కంప్యూట‌ర్‌లో మాత్ర‌మే వైఫై ఉండేది. సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు పెరిగిపోయాక‌.. ప్ర‌తి ఇంట్లో వైఫై మ‌స్ట్ అయిపోయింది. అయితే మ‌న వైఫై ఎంత వ‌ర‌కు సేఫ్‌. మ‌నం ఉప‌యోగిస్తున్న వైఫైతో ఏమైనా ప్ర‌మాదం ఉందా? అప్పుడప్పుడు అది ఎందుకు మోరాయిస్తుంది. ఉన్న‌ట్టుండి ఆగిపోతుంది. మీకు తెలియ‌కుండానే ఎందుకు డేటా క‌రిగిపోతుంది? .. తెర వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. మ‌రి వాటిని ఫిక్స్ చేయ‌డం ఎలా? . వైఫైని హ్యాక‌ర్ల దాడుల నుంచి సంర‌క్షించుకోవ‌డం ఎలా? ..దీనికి కొన్ని సూత్రాలు ఉన్నాయి.. అవేంటో చూద్దామా..

1. వైఫైని సెక్యూర్‌గా ఉంచ‌డం కోసం మాటీ వాన్‌ఙొఫ్ అనే రీసెర్చ‌ర్  ఒక కొత్త ప్రొటొకాల్ క‌నిపెట్టాడు.  డ‌బ్ల్యూపీఏ2లో వాడే ఈ ప్రొటోకాల్ కొత్త‌గా వ‌స్తున్న అన్ని ర‌కాలు వైఫై నెట్‌వ‌ర్క్‌ల‌ను సెక్యూర్‌గా ఉంచుతుంది.

2. కీ రీఇనిస్టాలేషన్ అటాక్స్ (క్రాక్స్‌) ద్వారా వైఫై నెట్‌వ‌ర్క్స్‌పై బాగా దాడి చేస్తున్న వైర‌స్‌ను క‌నిపెట్టి వాటిని అప్ప‌టిక‌ప్పుడే నిరోధించొచ్చు. ఈ టెక్నాల‌జీ మీ ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్లు, ఇత‌ర డివైజ్‌ల‌ను స్కాన్ చేస్తుంది.  మీ వైఫైతో క‌నెక్ట్ అయి ఉన్న అన్ని డివైజ్‌ల‌ను సుర‌క్షితంగా ఉంచుతుంది.

3. చాలామంది హ్యాక‌ర్లు మ‌న‌కు సంబంధించిన డేటాను దొంగిలించ‌డమే కాదు... ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్‌ల‌ను మ‌న డివైజ్‌ల‌లోకి పంపుతున్నారు. రామ్స‌మ్‌వేర్‌, మాల్‌వేర్ లాంటి వైర‌స్‌లు మ‌న సైట్ల‌లోకి చొర‌బ‌డేది ఇలాగే..  వీటిని నిరోధించ‌డానికి క్రాక్స్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

4. వైఫై స్టాండ‌ర్డ్‌ను బ‌ట్టి కూడా వైర‌స్‌లు అటాక్ చేసే అవ‌కాశాలున్నాయి. అందుకే స్టాండ‌ర్డ్ వైపైతో పాటు దాన్ని వాడ‌కం కూడా కీలక‌మే. అందుకే డ‌బ్ల్యూపీఏ2ను స‌మ‌ర్థంగా వాడుకోవాలి.

5. ఎంతో సుర‌క్షితం అనుకునే యాపిల్ కూడా దాడుల బారిన ప‌డుతోంది. ఆండ్రాయిడ్‌, లినెక్స్‌, విండోస్‌, ఓపెన్ బీఎస్‌డీల మీద కూడా అటాక‌ర్స్ దాడులు చేస్తున్నారు. ఈ దాడుల‌ను నిరోధించ‌డానికి యూజ‌ర్లు త‌మ డివైజ్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.

6.  ఒక్కోసారి పాస్‌వ‌ర్డ్‌లు మార్చినా దాడుల నుంచి మ‌నం త‌ప్పించుకోలేం. ఎందుకంటే  రామ్స‌మ్‌వేర్ లాంటి వైర‌స్‌లు చొర‌బ‌డితే ఎంటైర్ సిస్ట‌మ్‌ను కంట్రోలోకి తెచ్చ‌కుంటాయి. దీనికి మందు ఏంటంటే అప్‌డేటెడ్ ఓఎస్‌ను వాడ‌డ‌మే. 

7. మంచి రోట‌ర్ వాడ‌డం కూడా ముఖ్య‌మే. రోట‌ర్ వీక్‌గా ఉంటే హ్యాక‌ర్ల‌కు పండ‌గే. స్మార్టుఫోన్లు, ల్యాప్‌టాప్‌ల‌ను అప్‌డేట్ చేసుకుంటూ ఉంటే మ‌నం అటాక్స్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. 

8. సెక్యూరిటీ లేని డ‌బ్ల్యూఈపీ ప్రొటాకాల్‌ను వాడ‌డం చాలా ప్ర‌మాదం. సెక్యూర్‌గా ఉండే ప్రొటొకాల్‌ను మాత్ర‌మే వైఫై కోసం ఉప‌యోగించాలి.

9. స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల‌కు వైఫైని క‌నెక్ట్ చేసిన‌ప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలో కావాలి. నిబంధ‌న‌లను అనుస‌రించి అలెర్ట్‌గా ఉండాలి.

10. కంపెనీలు నిషేధించిన కొన్ని ఫోన్ల‌ను కొంటే ఇంతే సంగ‌తులు. అందుకే దొంగ ఫోన్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. వాటిలో వైర‌స్ ఉండే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. వీటిలో మ‌న‌కు ఎలాంటి అప్‌డేట్స్ రావు. కాబ‌ట్టి బ్రాండ్ న్యూ ఫోన్ కొనాలి. 

జన రంజకమైన వార్తలు