• తాజా వార్తలు

ఫోన్ ద్వారా మీ డ‌బ్బులు కొట్టేసే ట్రోజ‌న్ జేఫ్‌కాపీ నుండి జాగ్ర‌త్త ప‌డండి ఇలా.. 


మీ స్మార్ట‌ఫోన్ ద్వారా మీకు తెలియ‌కుండానే డ‌బ్బులు కొట్టేసే కొత్త మాల్‌వేర్ ఒక‌టి ఇప్పుడు ఆందోళ‌న పెడుతోంది. జేఫ్‌కాపీ (Xafecopy) పేరిట వ‌చ్చే ఈ ట్రోజ‌న్ బ్యాట‌రీ మాస్ట‌ర్ లాంటి యాప్స్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లో చొరబ‌డుతుంది.  WAP బిల్లింగ్ ప‌ద్ధ‌తిలో మ‌నీ స్పెండ్ చేసేవ‌ర‌కు దాక్కుని ఆ క్రెడెన్షియ‌ల్స్‌తో మీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్‌, మొబైల్ వాలెట్స్ లోంచి డ‌బ్బును మీకు తెలియ‌కుండానే కొట్టేస్తుంది. ఈ ట్రోజ‌న్ ప్ర‌మాదం మ‌న‌కు ఎంత వ‌ర‌కు ఉంది? ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టిక‌ల్ చ‌దవాల్సిందే. 
ఇండియ‌న్స్‌కే ఎఫెక్ట్ ఎక్కువ‌
లీడింగ్ యాంటీ వైర‌స్ ప్రొవైడ‌ర్ కేస్ప‌ర్ స్కై ( Kaspersky) రిపోర్ట్ ల ప్ర‌కారం జేఫ్‌కాపీ మాల్‌వేర్ బ్యాట‌రీ మాస్ట‌ర్ లాంటి యాప్స్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ల‌లో చేరుతుంది. అక్క‌డ దాక్క‌ని Wireless Application Protocol (WAP) billing. ద్వారా మీరు ఏదైనా ప‌ర్చేజ్ చేసినా, బిల్ చెల్లించినా యాక్టివేట్ అవుతుంది. ఇండియాలో వాప్ రిలేటెడ్ స‌ర్వీసులంటే రింగ్‌టోన్స్‌,గేమ్స్‌, స్క్రీన్ సేవ‌ర్స్ వంటివే ఎక్కువ‌. అయితే స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాక వీటిని వాడేవారు బాగా త‌గ్గారు. అయితే వాప్ బేస్డ్ ఫైనాన్స్ స‌ర్వీసులు కూడా ఉన్నాయి.  ఒక‌వేళ అలాంటి వాప్ బిల్లింగ్ చేస్తే  ఆ క్రెడెన్షియ‌ల్స్‌ను ఐడెంటిఫై చేసి మీ కార్డ్‌లు, వాలెట్ల‌లోని మ‌నీతో అలాంటి మీ ఫోన్ బిల్ ద్వారా వాప్ బిల్లింగ్ చేసుకుని ఆ మ‌నీని  మీకు తెలియ‌కుండానే కొట్టేస్తుంది. వాప్ బిల్లింగ్ కావ‌డంతో ఓటీపీ అక్క‌ర్లేదు. కాబ‌ట్టి నెక్స్ట్ మంత్ మీకు ఫోన్ బిల్లు వ‌చ్చేవ‌ర‌కు మీ డ‌బ్బులు పోయాయ‌న్న సంగ‌తి కూడా మీకు తెలియ‌ద‌ట‌.  
బాధితుల జాబితాలో 47 దేశాల్లో 4,800 మంది  ఉన్నారు. విక్టిమ్స్‌లో 37.5% మంది ఇండియ‌న్సే . త‌రా్వ‌త ర‌ష్యా, ట‌ర్కీలాంటి దేశాల్లోని యూజ‌ర్లున్నారు.  
 ఎలా జాగ్ర‌త్త‌ప‌డాలి? 
 Kaspersky Labs ఎక్స్‌ప‌ర్ట్‌లు ఈ ట్రోజ‌న్ బారిన‌ప‌డ‌కుండా ఏం జాగత్త‌లు తీసుకోవాలో చెబుతున్నారు. 
* ఈ మాల్‌వేర్ మీకు ఇన్‌క‌మింగ్ మెసేజ్‌లు, అల‌ర్ట్స్ రాకుండా అడ్డుకుంటుంది. కాబ‌ట్టి అలా జ‌రిగితే వెంట‌నే అల‌ర్ట‌వ్వాలి.
* థ‌ర్డ్ పార్టీ యాప్స్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ న‌మ్మొద్దు
* ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని వెరిఫై యాప్స్ యుటిలిటీతో స్కాన్ చేశాకే ఇన్‌స్టాల్ చేసుకోండి. 
* మొబైల్ సెక్యూరిటీ సూట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం మంచిది.  
 

జన రంజకమైన వార్తలు