• తాజా వార్తలు
  •  

ఫ్లాష్.. ఫ్లాష్: ఆంధ్రప్రదేశ్ పోలీసుల నెట్ వర్క్ హ్యాకింగ్.. ఎంత నష్టం? ఎవరు సేఫ్...?


ఏపీ పోలీసుల నెట్ వర్క్ ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. చిత్తూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాల్లోని పోలీస్ నెట్ వర్క్ ను హ్యాక్ చేశారు. దీంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పోలీసు శాఖ తీవ్రంగా నష్టపోయినట్లు సమాచారం. ఏపీలో దీని ప్రభావం ఎంత? ముఖ్య అధికారుల కంప్యూటర్ల పరిస్థితి ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విషయంలో ‘కంప్యూటర్ విజ్ఞానం’ అందిస్తున్న పూర్తి సమాచారం.

ఏమైంది..?
కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగింది. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు, తిరుపతి, కలికిరి పోలీసు స్టేషన్లలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. దీనికి సంబంధించి తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హ్యాకర్లు విన్సీ వైరస్ ను చొప్పించడంతో ఇది జరిగింది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..
ఒక్క ఏపీలోనూ, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో పోలీసు వ్యవస్థలోని కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని పోలీసు శాఖ ఐజీ దామోదర్ ఇప్పటికే ప్రకటించారు. పోలీసు శాఖలోని కీలక సమాచారం పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపీ పోలీసు వ్యవస్థలోని పాతిక శాతం కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని వివరించారు. హ్యాకింగ్ కు గురైన కంప్యూటర్ల డీకోడింగ్ కు ప్రయత్నిస్తున్నామన్నారు.

డీజీపీ సాంబశివరావు కంప్యూటర్ సేఫ్
ఒక ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలోని కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ సాంబశివరాలు ధృవీకరించారు. తన కంప్యూటర్ హ్యాక్ కాలేదని చెప్పిన ఆయన తాను ఐవీ వాడుతున్నందున హ్యాక్ అయ్యే అవకాశం లేదన్నారు. విండోస్ వాడుతున్న కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని నిర్ధారించారు.

ప్రపంచవ్యాప్తంగా..
100 దేశాల్లో కంప్యూటర్లపై హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ప్రపంచం వ్యాప్తంగా సమాచార, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు కుప్పకూలుతున్నాయి. హ్యాకర్ల ధాటికి లండన్ లో వైద్య ఆరోగ్య సేవలు స్థంభించాయి. ఏపీలోని 25 శాతం పోలీస్ వ్యవస్థకు చెందిన కంప్యూటర్లను హ్యాక్ చేసినట్టు ర్యాన్సమ్ వేర్ ప్రకటించింది. సరికొత్త మాల్ వేర్ తో దాడులు చేసిన హ్యాకర్లు...ఈ కంప్యూటర్లను తిరిగి ఓపెన్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్ గా నిపుణులు చెబుతున్నారు.

ఎయిర్ లైన్స్ విలవిల..
దీంతో ఎయిర్ లైన్స్ తోపాటు ఇతర సంస్థలు కూడా సైబర్ ఎటాక్ బారినపడ్డాయని తెలుస్తోంది. కంప్యూటర్ ఓపెన్ చెయ్యగానే ఒక మెసేజ్ వస్తోందని, అది ఓపెన్ చేయ్యగానే...కంప్యూటర్ మొత్తం కోడింగ్ లోకి మారిపోతుందని తెలుస్తోంది. దానిని తిరిగి ఓపెన్ చెయ్యాలంటే డబ్బులు కట్టాలని మెసేజ్ కూడా వస్తోంది. దీంతో దీనిని డీ కోడ్ చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ సైబర్ అటాక్ బారిన అమెరికా, రష్యా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు, చైనా తదితర దేశాలు ఉన్నాయి.

అమెరికాలో...
అమెరికా వాడే హ్యాకింగ్‌ టూల్స్‌నే హ్యాకర్లు కొల్లగొట్టారు. తద్వారా వేలాది కంప్యూటర్లలో రాన్సమ్‌వేర్‌ వైరస్‌ను ప్రవేశపెట్టి సమాచారాన్ని చోరీ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఈ రాన్సమ్‌వేర్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది.

వన్నా క్రై..
'వన్నా క్రై' అనే పేరుతో కంప్యూటర్లలోకి చొచ్చుకుపోతున్న ఈ వైరస్‌..క్షణాల్లో కంప్యూటర్ వ్యవస్థను స్తంభింపజేస్తుంది. వైరస్‌ ఎంటరైన క్షణాల్లోనే..డబ్బు చెల్లిస్తేగానీ పని నడవదంటూ ఓ సందేశం కన్పిస్తోంది. ఆ వెంటనే మొత్తం ఐటీ వ్యవస్థ సమస్తం మొరాయిస్తుంది. కేవలం 10 గంటల వ్యవధిలోనే ఏకంగా 45 వేలకు పైగా సైబర్‌ దాడులు జరిగినట్లు గుర్తించారు. సుమారు 60వేల కంప్యూటర్ల సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు.

ప్రపంచంలో అత్యంత భద్రతా విభాగం ఉన్న అమెరికా భద్రతా విభాగం అమెరికా జాతీయ సెక్యూరిటీ సంస్థ ఉపయోగించే హ్యాకింగ్‌ టూల్స్‌తో ఈ సైబర్‌దాడులు జరిగాయి. ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలు దీని బారిన పడ్డాయి.

సైబర్‌ అటాక్‌ కారణంగా మరో పెనుముప్పు కూడా ఎదురవుతోందని నిపుణులు భావిస్తున్నారు. 'వాన్నక్రై' వైరస్‌ ప్రధానంగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన 'ఎటర్నల్‌ బ్లూ' అనే తాజా ప్యాచ్‌ ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు. ఇంకోవైపు డబ్బు డిమాండ్‌ చేస్తూ కంప్యూటర్‌ తెరలపై దర్శమిస్తున్న సందేశాలు...ఇప్పుడు వాట్సాప్‌లోనూ ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. ఇది మరింత విస్తరించే ప్రమాదం వుందని, చరిత్రలో ఇదే అతి పెద్ద సైబర్‌ అటాక్‌ కావచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు