• తాజా వార్తలు
  •  

దీపావ‌ళి అయిపోయినా డిస్కౌంట్ ఆఫ‌ర్లు ఎందుకు అయిపోలేదో తెలుసా?

ద‌స‌రా వెళ్లిపోయింది.. దీపావ‌ళీ వెళ్లిపోయింది. కానీ స్మార్ట్‌ఫోన్ల మీద డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.  సాధార‌ణంగా పండ‌గ అయిపోగానే ఆఫ‌ర్లు ఎత్తేసే కంపెనీలు, ఈ-కామ‌ర్స్ సైట్లు దీపావ‌ళి ముగిసి వారం గ‌డుస్తున్నా ఇంకా ఎందుకు వాటిని అలాగే కొన‌సాగిస్తున్నాయి. తెలుసుకోవాల‌నుకుంటున్నారా?  
ఇండియాలో  ద‌స‌రా, దీపావ‌ళికి ఫెస్టివ‌ల్ మూడ్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది.  ఈ రెండు పండ‌గ‌లు దేశ‌మంతా జ‌రుపుకొంటారు. కంపెనీలు ఈ పండ‌గ‌ల‌కే ఉద్యోగుల‌కు బోన‌స్‌ల‌వీ ఇస్తుంటాయి. దీంతో కొత్త వ‌స్తువులు కొనే జోష్ ఎక్కువ ఉంటంది. టీవీలు, వాషింగ్‌మెషీన్లు వంటి వ‌స్తువులు, టూవీల‌ర్లు, కార్లు కూడా ఈ సీజ‌న్‌లోనే బాగా అమ్ముడ‌వుతాయి. ఇక స్మార్ట్‌ఫోన్ల‌యితే ఈ సీజ‌న్‌లో విపరీతంగా అమ్ముడ‌వుతాయి. అందుకే కంపెనీలు భారీగా ప్రొడ‌క్షన్ చేసి పెట్టాయి. 
కార‌ణాలు ఇవిగో..
*  కొత్త స్మార్ట్‌ఫోన్ ఎప్పుడొస్తే, లేదంటే పాత ఫోన్ ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు మార్చేసే జ‌నాలు పెర‌గ‌డంతో  ప్ర‌త్యేకించి పండ‌గ‌ల సీజ‌న్లోనే కొనాలని రూలేమీ ఉండ‌డం లేదు. అందుకే కంపెనీలు ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయిలో అమ్మ‌కాలు జ‌ర‌గలేదు. 
* ఈ సారి ద‌స‌రా, దీపావ‌ళి పండ‌గ‌లు గతంతో పోల్చుకుంటే ఒక 20 రోజులు ముందే వ‌చ్చాయి. సాధార‌ణంగా దీపావ‌ళి న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో వ‌స్తుంది. అప్పుడు బాగా ప్రొడ‌క్ట్‌లు అమ్మిన కంపెనీలు ఒక నెల ఆగి క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్ సేల్స్ మొద‌లుపెట్టేవి. ఈ సారి అక్టోబ‌ర్ 19కే దీపావ‌ళి కూడా ముగిసిపోయింది. రెండు నెల‌లపాటు ఏ ప్రొడ‌క్ట్‌లూ అమ్మ‌క‌పోతే ఎలా అని కంపెనీలు క‌స్ట‌మ‌ర్ల‌తో ప్రొడ‌క్ట్ కొనిపించ‌డానికి డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఇస్తున్నాయి.  న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్ నెల‌ల్లో కూడా ఇవి కంటిన్యూ అవుతాయని మార్కెట్ అంచ‌నా. 
* సెల్‌ఫోన్స్ సేల్స్‌లో 30% వ‌ర‌కు అక్టోబ‌ర్ -న‌వంబ‌ర్ పండ‌గ‌ల సీజ‌న్‌లోనే జ‌రుగుతాయి. అయితే ఏడాది పొడ‌వునా  ఏదో ఒక ఆఫ‌ర్లు ఉండ‌డం, ఆఫ్‌లైన్ సేల్స్ కూడా పెర‌గ‌డంతో ఆన్‌లైన్ సేల్స్ ఆశించినంత‌గా జ‌ర‌గలేదు.
ఇప్పుడేం చేస్తున్నాయి? 
కంపెనీలు హ్యాండ్‌సెట్స్‌పై డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. క్యాష్‌బ్యాక్ స్కీమ్‌లు, ఎక్సేంజ్ ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. ఈ వ‌రుస చూస్తే ఈ -కామర్స్ సైట్ల‌లో  పోస్ట్ దీపావ‌ళి సేల్ అనో, ప్రీ క్రిస్మ‌స్ సేల్ అనో మ‌రో సేల్ స్టార్టయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. 


పండ‌గ‌ల సీజ‌న్‌లో ఆఫ‌ర్ల గురించి కంగారుప‌డొద్దు.  ఇవి త‌ర్వాత కూడా కొన‌సాగుతాయ‌ని కంప్యూట‌ర్ విజ్ఞానం ఈ సీజ‌న్‌కు ముందే చెప్పింది. కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
http://computervignanam.net/article/E-comerce/festive-sales-is-an-illusion-is-it-right/2714.cv


 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు