• తాజా వార్తలు

ఫాస్ట్‌గా లోన్స్ ఇచ్చే మూడు  డిజిట‌ల్ లెండింగ్ యాప్స్ మీకోసం..

 స‌ర‌దాగా ఫ్యామిలీతో టూర్ వెళ్లాలి. లేదంటే ఏదో అవ‌స‌రానికి ఓ 50వేలు అవ‌స‌ర‌మ‌య్యాయి. క్రెడిట్ కార్డ్‌తో ఖ‌ర్చు చేస్తే వ‌చ్చే నెల‌లో క‌ట్టేయాలి. ఈఎంఐ పెడితే వ‌డ్డీకి తోడు స‌ర్వీస్ ఛార్జి కూడా బాదేస్తారు.  ప‌ర్స‌న‌ల్ లోన్ పెడితే వ‌చ్చేస‌రికి క‌నీసం మూడు నాలుగు రోజులైనా ప‌డుతుంది.  అలాంటి అవ‌స‌రాల్లో ఉప‌యోగ‌ప‌డే డిజిట‌ల్ లెండింగ్ యాప్స్ ఇప్పుడు మ‌న ముందుకొచ్చేశాయి.  పే సెన్స్‌, లోన్ ట్యాప్‌, ఎర్లీ శాల‌రీ  లాంటి యాప్‌లు పూర్తిగా ఇలాంటి లోన్లే ఇస్తున్నాయి.  50వేలు, ల‌క్ష రూపాయ‌ల‌లోపు స్మాల్ లోన్స్‌, చాలా త్వ‌ర‌గా ఇవ్వ‌డం వీటి ప్ర‌త్యేక‌త‌.

ఇవీ అడ్వాంటేజెస్

బోల్డంత్ పేప‌ర్ వ‌ర్క్ ఉండ‌దు.  ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం బ్యాంకులు తీసుకున్నంత టైం తీసుకోవు.  అస‌లు ఎలిజ‌బులిటీ ఉందో లేదో యాప్‌లో చెక్ చేసుకోవ‌చ్చు.  ఇంట‌రెస్ట్ రేట్ నెల‌కు 2%  వ‌ర‌కు ఉన్నా కూడా  తొమ్మిది, 10 నెల‌ల్లో రీపేమెంట్ చేసేయొచ్చు.

పే సెన్స్ (PaySense)

ముంబ‌యి బేస్డ్ కంపెనీ పే సెన్స్ బేస్ఇండియా ఇన్ఫోలైన్ అనే ఫైనాన్షియ‌ల్  స‌ర్వీసెస్ కంపెనీ బ్యాక‌ప్ తో  ప‌ని చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 15వేల మంది క‌స్ట‌మ‌ర్ల‌కు స్మాల్ అమౌంట్ లోన్స్ ఇచ్చింది.  ఈ కంపెనీ లోన్ బుక్ విలువ సుమారు 40 కోట్లు.  దీనిలో మ్యాక్సిమం లోన్ అమౌంట్ 1 ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ఇస్తారు. ఇప్పుడు విదేశీ ప్ర‌యాణాలు చేసే వారి కోసం దీన్ని 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పెంచాల‌ని పేసెన్స్ నిర్ణ‌యించింది.

ఎర్లీ శాల‌రీ (EarlySalary)

ఇది పుణే బేస్డ్  డిజిట‌ల్ లెండింగ్ స్టార్ట‌ప్‌. విదేశీ ప్ర‌యాణాల‌కే కాదు ద‌గ్గ‌ర‌లో ఉన్న బీచ్‌లు, హిల్ స్టేష‌న్లు చుట్టి రావ‌డానికి 50వేల లోపు లోన్స్ ఇవ్వ‌డానికి ఎర్లీ శాల‌రీ ర‌డీగా ఉంటుంది. గ‌త రెండు నెల‌ల్లో 1758 మందికి ట్రావెలింగ్ కోసం లోన్స్ ఇచ్చింది.  ఇండిపెండెన్స్ డే సంద‌ర్భ‌గా వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు వ‌స్తుండ‌డంతో చాలామంది ఆగ‌స్టు 13 నుంచి నాలుగు రోజులు టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఆ ఒక్క‌రోజుకే మేం 1000కి పైగా లోన్స్ ప్రాసెస్ చేశామ‌ని ఎర్లీ శాల‌రీ సీఈవో అక్ష‌య్ మ‌ల్హోత్రా చెప్పారు.  అప్ప‌టిక‌ప్పుడు ప్లాన్ చేసుకునే మూడు, నాలుగు రోజుల ట్రిప్స్ కోసం ముఖ్యంగా యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ ఈ లోన్స్ తీసుకుంటున్నారన్నారు.

లోన్ ట్యాప్  (LoanTap)

లోన్ ట్యాప్‌లాంటి సంస్థ‌లు తొలిసారి లోన్ ఇచ్చేట‌ప్పుడు నాలుగైదు రోజులు టైం తీసుకున్నా త‌ర్వాత సారి మాత్రం ఇన్‌స్టంట్ డిస్‌ప‌ర్స్ చేస్తున్నాయి. లోన్‌ట్యాప్‌లో చాలా మంది ఈ లోన్స్ తీసుకుంటున్నార‌ని యావ‌రేజ్‌న‌న 1.5 లక్ష‌లరూపాయ‌ల వ‌ర‌కు అప్పు ఇస్తున్నామ‌న్నారు.

Digital lending apps, quick loans, pay sense, loan tap, early salary,  డిజిట‌ల్ లెండింగ్ యాప్స్‌, పే సెన్స్‌, లోన్ ట్యాప్‌, ఎర్లీ శాల‌రీ,

Digital lonas for quick loan disbursal

జన రంజకమైన వార్తలు