• తాజా వార్తలు
  •  

ట్యాక్స్ పేయ‌ర్స్ స‌మ‌స్య‌ల‌కు ఆన్‌లైన్లో స‌మాధానాలు చెప్పే సిస్టం ర‌డీ 

ట్యాక్స్ పేయర్స్ సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పే సిస్టం రడీ ట్యాక్స్ పేయర్స్‌కు  డైరెక్ట్ ట్యాక్స్ అంశాల్లో వచ్చే బేసిక్ డౌట్స్‌కి
 సమాధానాలు ఇక ఈజీగా తెలుసుకోవచ్చు. ట్యాక్స్ పేయర్స్ సమస్యలు పరిష్కరించేందుకు ఐటీ డిపార్ట్ మెంట్ కొత్త డైరెక్టరేట్ ను ఏర్పాటు చేసింది.   ఇప్పుడు ఆన్ లైన్ చాట్  సర్వీస్ ను కూడా లాంచ్ చేసింది. ఐటీ డిపార్ట్ మెంట్ అఫీషియల్ వెబ్ సైట్ www.incometaxindia.gov.in/లో 'Live Chat Online- ask your query'అని ఒక ఐకాన్ ప్రామినెంట్ గా కనిపిస్తుంది.  డౌట్ లేదా కొర్రీ ఉన్నవారు సొంత మెయిల్ ఐడీతో chat roomలోకి ఎంటరై ప్రశ్నలు అడగొచ్చు. 
స్పెష‌ల్ టీమ్‌తో స‌మాధానాలు
వీటికి సమాధానాలు చెప్పడానికి ఐటీ డిపార్ట్ మెంట్ లోని ఎక్స్‌ప‌ర్ట్‌ల  టీమ్‌తో పాటు  కొంత మంది ఇండిపెండెంట్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ను కూడా అపాయింట్ చేశారు.  భవిష్యత్తు లో రిఫరెన్స్ కు వాడుకోవడానికి ఈ చాట్ ను మొత్తం మీకు మెయిల్ చేసే ఫెసిలిటీ కూడా కల్పించారు. ట్యాక్స్ పేయర్స్కి సర్వీస్ పెంచడానికి ఫస్ట్ టైం ఇలాంటి సర్వీస్ ను ప్రవేశపెట్టామని ఐటీ శాఖ ప్రకటించింది. దీనికి వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి online chatకి మరిన్ని ఫీచర్లు. యాడ్ చేస్తామని చెప్పింది.

జన రంజకమైన వార్తలు