• తాజా వార్తలు
  •  

ఏటీఎం కార్డు ఫ్రాడ్‌కు గుర‌యితే మీ బ్యాంక్ ఎంత‌వ‌ర‌కు ల‌య‌బుల్‌గా ఉంటుందో తెలుసా? 

టెక్నాల‌జీతో పాటే సైబ‌ర్ క్రైమ్ కూడా రాకెట్ స్పీడ్‌తో డెవ‌ల‌ప్ అవుతోంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో బాగా ఈజీ టార్గెట్ ఏటీఎం. కార్డ్ క్లోనింగ్‌, ఏటీఎం మిష‌న్‌లో డూప్లికేట్ కీప్యాడ్ పెట్టి మీ డిటెయిల్స్ క‌నుక్కోవ‌డం ఇలాంటి ట్రిక్స్ అన్నింటితో..  ఏటీఎంను వాడిన త‌ర్వాత ఆ క్రెడెన్షియ‌ల్స్‌తో  అకౌంట్ల‌ను హ్యాక‌ర్లు ఖాళీ చేసేసిన ఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయి. రీసెంట్‌గా రెండు వారాల క్రితం ఢిల్లీలోని క‌ల్‌కాజి ఏరియాలో ఓ ఏటీఎంను ఇలాగే హ్యాక్ చేసి చాలా మంది క‌స్ట‌మ‌ర్ల డ‌బ్బులు కొట్టేశారు. కొంత మంది త‌మ అకౌంట్ల‌లోని ల‌క్ష‌ల రూపాయ‌ల పోయాయ‌ని గోల‌పెట్టారు. అస‌లు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు మీ బ్యాంకు ఎంత వ‌ర‌కు బాధ్య‌త వ‌హిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 
డిజిట‌ల్ ఇండియా ఇనీషియేష‌న్‌తో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల వైపు వెళ్లాల‌ని ప‌దేప‌దే కోరుతోంది. అందుకే సైబ‌ర్ థ్రెట్స్‌పైనా రిజ‌ర్వ్ బ్యాంక్  దృష్టిపెట్టింది.  మీ అకౌంట్స్ నుంచి అనాథ‌రైజ్డ్  ఎల‌క్ట్రానిక్ ట్రాన్సాక్ష‌న్ల వల్ల మీరు మ‌నీ లాస్ అయితే బ్యాంకులు ఎంత వ‌ర‌కు బాధ్య‌త వ‌హించాల‌న్న దానిపై ఆర్‌బీఐ త‌న నార్మ్స్‌ను రివైజ్డ్ చేసింది. వీటి ప్ర‌కారం  
జీరో ల‌య‌బిలిటీ 
కంట్రిబ్యూట‌రీ ఫ్రాడ్‌, నిర్ల‌క్ష్యం, బ్యాంకు సేవ‌ల్లో లోపం వ‌ల్ల డ‌బ్బులు పోతే క‌స్ట‌మ‌ర్‌కు బాధ్యత ఉండ‌దు. అది బ్యాంక్ బాధ్య‌తే.  దీనిమీద క‌స్ట‌మ‌ర్ కంప్ల‌యింట్ చేసినా, చేయ‌క‌పోయినా బ్యాంకుదే బాధ్య‌త‌. ఇక థ‌ర్డ్‌పార్టీ మోసాల వ‌ల్ల లాస్ అయితే బ్యాంక్ బాధ్య‌త వ‌హిస్తుంది. కానీ ఇలాంటి సంద‌ర్భాల్లో క‌స్ట‌మ‌ర్  మూడు వ‌ర్కింగ్ డేస్‌లోగా బ్యాంక్‌కు తెలియ‌ప‌ర‌చ‌డం త‌ప్ప‌నిస‌రి.  
లిమిటెడ్ ల‌య‌బిలిటీ 
అనాథ‌రైజ్డ్ ఎల‌క్ట్రానిక్  ట్రాన్సాక్ష‌న్స్ వ‌ల్ల మ‌నీ లాస్ అయిన‌ప్పుడు బ్యాంకు కొంత వ‌ర‌కే బాధ్య‌త తీసుకునే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. 
* క‌స్ట‌మ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల మ‌నీ పోతే బ్యాంకు బాధ్య‌త తీసుకోదు. అంటే పేమెంట్స్ క్రెడెన్షియ‌ల్స్ ( క్రెడిట్ , డెబిట్  కార్డ్ లేదా అకౌంట్ నెంబ‌ర్‌, ఓటీపీ, పిన్ వంటివి) ఎవ‌రైనా అడిగితే చెప్ప‌డం వంటివి జ‌రిగితే సాధార‌ణంగా బ్యాంకు త‌మ బాధ్య‌త కాదంటుంది. అందుకే ఈ డిటెయిల్స్ చెప్పొద్దంటూ బ్యాంకుల‌తోపాటు ఆర్‌బీఐ కూడా త‌ర‌చూ క‌స్ట‌మ‌ర్ల‌కు మెసేజ్‌లు పంపుతుంటాయి. అయితే ఇలాంటి ఫ్రాడ్ గురించి బ్యాంక్‌కు వెంట‌నే కంప్ల‌యింట్ చేస్తే బ్యాంకు ఆ లాస్‌కు బాధ్య‌త తీసుకునేందుకు ఛాన్స్‌లున్నాయి.  
* క‌స్ట‌మ‌ర్ లేదా బ్యాంక్ వ‌ల్ల కాకుండా సిస్టంలో ఎక్క‌డైనా ఏదైనా అవ‌కాశాన్ని వాడుకుని హ్యాక‌ర్లు మీ డ‌బ్బులు కొట్టేస్తే బ్యాంకు దానికి బాధ్య‌త తీసుకుంటుంది. అయితే ఈ ట్రాన్సాక్ష‌న్ గురించి బ్యాంకు నుంచి మీకు మెసేజ్ వ‌చ్చిన నాలుగు నుంచి 7 వ‌ర్కింగ్ డేస్‌లోగా బ్యాంక్‌కు కంప్ల‌యింట్ చేయాలి. ఆ త‌ర్వాత  కంప్ల‌యింట్ చేస్తే   బ్యాంక్ ఎంత వ‌ర‌కు బాధ్య‌త వ‌హించాల‌నేది ఆ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్ట‌ర్స్ అప్రూవ్ చేసే పాల‌సీ మీద ఆధార‌ప‌డి ఉంటుంది.  అంతేకాదు ఇలాంటి ట్రాన్సాక్ష‌న్‌లో లాస్ అయిన మ‌నీలో ఎంత వ‌ర‌కు తిరిగివ్వాల‌నేది ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్ర‌కార‌మే ఇస్తారు.   బ్యాంకులు త‌మ పాల‌సీని అకౌంట్ ఓపెన్ చేసిన‌ప్పుడు ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్‌లోనే చెబుతాయి. 

జన రంజకమైన వార్తలు