• తాజా వార్తలు
  •  

ఆధార్-సిమ్ లింక్ చేసినందుకు రూ 1,10,000/- లు నష్టమా?

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మీ ఆధార్ తో సిమ్ ను అనుసంధానం చేయడం అనే ప్రక్రియ కు విపరీతమైన ప్రచారం జరుగుతుంది. చాలా మంది కస్టమర్ లు స్వచ్చందం గా తమ ఆధార్ ను సిమ్ తో లింక్ చేసుకుంటున్నారు. అయితే తన సిమ్ ను ఆధార్ తో లింక్ చేయబోయినందుకు ఒక వ్యక్తి రూ 1,10,000/- లు నష్టపోయిన సంగతి జైపూర్ లో జరిగింది.

బాదితుడు జైపూర్ లోని బాపు నగర్, జనతా స్టోర్ నివాసి. అతని పేరు sk. బ్రిజ్వాని. ఒక యువకుడు తానూ ఫలానా కంపెనీ నుండి అనీ మీ సిమ్ తో ఆదార్ నెంబర్ ను లింక్ చేస్తానని ఆదార్ నంబర్ తీసుకున్నాడు. అయితే అతను ఆదార్ సీడింగ్ చేయకుండా ఆ సిమ్ ను డీ యాక్టివేట్ చేసి బ్రిజ్వాని కి వేరే కొత్త సిమ్ ఇచ్చాడు. అదేమని అడిగితే ఆధార్ సీడింగ్ ఇలాగే చేస్తారని చెప్పాడు. పాత సిమ్ ను ఉపయోగించి బ్రిజ్వాని ఎకౌంటు నుండి రూ 1,10,000/- లు విత్ డ్రా చేశాడు. మనవాడు డబ్బు కోసం బ్యాంకు కు వెళ్ళినపుడు అంత మొత్తం లో డబ్బు అతని ఎకౌంటు నుండి మాయం అవ్వడం చూసి అవాక్కయ్యాడు.

అసలు ఈ మోసం ఎలా జరిగింది ?          

మొట్టమొదట తన యొక్క మొబైల్ నంబర్ ను ఆదార్ తో లింక్ చేయాలనీ అలా చేయకపోతే సిమ్ డీ యాక్టివేట్ అవుతుందనీ ఒక కాల్ వచ్చింది. తర్వాత ఆ సిమ్ ను సర్వీస్ సెంటర్ కు పంపవలసిందిగా ఒక SMS వచ్చింది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఆ సిమ్ పనిచేయడం ఆపివేసింది. మరుసటి రోజు బ్యాంకు కు వెళ్లి చూస్తే డబ్బు మాయం.

ప్రస్తుతం ఈ కేసు గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయ్యి ఉంది. మార్చ్ 31 లోగా మొబైల్ నంబర్ లకు ఆధార్ సీడింగ్ చేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం లో దేశం లో ఇంకా ఆదార్ సీడింగ్ చేయనివారు 50 కోట్ల మంది ఉన్నారు. దీని తరవాత మొబైల్ సిమ్ లను ఆదార్ తో అనుసంధానం చేసేందుకు కొత్త మార్గాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

జన రంజకమైన వార్తలు