• తాజా వార్తలు
  •  

ఎక్కువ రివ్యూలున్న గ్యాడ్జెట్స్ కొన‌డం పెద్ద బ్లండ‌ర్‌.. మీకు తెలుసా?

ఆన్‌లైన్‌లో ఏదైనా వ‌స్తువు కొనాల‌నుకున్న‌ప్పుడు ప్రొడ‌క్ట్స్ డిటెయిల్స్‌తోపాటు అంద‌రూ చూసేది రివ్యూసే. ఎక్కువ రివ్యూలు వ‌స్తే అది మంచి ప్రొడ‌క్ట‌ని కొనేస్తుంటారు. కానీ ఎక్కువ రివ్యూలున్నంత మాత్రాన అది క్వాలిటీ ప్రొడ‌క్ట్ కాన‌క్క‌ర్లేద‌ని తెలుసారీసెర్చ‌ర్స్ ఈ విష‌యాన్ని ప్రాక్టిక‌ల్‌గా  చేసి చూపించారు కూడా.

 చాలా సంద‌ర్భాల్లో త‌ప్పేన‌ట‌

సైక‌లాజిక‌ల్ సైన్స్ అనేజ‌ర్న‌ల్ ఈ విష‌యాన్ని చెప్పింది. ఒకే రేటింగ్ ఉన్న రెండు ప్రొడ‌క్ట్స్ ఉంటే అందులో ఎక్కువ రివ్యూలున్న దానికే కొనుగోలుదార్లు ఓటేస్తున్నార‌ట‌. చాలా సంద‌ర్భాల్లో ఇది త‌ప్పు అని తేలుతుంద‌ని నిరూపించారు. అమెజాన్‌.కామ్ లో కొన్ని ప్రొడ‌క్ట్‌ల మీద దీన్ని కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ  రీసెర్చ‌ర్లు చేసి నిరూపించారు.

132 మందితో ప్ర‌యోగం

లో రేటింగ్స్ ఉన్న రెండు మొబైల్ ఫోన్ కేస్‌ల‌ను ఈ ప్ర‌యోగానికి తీసుకున్నారు. దీనిలో ఒక‌టి ఎక్కువ రివ్యూలున్న‌వి. మ‌రొక‌టి త‌క్కువ రివ్యూలున్న‌వి. వీటిలో ఎక్కువ రివ్యూలున్న‌వే ఎక్కువ మంది కొన్నారు. అది అన్ని సంద‌ర్భాల్లో క‌రెక్ట్ సెలెక్ష‌న్ కాద‌ని నిరూపించారు. యావ‌రేజ్ రేటింగ్స్‌ను బ‌ట్టి చూస్తే చాలామంది ఎక్కువ రివ్యులున్న ప్రొడ‌క్ట్‌ల‌నే కొన్నార‌ట‌. ఇలా ఎక్కువ రివ్యూలుండ‌టం క్వాలిటీకి సింబ‌ల్ కాక‌పోయే అవ‌కాశాలే ఎక్కువ‌ని ఈ రీసెర్చ్‌కు లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన పావెల్ చెప్పారు. ఫోన్ కేస్ విష‌యంలో 132 మంది అడ‌ల్ట్ యూజ‌ర్ల‌ను పార్టిసిపెంట్స్‌గా తీసుకుని ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఎక్కువ‌మందిఎక్కువ రివ్యూలున్న ప్రొడ‌క్టే కొన్నారు. ఆన్‌లైన్ యూజ‌ర్ల మీద రివ్యూస్ ఎంత ప్ర‌భావం చూపుతున్నాయో చెప్ప‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ అన్నారు. రివ్యూస్‌లో అత్య‌ధికం పాజిటివ్‌గా  ఉండేలా ఆన్‌లైన్ సైట్లు జాగ్ర‌త్త‌ప‌డ‌తాయ‌ని, కాబ‌ట్టి రివ్యూల సంఖ్య‌ను బ‌ట్టి ప్రొడ‌క్ట్ కొన‌డం అంత క‌రెక్ట్ కాద‌ని తేల్చారు. 

జన రంజకమైన వార్తలు