• తాజా వార్తలు

ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డానికి ఈ రోజే ఆఖ‌రి రోజు.. ఆన్‌లైన్లో ఇలా ఈజీగా కంప్లీట్ చేసుకోండి

ఆగ‌స్ట్ 5 అంటే ఈ రోజుతో ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డానికి గ‌డువు ముగిసిపోతుంది. ఇదివ‌ర‌కు మాదిరిగా  ఐటీ రిట‌ర్న్స్ ఫైలింగ్ ఇప్పుడు క‌ష్ట‌మేం కాదు.  సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అఫీషియ‌ల్  ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ఈజీగా ఫైల్ చేయొచ్చు. ఇదికాక  Cleartax,  Taxspanner వంటి థ‌ర్డ్ పార్టీ యాప్‌లు కూడా ఉన్నాయి.  ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఈ- ఫైలింగ్‌ను అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లో చేయ‌డం ఎలాగో చూడండి. 

* అఫీషియ‌ల్ ఇన్‌కం ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిక్విసైట్ ఐటీఆర్ ఫారం డౌన్లోడ్  చేయాలి.

ఐటీఆర్ ఫామ్ డౌన్‌లోడ్ చేయ‌డానికి   Downloads header లో సెర్చ్ చేసి    ITRs ను క్లిక్ చేయాలి. త‌ర్వాత పేజీలో మీ స్టేట‌స్ (individual, company)ను బ‌ట్టి మీ ఐటీఆర్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవ‌చ్చు.

 * మీ ఇన్‌కం ట్యాక్స్ వివ‌రాలున్న ఎక్సెల్ ఫైల్  జిప్ ఫైల్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. దీన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేసి గ్రీన్ సెల్స్‌లో ఉన్న 2016-17 ఫైనాన్షిల్ ఇయ‌ర్‌కు సంబంధించిన డిటెయిల్స్‌ను ఫిల్ చేయ‌లి.  Income Details, TDS, TCS, Taxes Paid,  Verification, AL, 80G ఇలా ఎక్సెల్ ఫైల్‌లో ఉన్న అన్ని షీట్ల‌ను ఫిల్ చేయాలి.

*  అన్ని షీట్స్‌లో ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిటెయిల్స్ నింపిన త‌ర్వాత ఫ‌స్ట్ షీట్‌లో ఉన్న వ్యాలిడేట్ అనే బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.

* ఇప్ప‌డు ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ అయిన‌ట్టు.  ఇప్ప‌డు మీ పాన్ నెంబ‌ర్‌, రిజిస్ట‌ర్డ్ పాస్‌వ‌ర్డ్ ఉప‌యోగించి  మీ ఈ-ఫైలింగ్ అకౌంట్‌నలోకి లాగిన్ కావాలి. 

* ఈ-ఫైల్ టాబ్‌లో డ్రాప్ డౌన్ మెనూలో ఉన్న  Upload Return బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి. 

* ఐటీఆర్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసే ఫిల్ చేసేట‌ప్పుడు  2017-18 ఎసెస్‌మెంట్ ఇయ‌ర్‌ను సెలెక్ట్ చేయాలి.

* ఇప్పుడు ఎక్సెల్ షీట్ల‌ను అప్‌లోడ్ చేయాలి. మీ ద‌గ్గ‌ర రిజిస్ట‌ర్డ్ డిజిటల్ సిగ్నేచ‌ర్ ఉంటే దాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి.  (మీకు డిజిట‌ల్ సిగ్నేచ‌ర్  లేక‌పోతే ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Register Digital Signature Certificate ఆప్ష‌న్‌ను క్లిక్ చేసి రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు). 

* మీరు డిజిట‌ల్ సిగ్నేచ‌ర్‌ను రిజిస్ట‌ర్ చేసుకోక‌పోతే ఐటీ డిపార్ట్‌మెంట్ మీ రిటర్స్‌ను వెరిఫై చేసుకోమ‌ని మీకు సూచిస్తుంది.

* రిట‌ర్న్స్‌న వెరిఫై చేశాక My Account tab కింద ఉన్న View e-Filed Returns/ Formsను క్లిక్ చేసి మీ ఈ -ఫైలింగ్‌ను  చూసుకోవ‌చ్చు.

ఇన్‌క‌మ్ ట్యాక్స్‌ను  ఆన్‌లైన్‌లో ఫైల్ చేయాలంటే క‌చ్చితంగా ఆధార్‌ను, పాన్ నెంబ‌ర్‌తో లింక‌ప్ చేయాలి.

జన రంజకమైన వార్తలు