• తాజా వార్తలు
  •  

ఆధార్ కార్డ్ ద్వారా బినామీ ఆస్తుల్ని ఎలా క్యాచ్ చేయొచ్చో తెలుసా?

డీమానిటైజేష‌న్‌కు నిన్న‌టితో సంవ‌త్స‌రం నిండింది.  దేశంలో బ్లాక్‌మ‌నీని బ్లాక్ చేయాలంటే పెద్ద నోట్ల ర‌ద్దే మార్గ‌మని ప్ర‌ధాని మోడీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతోపాటు ఇప్పుడు బినామీ ఆస్తుల్ని వెతికిప‌ట్టే చ‌ట్టానికి ప‌దునుపెడుతున్నారు.  ఇండియాలో అన్నింటికీ ఆధారమ‌వుతున్న ఆధార్ కార్డే అస్త్రంగా ఇప్పుడు బినామీ ఆస్తుల‌ను పోగేసిన బ‌డా బాబుల ఆట క‌ట్టించాల‌ని గ‌వ‌ర్న‌మెంట్ డిసైడ‌యింది. 
బినామీ ఆస్తులంటే.. 
బినామీ ఆస్తులంటే ఏమిటి?  అడ్డ‌దిడ్డంగా డ‌బ్బులు సంపాదించిన వ్య‌క్తులు లేదా సంస్థ‌లు వాటితో ప్రాప‌ర్టీస్ కొని  త‌మ ద‌గ్గర ప‌నిచేసేవాళ్ల పేరు మీదో, లేదా బంధువుల్లో పెద్ద‌గా డ‌బ్బుల్లేనివారి పేరు మీదో  పెడ‌తారు. వాస్త‌వానికి త‌మ పేరిట ఆస్తులున్నాయ‌ని వారికి కూడా తెలియ‌దు. 
చ‌ట్టం వ‌చ్చి 30 ఏళ్లు 
ఇలా బినామీ పేరుతో కొన్న ప్రాప‌ర్టీస్ లేదా వారి పేరు మీద డిపాజిట్ చేసిన మ‌నీని ప‌ట్టుకోవ‌డానికి  ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ 1988లోనే Benami Transactions (Prohibition) Act ను తీసుకొచ్చింది. అయితే ఇండియాలో చాలా చ‌ట్టాల మాదిరిగానే ఇది కూడా పుస్త‌కాల్లోనే ఉంది త‌ప్ప  నిజంగా అమ‌లు కావ‌డం లేదు. దీంతో  కొన్ని ల‌క్ష‌ల కోట్ల బ్లాక్‌మ‌నీ కొంత మంది బ‌డాబాబుల చేతుల్లో ఇరుక్కుపోయిన‌ట్లే  వేలు, ల‌క్ష‌ల కోట్ల విలువైన బినామీ ప్రాప‌ర్టీస్ కూడా పేరుకుపోయాయి. 
ఇప్పుడేం చేస్తారు? 
ఆధార్ కార్డ్‌ వ‌చ్చాక  బోగ‌స్‌లు ఉంటే ఏరేయ‌డం ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఆధార్ కార్డ్‌నే ఉప‌యోగించి బినామీ ప్రాప‌ర్టీస్‌ను బ‌య‌టికి లాగ‌డానికి వీలుగా బినామీ ట్రాన్సాక్ష‌న్ ప్రొహిబిష‌న్ యాక్ట్‌కు లాస్ట్ ఇయ‌ర్ ఎమెండ్‌మెంట్స్ చేశారు. దీని ప్ర‌కారం పేద‌వారు, డ్రైవ‌ర్లు, వంట‌వారు, తోట‌ప‌నిచేసేవారు, రోజుకూలీలు వంటి వారి పేరు మీద ఏమైనా భారీ ఆస్తులున్నాయేమో గుర్తిస్తారు. ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, పొలిటీషియ‌న్స్‌, కాంట్రాక్ట‌ర్స్‌, సెల‌బ్రిటీస్ ద‌గ్గ‌ర ప‌ని చేసే ఇలాంటి వ్య‌క్తుల‌మీద దృష్టి పెడ‌తారు. వాళ్ల పేరు మీద ఏ ఆస్తులున్నా ఆధార్ నెంబ‌ర్‌తో లింక్ చేయాలి. చాలావ‌ర‌కు ఇలా త‌మ పేరుమీద ప్రాప‌ర్టీస్ ఉన్నాయ‌ని వారికి తెలియ‌దు. వారు ఆ ప్రాప‌ర్టీ త‌మ‌దికాదంటే గ‌వ‌ర్న‌మెంట్ స్వాధీనం చేసుకుంటుంది.  ఒక‌వేళ వారికి దాని గురించి అవ‌గాహ‌న ఉండి ఆ ఆస్తి త‌మ‌దే అంటే  దాన్ని కొన‌డానికి ఇన్‌కం సోర్స్ అడుగుతారు.  వాళ్లు చెప్ప‌లేక‌పోయినా ఆ ప్రాప‌ర్టీస్ గ‌వర్న‌మెంట్ క్ల‌యిం చేస్తుంది.  

 

జన రంజకమైన వార్తలు