• తాజా వార్తలు

ఈ-కామర్స్ సైట్లపై గవర్నమెంటు కొత్త రూల్స్. ఎమ్మార్పీ చూపించడంతో సహా

    ఆన్ లైన్లో వస్తువులు కొనుగోలు చేసేవారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  వచ్చే ఏడాది 2018 నుంచి ప్రతి వస్తువుపై గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)తో పాటు ఎక్స్సైరీ డేట్, కస్టమర్ కేర్ డీటెయిల్స్ వంటివన్నీ ముద్రించడం తప్పనిసరి చేయనుంది. ఇందుకుగాను లీగల్ మెట్రాలజీ(ప్యాకేజీ కమోడిటీస్) రూల్స్ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు.
    గత నెలలో చేసిన ఈ సవరణ సందర్భంగా సంస్థలకు ఆరు నెలల సమయం ఇచ్చారు. ప్రస్తుతానికి కొనుగోలు సమయంలో సైట్లలో ఎమ్మార్పీ తప్ప మిగతావివరాలేమీ చూపించడం లేదు. ఆ వస్తువు తయారీ తేదీ... ఎప్పటిలోగా వాడాలి, కస్టమర్ కేర్ వంటివేమీ అందులో చూపడం లేదు. అదే ఆఫ్ లైన్లో అయితే అప్పటికప్పుడు ఆ వివరాలు తెలుసుకుని కొనాలో వద్దో నిర్ణయించుకోవచ్చు.
    2018 జనవరి నుంచి ఇది తప్పనిసరి చేశారు. సో... ఆన్ లైన్ సంస్థలన్నీ ఇకనుంచి ఈ వివరాలన్నీ ప్రతి కొనుగోలుదారు చదువుకవునేందుకు వీలుగా ఉండేలా పెద్ద అక్షరాలతో కనిపించేలా సైట్లలో ప్రదర్శించాలి. అందుకు తగ్గ మార్పులు చేసుకునేందుకు వీలుగా ఆరు నెలల సమయం ఇచ్చారు.  వినియోగదారుల హక్కుల రక్షణ, వివాదాల నివారణ దీనివల్ల చాలావరకు సాధ్యపడుతుంది.

 

జన రంజకమైన వార్తలు