• తాజా వార్తలు

స్మార్ట్‌ఫోన్ల సేల్స్‌ను పెంచ‌డానికి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ చేస్తున్న లేటెస్ట్ ట్రిక్స్

ఆన్‌లైన్ మార్కెటింగ్ అన‌గానే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాత్ర‌మే గుర్తొస్తాయి. ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు మార్చుంటూ, వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఈ ఇ-కామ‌ర్స్ దిగ్గ‌జాలు ముందంజ‌లో ఉంటాయి.  అందుకే దాదాపు అన్ని ఫోన్ కంపెనీలు ఈ ఆన్‌లైన్ సంస్థ‌ల‌తో ఒప్పందం చేసుకోవ‌డానికే మొగ్గు చూపుతాయి. ఎందుకంటే డైరెక్ట్ మార్కెట్లో అమ్మ‌డం క‌న్నా.. ఆన్‌లైన్ ద్వారా అమ్మితేనే ప్రొడెక్ట్ చాలా వేగంగా అమ్ముడుపోతుండ‌డంతో అన్ని ఫోన్ల కంపెనీలు ఈ రెండు ఆన్‌లైన్ సంస్థ‌ల‌తో టై అప్ అవుతున్నాయి. ముఖ్యంగా భార‌త్‌లో పాగా వేసిన చైనా కంపెనీలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల ద్వారానే త‌మ సేల్స్‌ను ఎక్క‌డికో తీసుకెళ్లాయి. ఈ నేప‌థ్యంలో స్మార్ట్‌ఫోన్ల‌ను మ‌రింత వేగంగా అమ్మ‌డానికి అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు కొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. 

డెలివ‌రీపైనే దృష్టి
మెట్రో న‌గ‌రాల్లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ అమ్మ‌కాల‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ఏరియాల్లో రీచ్ ఎక్కువ‌. ఎవ‌రి అడ్రెస్ అయినా త్వ‌ర‌గా ప‌ట్టుకోవ‌చ్చు. గంట వ్య‌వ‌ధిలోనే అన్ని ప్రాంతాల‌కు వెళ్లొచ్చు. కానీ చిక్క‌ల్లా ప‌ల్లెటూళ్లు, అంత‌గా డెవ‌ల‌ప్ కానీ ప్రాంతాల‌తోనే. ఇక్క‌డ కూడా క‌స్ట‌మ‌ర్లు ఉండ‌డంతో వారిపైనే దృష్టి సారించి అమ్మ‌కాలు పెంచుకోవాల‌ని అమెజాన్‌, ఫ్లిప్‌కార్టు నిర్ణ‌యించాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాలు పెంచాల‌నుకోవ‌డ‌మే. ఇప్ప‌టికి త‌మ స‌ర్వీసులు లేని చిన్న ప‌ట్ట‌ణాల్లోకి కూడా డెలివ‌రీ కౌంట‌ర్లు పెట్టాల‌ని ఇటీవ‌లే ఫ్లిప్‌కార్ట్ నిర్ణ‌యించింది.  ఎక్క‌డిక‌క్క‌డ కౌంట‌ర్లు పెట్టి ఒక‌టిన్న రోజుల్లో డెలివ‌రీ చేయాలనే ప్లాన్‌తో ఉంది.  మ‌రోవైపు టెలికాం కారియ‌ర్స్‌తో టై అప్ అవ‌డం ద్వారా మారుమూల ప్రాంతాల‌కు కూడా డెలివ‌రీ చేయాల‌నేది అమెజాన్ వ్యూహం. 

ఆఫ‌ర్లు ఉన్న‌ప్పుడే..
ఆఫ‌ర్లు ఉన్న స‌మ‌యంలోనే స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ‌గా అమ్ముడుపోతున్నాయ‌ని.. మామూలు స‌మ‌యాల్లో ఫోన్ల అమ్మ‌కాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ చెబుతున్నాయి. సాధార‌ణ ప‌రిస్థితుల్లోనూ మొబైల్స్ అమ్మకాలు పెంచ‌డానికి ఈ రెండూ ఆలోచ‌న‌లు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఇ-కామ‌ర్స్ సేల్స్‌లో 33 శాతానిక పైగా స్మార్ట్‌ఫోన్ అమ్మ‌కాలే ఉంటున్నాయి. అయితే అది ఏ బిగ్ బిలియ‌న్ డే, ఫ్రీడ‌మ్ సేల్ లాంటివి ఉన్న‌ప్పుడో, పండ‌గ‌లు ఉన్న‌ప్పుడో మాత్ర‌మే సేల్స్ బాగా ఉంటున్నాయి. 2019 నాటికి ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాలు 40 నుంచి 50 శాతం వ‌ర‌కు పెంచాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఇ-కామ‌ర్స్ సంస్థ‌లు చెబుతున్నాయి.  అంతేకాదు వీలైన‌న్ని ఎక్కువ డిసౌంట్లు ఇవ్వాల‌ని.. క్లియ‌రెన్స్ సేల్స్ పెట్టాల‌ని అనుకుంటున్నాయి. 

జన రంజకమైన వార్తలు