• తాజా వార్తలు
  •  

ఈ అమ్మాయే ఆ ‘ల‌క్కీ’ గాళ్‌

‘ల‌క్కీ’ గ్రాహ‌క్ ఎవ‌రో తెలిసిపోయింది. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌ను ఎంక‌రేజ్ చేసేందుకు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌వేశ‌పెట్టిన ల‌క్కీగ్రాహ‌క్ యోజ‌న‌ మెగా డ్రాలో కోటి రూపాయ‌ల బంప‌ర్ ప్రైజ్ ఎగ‌రేసుకుపోయిన అదృష్టం ఎవ‌రికి ద‌క్కిందో తెలిసిపోయింది. మ‌హారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన ఎల‌క్ట్రిక‌ల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయ‌ర్ స్టూడెంట్‌ను అదృష్ట లక్ష్మి వరించింది. మొబైల్‌ ఈఎంఐ పేమెంట్‌ను రూపేకార్డు ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించిన‌ శ్రద్ధ మోహన్ అనే 20 ఏళ్ల అమ్మాయి లక్కీ గ్రాహక్ యోజన కింద కేంద్రం ప్ర‌క‌టించిన కోటి రూపాయల బంప‌ర్ ప్రైజ్‌ను లు దక్కించుకుంది. ఇంత‌కీ ఆ అమ్మాయి చేసిన ట్రాన్సాక్ష‌న్ ఎంతో తెలుసా. జస్ట్ 1,590 రూపాయ‌లు. శ‌నివారం అంబేద్క‌ర్ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా నాగ‌పూర్‌లో జ‌రిగిన ఓ ప్రోగ్రాంలో ఏకంగా ప్రైమ్ మినిస్ట‌ర్ మోడీ చేతుల మీదుగా చెక్ అందుకుంది. సెకండ్ ప్రైజ్ రూ. 50లక్షల నగదు బహుమతి గుజరాత్‌కు చెందిన హార్దిక్‌ కుమార్‌ (29)ని వరించింది. ప్రైమరీ స్కూల్ టీచర‌యిన హార్థిక్ కూడా రుపే కార్డు ద్వారా రూ.1110 ఆన్‌ లైన్ ట్రాన్సాక్ష‌న్ చేశారు.
100 ఖ‌ర్చుతో 25 ల‌క్ష‌ల ప్రైజ్‌
ఇక మూడో బ‌హుమ‌తి విన్న‌ర్‌ది మ‌రీ ల‌క్కీ. ఉత్త‌రాఖండ్‌లోని షెర్పూర్ విలేజ్‌కు చెందిన భ‌ర‌త్ సింగ్ అనే వ్యక్తి కేవ‌లం 100 రూపాయ‌ల‌తో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ చేసి ల‌క్కీగ్రాహ‌క్ యోజ‌న‌లో థ‌ర్డ్ ప్రైజ్ 25 ల‌క్ష‌లు సంపాదించేశాడు.
అన్నీ రూపే కార్డుల‌తోనే..
మూడు బంప‌ర్ ప్రైజ్‌లు గెలుచుకున్న‌ది రూపేకార్డు యూజ‌ర్లే కావ‌డం విశేషం. వీళ్లు ముగ్గురూ క‌నీసం 2వేల లోపు ట్రాన్సాక్ష‌న్లు చేసిన‌వాళ్లు కూడా కాక‌పోవ‌డం మ‌రో స్పెష‌ల్‌.

జన రంజకమైన వార్తలు