• తాజా వార్తలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో ఈ ఆరు ట్రాప్స్‌లో ప‌డ‌కుండా ఉంటే మీరే మోనార్క్ 

పండ‌గ‌ల సీజ‌న్ వ‌చ్చిందంటే క‌న్స్యూమ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి బోల్డ‌న్ని ఆఫ‌ర్లు.. గిఫ్ట్‌లు, ల‌క్కీడిప్‌లు, ఎక్స్ఛేంజి ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు, క్యా|ష్‌బ్యాక్‌లు.. ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ కూడా యూజ‌ర్ల‌ను  అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇందులో కొన్ని లాభ‌మే అయినా కొన్ని మ‌న‌కు లాస్ మిగిల్చేవే.   ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలాంటి ఆరు ట్రాప్స్ గురించి తెలుసుకోండి. వీటిలో ప‌డ‌కుండా ఉంటే మీ షాపింగ్ మీద మీకు ప‌ట్టున్న‌ట్లే.
1. భారీ డిస్కౌంట్ల పేరుతో వ‌చ్చే పేప‌ర్ యాడ్స్ 
భారీ డిస్కౌంట్లంటూ పేప‌ర్ల‌లో ఫుల్ పేజీ యాడ్స్‌, టీవీల్లో మాట్లాడితే యాడ్స్ వ‌స్తున్నాయా? 30 %, 40% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ అని వ‌స్తేకంగారుప‌డి కొనేయ‌కండి. ఇందులో చాలా ఆన్‌లైన్ సేల్స్‌లో ఆ డిస్కౌంట్స్ ఏవో కొన్ని ప్రొడ‌క్ట్స్ మీద మాత్ర‌మే ఉంటాయి. లేదా ఏదో ఒక డెబిట్ / క‌్రెడిట్ కార్డ్‌కే ఇస్తాయి. ఎక్కువ‌గా ఔట్‌డేటెడ్ మోడ‌ల్స్ మీదే ఇంత ఎక్కువ డిస్కౌంట్ ఇస్తార‌ని గుర్తు పెట్టుకోండి.  
2. ఎక్స్ఛేంజి  డిస్కౌంట్లు 
చాలా ప్రొడ‌క్ట్‌ల‌కు ఎక్స్ఛేంజి మీదే  డిస్కౌంట్లు ఇస్తాయి. చాలా సంద‌ర్భాల్లో మీకు ఎక్స్ఛేంజిలో వ‌చ్చే డిస్కౌంట్ బ‌య‌ట మార్కెట్లో మీరు ఆ ప్రొడ‌క్ట్‌ను అమ్మితే వ‌చ్చేదానికంటే చాలా త‌క్కువ‌గా ఉంటుంది. కానీ పాతది ఇచ్చి కొత్త‌ది కొనుక్కునే తొంద‌ర‌లో మ‌నం దాన్ని అంత ప‌ట్టించుకోం.  
3. డిస్కౌంట్‌లో వ‌చ్చే ఫ్లైట్ టికెట్స్ బేస్ ఫేర్ మాత్ర‌మే  
ఫెస్టివ‌ల్ సీజ‌న్ల పేరుతో చేసే పెద్ద బిజినెస్ ట్రిక్స్‌లో ఇదొక‌టి. ఎయిర్ టికెట్స్ 1000 రూపాయ‌ల నుంచే స్టార్టింగ్ అంటూ ఆఫ‌ర్లు, మెయిల్స్ వ‌స్తుంటాయి. ఈ ఆఫ‌ర్ చాలా టెంప్టింగ్‌గా ఉంటుంది. కానీ అది బేస్ ఫేర్ మాత్ర‌మే.  ఇత‌ర ఛార్జెస్ అన్నీ క‌లిపితే డిస్కౌంట్ టికెట్ రేట్‌కు, ఆల్ ఇన్ ఫేర్‌తో వ‌చ్చే రెగ్యుల‌ర్ టికెట్ల మ‌ధ్య భారీ తేడా ఏమీ ఉండ‌దు. అంతేకాదు ఈ చీప్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నా చాలా సంద‌ర్భాల్లో పైసా కూడా రిఫండ్‌ ఇవ్వ‌రు. 
4. యాప్ నోటిఫికేష‌న్స్ 
ఫ్లాష్ సేల్స్‌,  హ్యూజ్ డిస్కౌంట్లు అంటూ యాప్స్ నుంచి వ‌చ్చే అల‌ర్ట్స్‌, నోటిఫికేష‌న్స్‌లో ఈ ఆఫ‌ర్ ఎంతో సేపు ఉండ‌దు. 2 గంట‌లు, మూడు గంట‌లే 30%, 40% డిస్కౌంట్ అని హ‌డావుడి పెడ‌తాయి. టెంప్ట్‌ అవ‌కండి. 
5. లిమిటెడ్ పీరియ‌డ్ ఆఫ‌ర్స్ 
లాస్ట్ డే ఆఫ్ దివాలీ సేల్‌, ఫైన‌ల్ డే ఫ‌ర్ బిగ్‌బిలియ‌న్ సేల్‌.. ఇలాంటి యాడ్స్‌, నోటిఫికేష‌న్స్ అల‌ర్ట్‌లు చూసి టెంప్ట్ అయితే మీరు అనుకున్న‌ది కాకుండా ఏదో ఒకటి ప‌ర్లేదులే ఆఫ‌ర్ అయిపోతుంద‌ని అని రాజీప‌డి కొనేసే ప్ర‌మాద‌ముంది. దివాలీ పోతే క్రిస్ట‌మ‌స్ సేల్ త‌ర్వాత న్యూఇయ‌ర్ సేల్‌, త‌ర్వాత పొంగ‌ల్ ఆఫ‌ర్స్ ఇలా ఈ-కామ‌ర్స్ పోర్ట‌ల్స్ ఆఫ‌ర్లు పెడుతూనే ఉంటాయి. కాబ‌ట్టి కంగారుప‌డ‌కండి.  
6. క‌స్ట‌మ‌ర్‌ను బ‌ట్టి రేట్ మారుతుంది
మీరు ప‌దే ప‌దే ఒకే ఊరికి వెళ్ల‌డానికి టికెట్ బుక్ చేసుకుంటే మీకు తెలియ‌కుండానే టికెట్ రేట్ పెరుగుతుంటుంది. మిగ‌తావాళ్ల కంటే మీ టికెట్ రేట్ ఎక్కువ‌య్యే ఛాన్స్ ఉంది. ఈ కామ‌ర్స్ సంస్థ‌లు కూడా మీరు త‌ర‌చుగా సెర్చ్ చేసే ప్రొడ‌క్ట్‌ల రేట్ల‌ను మీకు పెంచి చూపిస్తుంటాయి. క‌న్స్యూమ‌ర్ల డేటాను డ్రివెన్ చేసి కంపెనీలు ఈ ట్రిక్స్ చేస్తున్నాయి. అందుకే వీలైనంత వ‌ర‌కు ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేయండి. కుకీస్‌ను క్లియ‌ర్ చేయండి.  అయినా మీ టికెట్‌ను మీ అకౌంట్ నుంచే కాదు.. ప‌క్క‌న వేరే అకౌంట్‌తో సెర్చ్ చేసి చూడండి. తేడా క‌నిపిస్తే ఆ సైట్‌ను అవాయిడ్ చేయండి. 

జన రంజకమైన వార్తలు