• తాజా వార్తలు
  •  

అమేజాన్ రీఫ‌బ్రిష్డ్ ఫోన్ల‌ను ఎక్కువ రేట్ల‌కు అమ్ముతుందా?

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమేజాన్ అంటే వినియోగ‌దారుల‌కు ఎంతో న‌మ్మకం. ఇందులో ఏదైనా వ‌స్తువు అందుబాటులో ఉంటే క‌ళ్లుమూసుకుని కొనేస్తారు. ఎందుకంటే అమేజాన్ అమ్మ‌కానికి ఉంచే ఏ వ‌స్తువైనా క్వాలిటీతో పాటు నాణ్య‌మైన‌దని భావిస్తారు. ఆ సంస్థ కూడా ఇదే మాట చెబుతుంది తాము కేవ‌లం క్వాలిటీ వ‌స్తువుల‌నే అమ్ముతామ‌ని ఒక‌టికి రెండుసార్లు ప‌బ్లిసిటీ కూడా చేస్తుంది. కానీ ఐఫోన్ల విష‌యంలో ఇది త‌ప్పేమో అనిస్తుంది. రీఫ‌బ్రిష్డ్ (సెకండ్ హ్యాండ్‌) ఫోన్ల‌ను అమేజాన్ అమ్ముతుందేమోన‌న్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

అమేజాన్ అమ్మేస్తుందిలా..
రిఫ‌బ్రిష్డ్ వ‌స్తువుల‌ను అమ్మ‌డం పెద్ద త‌ప్పేమీ కాదు. దీని కోసం చాలా సైట్లు కూడా ఉన్నాయి. కానీ ఒరిజిన‌ల్ లేదా నాణ్య‌మైన‌వి అనే పేరుతో రిఫ‌బ్రిష్డ్ వ‌స్తువుల‌ను అమ్మ‌డ‌మే పెద్ద నేరం. అమేజాన్ లాంటి సంస్థ ఇలాంటి ప‌ని చేయ‌డ‌మే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే అంశం. భార‌త్‌లో ఐఫోన్ల‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యాపిల్ సంస్థ చాలా రోజులుగా భార‌త ప్రభుత్వంతో రిఫ‌బ్రిష్డ్ ఐఫోన్లు అమ్మేందుకు మంత‌నాలు చేస్తోంది. కానీ దీనికి ప్ర‌భుత్వం ఒప్పుకోలేదు. ఐతే ఆశ్చ‌ర్యంగా ఈ ఫోన్లు  అమేజాన్‌లో ద‌ర్శ‌నం ఇవ్వ‌డ‌మే ఇక్క‌డ విశేషం. 

క‌నిపించేదంతా నిజం కాదు..
 అమేజాన్ సైట్లోకి వెళితే యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ధ‌ర రూ .20 వేలుగా ఉంటుంది.  మీరు రూ.6 వేలు సేవ్ చేసుకున్నారు అని కూడా దానికింద ఉంటుంది. దానికింద చూస్తే డిస్క్రిప్ష‌న్ కూడా స‌రిగానే ఉంటుంది. ఆ త‌ర్వాత స్పెసిఫికేష‌న్లు, వారెంటీ వివ‌రాలు కూడా ఉంటాయి. ఒక ఏడాది   మాన్యుఫాక్చ‌ర్ వారెంటీ అని కూడా మ‌నం చూడొచ్చు. అయితే అలాగే  స్క్రోల్ చేసుకుంటూ ముందుకెళితే అమేజాన్ రిన్యూవ్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రొడొక్ట్ అమ్మ‌కానికి ఉంది అని రాసి ఉంటుంది. కొత్త‌దాని వ‌లే క‌నిపిస్తున్న ఈ వ‌స్తువు టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంది అనే సందేశాన్ని కూడా మ‌నం చూడొచ్చు. స‌రే త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తుంది క‌దా అని తీరా కొనబోతే చివ‌ర్లో మీకు ఫోన్ ఇమేజ్ మాయం కావ‌డ‌మే అనుమానాల‌కు మ‌రింత తావిస్తోంది.  స్ప‌ష్టంగా చూస్తే మ‌న‌కు అర్ధ‌మ‌య్యే విష‌యం ఏమిటంటే దీనికి ఉంది ఒక ఏడాది వారెంటీ కాదు కేవ‌లం  6 నెల‌లే అని.  రూ.70 వేలు పోసి సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటే ఆ బాధ ఎలా ఉంటుంది. ఐతే అమేజాన్ లాంటి సంస్థ ద్వారా ఇలాంటి అమ్మ‌కాలు జ‌ర‌గ‌డ‌మే ఆందోళ‌న క‌లిగించే విష‌యం. కాబ‌ట్టి ఐఫోన్లు కొనేట‌ప్పుడు ఒక‌టికి రెండుసార్లు ప‌రీక్షించుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

జన రంజకమైన వార్తలు