• తాజా వార్తలు
  •  

ఆన్ లైన్లో బంగారం కొంటున్నారా? అయితే ఇలా జాగ్రత్త పడండి

బంగారం షాపులకు వెళ్లి కొనుగోలు చేసే రోజులు పోయాయ్. ఇప్పుడంతా ఆన్ లైన్ రాజ్యమే నడుస్తోంది. ఇంట్లో కూర్చుండి...మౌస్ క్లిక్ చేస్తే....నిమిషాల్లో నగలు మీ ముందుంటాయి. కానీ ఆన్ లైన్లో బంగారం కొనుగోలు చేసేప్పుడు ...మనకు ఓ  క్లారిటీ ఉండాలి. దుకాణాల్లోకి వెళ్లి కొనుగోలు చేయడం వేరు. ఆన్ లైన్లో కొనుగోలు చేయడం వేరు. ఆన్ లైన్లో బంగారం కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటో ఓసారి చూడండి. నమ్మకం....

లక్షలాది రూపాయలతో బంగారం కొనుగోలు చేసేముందు....కచ్చితంగా బెస్ట్ సైట్ ఏది ఉందో తెలుసుకోవాలి. మీ సెల్లర్ గురించి...వెబ్ సైట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. థర్డ్ పార్టీ సోర్స్, ఇంతకుముందు కొనుగోలు చేసినవారి అభిప్రాయాలు తెలుసుకున్నాకే కొనుగోలు చేయడం ఉత్తమం. అంతేకాదు పేరున్న వెబ్ సైట్లలో బంగారం కొంటేనే మంచిది.

రివ్యూ,ఫీడ్ బ్యాక్

ఆన్ లైన్లో నగలు కొనుగోలు చేసేటప్పుడు రివ్యూస్, ఫీడ్ బ్యాక్ తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇంతకుముందు కొనుగోలు చేసిన యూజర్లు రివ్యూలు, ఫీడ్ బ్యాక్ ఇస్తుంటారు. వాటిని ఓసారి చెక్ చేసుకున్నాకే బంగారం కొనాలి.

బెటర్ ఇమేజ్ లు

మీరు ఏ నగలు కొనాలనుకున్నారో....వాటిని క్షుణంగా తనిఖీ చేయాలి. పేరున్న జ్యూవెల్లరీ షాపుల్లో నగలకు సంబంధించిన ఎక్కువ ఫోటోలను పెడుతుంటారు. ముందు, వెనక, ఎడమ, కుడి ఇలా ప్రతి ప్రొడక్టుకు సంబంధించి ఇమేజ్ ఉంటుంది. వాటన్నింటిని పరిశీలించాకే కొనాలి.  

చెక్ సర్టిఫికేషన్ లు

బంగారం ఎక్కడ కొన్నా...ఒకటి గుర్తుంచుకోవాలి. హాల్ మార్క్ గుర్తింపు ఉన్న బంగారంనే కొనాలి. హాల్ మార్క్ బంగారంలో ఎలాంటి కల్తీ ఉండదు. అంతేకాదు జ్యూవెల్లరీ సర్టిఫికేట్స్, లాబ్ రిపోర్ట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

సెక్యూర్ పే మెంట్స్

దుకాణాల్లో నగలు కొనుగోలు చేసినట్లయితే...మీకు చెక్ అవుట్ను తప్పకుండా అందిస్తాయి. అడ్రస్ బార్ లో HTTPS మార్క్ కోసం చూడండి. ఇలాంటి వాటిలో పేమేంట్ ఇన్ఫర్మేషన్ సేఫ్ గా ఉందని సూచిస్తుంది.

 
 

జన రంజకమైన వార్తలు