• తాజా వార్తలు

ప్ర‌తి గ్రోస‌రి మొబైల్ యాప్‌లో త‌ప్ప‌క ఉండాల్సిన ఫీచ‌ర్లివే..

మ‌నిషి జీవితం ఊపిరి స‌ల‌ప‌కుండా అయిపోయాక‌.. టెక్నాల‌జీ విప‌రీతంగా పెరిగిపోయాక‌.. మొబైల్ ద్వారానే అన్ని ప‌నులు చేసుకోవ‌డానికి అంతా ప్ర‌య‌త్నిస్తున్నారు. రైల్లో వెళుతూనో లేక బ‌స్‌లో ప్ర‌యాణిస్తో ప‌నులు చ‌క్క‌బెట్టేస్తున్నారు. క్యూల్లో నిల‌బ‌డ‌కుండానే బిల్లులు క‌ట్టేస్తున్నారు. అప‌సోపాలు ప‌డ‌కుండానే రైల్వే, బ‌స్ టిక్కెట్లు తీసుకుంటున్నారు. ఇబ్బంది లేకుండా సినిమా టిక్కెట్లు సంపాదిస్తున్నారు. అంతెందుకు మార్కెట్‌కు వెళ్ల‌కుండానే ఇంట్లో కావాల్సిన అన్ని స‌రుకుల‌ను క్ష‌ణాల్లో ఆర్డ‌ర్ చేస్తున్నారు. దీనికి అంత‌టికి కారణం స్మార్టుఫోన్లు... అందులో యాప్‌లు! ముఖ్యంగా కూర‌గాయ‌లు, ఇంట్లో వ‌స్తువుల‌ను డెల‌వ‌రీ చేసిపెట్టే గ్రోస‌రీ యాప్‌లు ప్ర‌తి ఫోన్‌లోనూ కామ‌న్‌గా ఉంటున్నాయి. అయితే అలాంటి యాప్‌ల‌లో క‌చ్చితంగా ఉండాల్సిన కొన్ని ఫీచ‌ర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

షాపింగ్ లిస్టులు

మ‌నం డిజిట‌ల్ షాపింగ్ చేసిన‌ప్పుడు అన్ని వ‌స్తువులు గుర్తు ఉండ‌వు. దీని కోసం అన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. స‌మ‌యం వృథా అవుతుంది. అదే మ‌నం అంత‌కుముందు చేసిన షాపింగ్ వివ‌రాలు ఉంటే వెంట‌నే వాటినే అటు ఇటు మార్చి మ‌ళ్లీ ఆర్డ‌ర్ ఇవ్వొచ్చు. ఇప్పుడు గ్రోస‌రీ యాప్స్‌లో ఇలాంటి ఆప్స‌న్ వ‌స్తోంది. అదే షాపింగ్ లిస్టు. మ‌నం ఏం కొనాల‌నుకుంటున్నామో మ‌న‌కు ఒక క్లారిటీ ఇవ్వ‌డానికి ఈ లిస్టు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.దీని వ‌ల్ల మ‌న‌కు వేగంగా వస్తువుల్ని పిక్ చేసుకోవ‌డ‌మే కాక‌.. టైమ్ మిగిలుతుంది.

డిస్కౌంట్ కూప‌న్లు

చాలా మంది క‌స్ట‌మ‌ర్లు డిస్కౌంట్ కూప‌న్లు అన‌గానే ఎగిరి గంతేస్తారు. త‌మ‌కు రూపాయి లాభం వచ్చినా చాలాని అనుకుంటారు. అలాంటి వారి కోస‌మే గ్రోస‌రీ యాప్‌ల‌లో డిస్కౌంట్ కూప‌న్ల జోన్ కూడా పెడుతున్నారు. దీని వ‌ల్ల ఏ షాప్ వాళ్లు ఎంత  డిస్కౌంట్ ఇస్తున్నారు.. ఎందులో ఎక్కువ ధ‌రలు ఉన్నాయి.. ఎందులో త‌క్కువ ధ‌ర‌లు ఉన్నాయి. ఇలాంటి వివ‌రాల‌న్నీ అప్‌డేటెడ్‌గా ఉంటాయి. డిస్కౌంట్లు బెనిఫిట్లు ఉంటేనే ఎక్కువ‌మంది ఆన్‌లైన్ ద్వారా కొంటున్నార‌ని అందుకే ఎంతోకొంత డిస్కౌంట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అమ్మ‌కం దారులు చెబుతున్నారు.

ధ‌ర‌ల కంపారిజ‌న్‌

ధ‌ర విష‌యంలోనే వినియోగ‌దారులు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకుంటారు. ధ‌ర ఎక్క‌డ త‌క్కువ‌గా ఉంటే అక్క‌డే కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ధ‌ర‌ల కంపారిజ‌న్ అనే ఆప్ష‌న్ కూడా గ్రోస‌రీ యాప్స్‌లో క‌చ్చితంగా ఉండి తీరాలి.  ఐదు ర‌కాల బ్రాండ్ల బియ్యం ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. ధరల‌ను కంపేర్ చేసుకుని అప్పుడు వినియోగ‌దారులు ఒక అంచ‌నాకు వ‌స్తారు. అంతేకాదు ధ‌ర‌ను బ‌ట్టి క‌నీసం ఆ వ‌స్తువు కొనాలా వ‌ద్దా అనే విష‌యంలో కూడా ఒక క్లారిటీ వ‌స్తుంది.

మ‌ల్టీమీడియా రిచ్ అడ్వ‌ర్టేజింగ్

తాజా డీల్స్ గురించి, కొత్త ప్రొడ‌క్టుల గురించి, ఉప‌యోగ‌ప‌డే వ‌స్తువుల గురించి గ్రోస‌రీ యాప్ వినియోగ‌దారుల‌కు త‌ప్ప‌కుండా పుష్ నోటిఫికేషన్లు పంపాలి.  వారిని ఎప్ప‌టిక‌ప్పుడు ఎంగేజ్ చేయాలి. అంతేకాదు రివార్డు పాయింట్లు కూడా ఇవ్వాలి. డెలివ‌రీ పాయింట్ల ఉగ‌రించి క‌స్ట‌మ‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి. ఈ ఫీచ‌ర్ల‌తో పాటు సుల‌భంగా రిజిస్ట్రేష‌న్ చేసుకునేలా ఉండాలి. డిఫ‌రంట్ డెలివ‌రీ స్లాట్‌లు క‌స్ట‌మ‌ర్ల‌కు క‌ల్పించాలి. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప‌ద్ధ‌తులు ఉండాలి.

 

జన రంజకమైన వార్తలు