• తాజా వార్తలు
  •  

త‌త్కాల్ కాన్సిలేష‌న్ స్కీమ్‌లో ఈ మార్పులు మీకు తెలుసా?

రైల్వే త‌త్కాల్ టికెట్ రూల్స్ మారాయి.  చాంతాండత రిజ‌ర్వేష‌న్ క్యూలో ఉంటే బెర్త్ క‌న్ఫ‌ర్మ్ కాద‌నుకునేవారికి, అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌యాణం పెట్టుకునేవారి కోసం ప్ర‌యాణానికి ఒక రోజు ముందు మాత్ర‌మే త‌త్కాల్ టికెట్లు ఇష్యూ చేస్తారు. ఇది వ‌చ్చాక రిజ‌ర్వేష‌న్ల ఇబ్బందులు కొంత త‌గ్గాయి. అయితే దీనిలో క్యాన్సిలేష‌న్‌, రిఫండ్ వంటివ‌న్నీ మిగ‌తా రిజ‌ర్వేష‌న్ టికెట్ల‌తో కంపేర్ చేస్తే డిఫ‌రెంట్‌. లేటెస్ట్‌గా ఈ రూల్స్‌ను రైల్వే డిపార్ట్ మెంట్ మ‌ళ్లీ మార్చింది.  
1. త‌త్కాల్ క్యాన్సిలేష‌న్ 
కొత్త రూల్ ప్ర‌కారం మీ ఆర్ఏసీ  త‌త్కాల్ టికెట్ ను ట్ర‌యిన్ బ‌య‌ల్దేర‌డానికి అర‌గంట ముందు వ‌ర‌కు క్యాన్సిల్ చేసుకోవ‌చ్చు. ఫ‌స్ట్‌లో క‌న్ఫ‌ర్మ్ అయితేనే త‌త్కాల్ టికెట్ ఇచ్చేవారు. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్‌, ఆర్ ఏసీ ఉన్నా త‌త్కాల్ టికెట్ ఇస్తున్నారు. ఇంత‌కుముందు 24 గంట‌ల ముందే క్యాన్సిల్ చేసుకోగ‌లిగే అవ‌కాశం ఉండేది.  

2. త‌త్కాల్ రిఫండ్ 
 వెయిటింగ్ లిస్ట్‌, ఆర్ ఏసీలో బుక్ చేసిన త‌త్కాల్ టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయ్యాక క్యాన్సిల్ చేస్తే ఒక్క రూపాయి కూడా రిఫండ్ రాదు. 
3.  ఒక్క‌రికి క‌న్ఫ‌ర్మ్ కాక‌పోయినా రిఫండ్ 
మీరు మీ ఫ్యామిలీలో న‌లుగురికి ఇలా త‌త్కాల్ టికెట్లు బుక్ చేశారు. ముగ్గురికి క‌న్ఫ‌ర్మ్ అయి ఒకరికి కాలేద‌నుకోండి. అప్పుడు క్యాన్సిల్ చేస్తే అంద‌రి టికెట్ డ‌బ్బులూ రిఫండ్ ఇచ్చేస్తారు. 
4.  టీడీఆర్ క్యాన్సిలేష‌న్ 
ట్ర‌యిన్ మూడు గంట‌ల‌కంటే ఎక్కువ సేపు లేట్ న‌డుస్తుంటే మీ త‌త్కాల్ టికెట్ (Ticket Deposit Receipt -TDR) ను క్యాన్సిల్ చేసుకోవ‌చ్చు. మీకు ఫుల్ రిఫండ్ వ‌స్తుంది. అయితే కౌంట‌ర్లోనే క్యాన్సిల్ చేసుకోవాలి. రీజ‌న్ మ‌స్ట్‌గా రాయాలి.  
5. పే లేట‌ర్‌
త‌త్కాల్ టికెట్ల‌కు కూడా రైల్వే పే లేట‌ర్ స‌ర్వీసును తీసుకొచ్చింది. మీరు టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల త‌ర్వాత మ‌నీ పే చేసేందుకు ePayLater  స‌ర్వీసును ఉప‌యోగించుకోవ‌చ్చ‌.  Pay-on-Delivery scheme ద్వారా త‌త్కాల్ టికెట్ బుక్ చేసుకుంటే  టికెట్ మీ ఇంటికి వ‌చ్చాక డ‌బ్బులు  పే చేయొచ్చు. అయితే ఈ రెండు స‌ర్వీసుల‌కు ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. 

జన రంజకమైన వార్తలు