• తాజా వార్తలు

ఇకపై ఆధార్ వెరిఫికేష‌న్ కోసం ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ స్టోర్ల‌కు వెళ్ల‌న‌వ‌స‌రం లేదు

టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లంద‌రూ త‌మ క‌స్ట‌మ‌ర్ల ఆధార్ నెంబ‌ర్ల‌ను రీ వెరిఫికేష‌న్ చేసుకోవాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆదేశించింది. దీనికి ఫిబ్ర‌వ‌రి 6 వ‌ర‌కు గ‌డువిచ్చింది. క‌స్ట‌మ‌ర్లు త‌మ మొబైల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు (ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా మొద‌లైన‌వి) స్టోర్‌కు వెళ్లి బ‌యోమెట్రిక్ మిష‌న్‌లో త‌మ ఆధార్‌ను రీవెరిఫై చేయించుకోవాలి.  అయితే సీనియ‌ర్ సిటిజ‌న్లు చాలా మందికి   వేలిముద్ర‌లు స‌రిగా ప‌డ‌క‌పోవ‌డంతో ఆధార్‌తో మ్యాచ్ కావ‌డం లేదు.  తీసుకున్న‌ప్ప‌టి వేలిముద్ర‌ల‌తో స‌రిపోవ‌డం లేదు.  ఇలాంటి ఇబ్బందులన్నీ తీర్చ‌డానికి రెండు కొత్త ప‌ద్ధ‌తుల‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ జ‌న‌వ‌రి 1 నుంచి అందుబాటులోకి తెస్తుంది. ఈ-కేవైసీ ఫెసిలిటీ ఇందులో ఒక‌టి.  
ఐవీఆర్ బేస్డ్ రీవెరిఫికేష‌న్ 
ఇది మొబైల్ యూజ‌ర్లంద‌రూ చేసుకోవ‌చ్చు. అయితే మీ మొబైల్ నెంబ‌ర్ ఆధార్ రిజిస్ట్రేష‌న్ చేయించుకునేట‌ప్పుడు  UIDAI ద‌గ్గ‌ర రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
1. మీరు రీవెరిఫికేష‌న్ చేయించుకోవాల‌నుకున్న మొబైల్ నెంబ‌ర్ నుంచి టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్  యొక్క ఐవీఆర్ స‌ర్వీస్‌కు కాల్ చేయాలి.
2. మీ లాంగ్వేజ్‌ను నేష‌నాలిటీని బ‌ట్టి సెలెక్ట్ చేసుకోవాలి. విదేశీయులు అయితే మీకు వేరే సెప‌రేట్ ప్రొసీజ‌ర్ ఉంటుంది.  
3. లాంగ్వేజ్ సెలెక్ట్ చేయ‌గానే ఆధార్ యాక్ట్ 2016 ప్ర‌కారం మీ మొబైల్ నెంబ‌ర్ వెరిఫికేష‌న్ చేసుకోవడానికి సిద్ధ‌మేనా అని ఐవీఆర్ మెసేజ్ వినిపిస్తుంది. 
4. మీరు ఓకే చెప్ప‌గానే మీ మొబైల్ స‌ర్వీస్ కంపెనీ మీ మొబైల్ నెంబ‌ర్‌ను UIDAI కి పంపిస్తుంది. అక్క‌డ మీ నెంబ‌ర్ రిజిస్ట‌ర్ అయి ఉంటే  UIDAI మీకు ఓటీపీ పంపిస్తుంది.  
• ఇప్పుడు మీ టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ మీ డేట్ ఆఫ్ బ‌ర్త్‌, అడ్ర‌స్ లాంటి ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్ అడుగుతుంది. ఓటీపీ కూడా ఎంట‌ర్ చేస్తే మీ  మొబైల్ రీవెరిఫికేష‌న్ పూర్త‌యిన‌ట్లు మెసేజ్ వినిపిస్తుంది. 
* మీ మొబైల్ నెంబ‌ర్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన‌ట్లు  24 గంట‌ల్లో సెల్ నెంబ‌ర్‌కు మెసేజ్ పంపిస్తుంది.  ఒక‌వేళ వివ‌రాలు త‌ప్పు అనుకుంటే మూడు రోజుల్లోగా రియాక్ట్ అవ్వాలి.అలా కాక‌పోతే మీ మొబైల్ నెంబ‌ర్ స‌క్సెస్‌ఫుల్‌గా రీవెరిఫై అయిన‌ట్లు కంపెనీ రిజిస్ట‌ర్ చేసుకుంటుంది. 

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌, విక‌లాంగుల కోసం టీఎస్‌పీ పోర్ట‌ల్ ద్వారా 
70 ఏళ్లు వ‌య‌సు పైబ‌డిన‌వారు, ఫిజిక‌ల్లీ హ్యాండీకాప్డ్ ప‌ర్స‌న్స్ మొబైల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల స్టోర్స్‌కు వెళ్ల‌క్క‌ర్లేకుండా ఆ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ రీవెరిఫికేష‌న్ చేయించుకోవ‌చ్చు.  
1. మీ టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి  మీ మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి.  
2.మీరు జ‌న‌వ‌రి 1, 2018 నాటికి మీ వ‌య‌సు 70 ఏళ్లు దాటింద‌ని లేదా విక‌లాంగుల‌ని, ఇండియ‌న్ అని ,  UIDAI ద‌గ్గ‌ర మీ ఆధార్ నెంబ‌ర్ రిజిస్ట‌ర్ అయిలేదని, ఆధార్ లో ఉన్న‌ట్లు బ‌యోమెట్రిక్ వివ‌రాల‌తో స‌రిపోల్చ‌డానికి వేలిముద్ర‌లు స‌హ‌క‌రించ‌డంలేద‌ని, మీరు అప్‌లోడ్ చేస్తున్న డాక్యుమెంట్స్ అన్నీకరెక్టేన‌ని, న‌కిలీ ప‌త్రాలుంటే చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని  మీరు డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి.  
3. డిక్ల‌రేష‌న్ ఇచ్చిన త‌ర్వాత మీ మొబైల్‌కు 4 డిజిట్స్ కోడ్ వ‌స్తుంది. దాన్ని వెబ్‌సైట్‌లో ఎంట‌ర్ చేస్తే ఆన్‌లైన్ క‌స్ట‌మ‌ర్ అప్లికేష‌న్ ఫాం (e-CAF) క‌నిపిస్తుంది.  
4. దీనిలో  మీ ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్‌, స్కాన్ చేసిన ఫొటో, గ‌వ‌ర్న‌మెంట్ ఐడీ ప్రూఫ్ అటాచ్ చేయాలి.  
5  e-CAF స‌బ్మిట్ చేయ‌గానే 8 అంకెల ట్రాన్సాక్ష‌న్ ఐడీ స్క్రీన్ మీద క‌నిపిస్తుంది. దీని వ్యాలిడిటీ 48 గంట‌లు  
6. 48 గంట‌ల్లోగా దీన్ని ట్ర‌స్టెడ్ ప‌ర్స‌న్‌కు షేర్ చేస్తే ఆ వ్య‌క్తి టీఎస్‌పీ పోర్ట‌ల్‌లో ఎంట‌ర్ చేస్తారు.   
7. మీ మొబైల్ నెంబ‌ర్‌, ట్రాన్సాక్ష‌న్ ఐడీ వెరిఫై చేసి త‌ర్వాత ఆధార్ నెంబ‌ర్‌, వివ‌రాల‌న్నీ ట్ర‌స్టెడ్ ప‌ర్స‌న్‌వి ఎంట‌ర్ చేసి ప్రొసీజ‌ర్ పూర్తి చేస్తారు.
8. త‌ర్వాత మీకు మొబైల్ నెంబ‌ర్ వెరిఫై అయిన‌ట్లు 4 రోజుల్లోగా మెసేజ్ వ‌స్తుంది.  

జన రంజకమైన వార్తలు