• తాజా వార్తలు
  •  

ఈ-వాలెట్  క్లోనింగ్ .. మీ డిజిట‌ల్ వాలెట్లో మ‌నీని దోచేసే కొత్త స్కాం.. త‌స్మాత్ జాగ్ర‌త్త 

డీమానిటైజేష‌న్‌తో డిజిట‌ల్ వాలెట్ల‌కు డిమాండ్ పెరిగింది. పేటీఎం, మొబీక్విక్ లాంటి వాలెట్ల‌లో మ‌నీ లోడ్ చేసుకుని వాటితో పేమెంట్ చేసుకునే అవ‌కాశం ఉండ‌డంతో ల‌క్ష‌లాది మంది వాడుకుంటున్నారు. పాల‌బూత్‌ల నుంచి గ‌ల్లీలో కిరాణా కొట్టు వ‌ర‌కు అన్నిచోట్లా పేటీఎం ఎవాయిల‌బుల్ వంటి బోర్డులు క‌నిపిస్తున్నాయి.  పేటీఎం, మొబీక్విక్ వంటి వాలెట్ల‌ నుంచి మ‌నీని బ్యాంక్ అకౌంట్‌కు కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది.  దీంతో చాలా మంది వేల రూపాయ‌లు వాలెట్ల‌లో లోడ్ చేసి కావాల్సిన‌ట్లు వాడుకుంటున్నారు. కానీ ఇలా వాలెట్ల‌లో ఉండే మ‌నీని దోచేసే హ్యాక‌ర్లు బ‌య‌లుదేరారు. ఈ వాలెట్ క్లోనింగ్‌తో  ఢిల్లీలో ఓ యువ‌కుడి వాలెట్‌లోంచి ఏకంగా 47వేలు దోచేశారు. 
ఢిల్లీలో అగ‌ర్వాల్ అనే యువ‌కుడు త‌న పేటీఎం వాలెట్‌లో క్రెడిట్ లిమిట్ పెంచాల‌ని పేటీఎంకు రిక్వెస్ట్ పంపాడు. దీన్ని హ్యాక‌ర్ హ్యాక్ చేశాడు. అత‌ని ద‌గ్గ‌రు నుంచి గంట‌న్న‌ర త‌ర్వాత అక్ష‌య్‌కు  కాల్ వ‌చ్చింది. అవ‌తలి వ్య‌క్తి తాను పేటీఎం ఏజెంట్‌నంటూ   అక్ష‌య్ పేటీఎం అకౌంట్ డిటెయిల్స‌న్నీ చెప్పాడు. క్రెడిట్ లిమిట్ రిక్వ‌స్ట్ యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ కోసం  పేటీఎం యాప్‌ను ఓపోన్ చేసి ఉంచాల‌ని అక్ష‌య‌ను కోరాడు.  అక్ష‌య్ అలా ఓపెన్ చేసి ఉంచ‌గానే అత‌ని వాలెట్ లోంచి  46,995 రూపాయ‌లు   డెబిట్ అయిపోయాయి.   మొత్తం ఆరు నిముషాల కాల్‌లో ఈ దోపిడీ జ‌రిగిపోయింది. దీనిపై అక్ష‌య్ పోలీస్ కంప్ల‌యింట్ ఇచ్చాడు.  పేటీఎం కు కూడా కంప్ల‌యింట్ చేశాడు. దీనిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామ‌ని పేటీఎం కూడా చెప్పింది. అయితే హ్యాక‌ర్లు అడిగిన లాగిన్ వివ‌రాలు  చెప్పి ఉంటే ఇలాంటి వి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటోంది. 
ఎలా జ‌రిగి ఉంటుంది? 
హ్యాక‌ర్  అక్ష‌య్ ఫోన్‌ను వైర‌స్‌తో  ఎఫెక్ట్ చేసి ఉంటాడ‌ని ఇంట్రూడో  సెక్యూరిటీస్  డైరెక్ట‌ర్ మోహిత్ యాద‌వ్  అన్నారు.  ఈ వైర‌స్ మెసేజ్ లేదా మెయిల్ ద్వారా వ‌స్తుంది. దీన్ని ఫోన్‌లో ఉన్న యాంటీవైర‌స్ కూడా గుర్తించ‌లేద‌ని చెప్పారు.  ఈ బ‌గ్ ద్వారా హ్యాక‌ర్లు మీ అకౌంట్ డిటెయిల్స్  వాలెట్ ఏజెంట్ల‌లా కాల్ చేసి మీ వాలెట్ డిటెయిల్స్ చెబుతారు. వాళ్లు నిజ‌మైన ఏజంట్లేన‌ని న‌మ్మి వారు చెప్పిన‌ట్లు చేస్తే ఇలా నిలువు దోపిడీ గుర‌య్యే ప్ర‌మాద‌ముంది.  
ఎలా జాగ్ర‌త్త‌ప‌డాలి? 
*  అనుమానాస్పదంగా ఎస్ఎంఎస్‌లు, మెయిల్స్ ను ఓపెన్ చేయొద్దు. 
* అథెంటికేష‌న్ లేని  యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌ద్దు  
* మీ అకౌంట్ డిటెయిల్స్ చెప్పి మీ లాగిన్ వివ‌రాలు, ఓటీపీ వంటివి అడిగే ఎలాంటి  ఫిషింగ్ కాల్స్ కూ రెస్పాండ్ కావ‌ద్దు
* ఈ-వాలెట్లో మ‌నీని క్ష‌ణాల్లో యాడ్ చేసుకోవ‌చ్చు కాబ‌ట్టి ఎంత అవ‌స‌ర‌మో అంతే యాడ్ చేసుకుని వాటిని వాడుకుంటే బెట‌ర్‌. ఎక్కువ అమౌంట్ ఉంటే ఇలాంటి హ్యాకింగ్ స‌మ‌యంలో ఎక్కువ న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది.

జన రంజకమైన వార్తలు