• తాజా వార్తలు
  •  

రెస్టారెంట్ల‌పై జీఎస్‌టీ 5  శాతం త‌గ్గించినా.. బిల్లు మాత్రం త‌గ్గ‌ట్లేదు .. ఎందుకంటే!

ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఒక నిర్ణ‌యంతో వినియోగ‌దారులు హ‌మ్మ‌య్య అనుకున్నారు.  కానీ అస‌లు విష‌యం ఏమిటంటే ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్ల‌లో బిల్లుల‌పై  వేసే జీఎస్‌టీలో 5 శాతం త‌గ్గించింది ప్ర‌భుత్వం.  దీంతో రెస్టారెంట్ల‌లో వేసే బిల్లులు కూడా బాగా త‌గ్గిన‌ట్లే అనుకున్నారు అంతా. అయితే ఇంట‌ర్న‌ల్‌గా జ‌రిగింది వేరు. మ‌న‌కు రెస్టారెంట్ల‌లో వేసే బిల్లులు త‌గ్గ‌డం మాని పెర‌గ‌డం ప్రారంభ‌మైంది. మ‌రి ఎందుకిలా జ‌రిగింది.

త‌గ్గిందా.. పెరిగిందా!
తాజాగా హోట‌ల్స్‌లో జీఎస్‌టీని 5 శాతం త‌గ్గించ‌డంతో బిల్లులు కూడా త‌గ్గుతాయ‌నిపించింది. గ‌తంలో గూడ్స్, స‌ర్వీసెస్ టాక్స్ కింద 18 శాతం వ‌సూలు చేసేవాళ్లు. అయితే ఏసీ రెస్టారెంట్స్ అయితే 12 శాతం వ‌సూలు చేసేవాళ్లు. అయితే తాజాగా త‌గ్గించిన జీఎస్‌టీ టారిఫ్ ప్ర‌కారం రెస్టారెంట్ బిల్లులు మ‌రింత పెరిగే అవ‌కాశాలున్నాయి.  హోట‌ల్స్‌పై జీఎస్‌టీ త‌గ్గింపు నవంబ‌ర్ 15 నుంచి అమ‌ల్లోకి రానుంది.  అయితే అనూహ్యంగా హోట‌ల్స్ షేర్లు కూడా విప‌రీతంగా పెరిగిపోయాయి. రాయ‌ల్ ఆర్చ‌డ్ షేర్ అయితే 52 వారాల హైలోకి వెళ్లింది.  అడ్వాణీ హోట‌ల్స్‌, కాఫీ డే ఎంట‌ర్‌ప్రైజ‌స్ కూడా  పెరిగిపోయాయి.

ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వ‌ల్లే..
ప్ర‌భుత్వం రెస్లారెంట్ బిల్లుల‌పై వేసే జీఎస్‌టీపై 5 శాతం త‌గ్గించినా.. మ‌న‌కు బిల్ పెర‌గ‌డానికి కారణం ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వ‌ల్లే. సాధార‌ణంగా అన్ని పెద్ద హోట‌ల్స్‌కు వ‌చ్చే ఆదాయంలో 3 నుంచి 4 శాతం ఇన్ పుట్ క్రెడిట్ నుంచే వచ్చేది. తాజాగా ప్ర‌భుత్వం  ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను విత్‌డ్రా చేసుకోవ‌డంతో రెస్టారెంట్ల‌కు పెద్ద దెబ్బ త‌గిలింది. దీంతో వాళ్లు త‌మ బిల్లుల‌పై వేసే టాక్స్‌ను కూడా పెంచే అవ‌కాశం ఉంది. అంటే మ‌నం గ‌తంలో క‌ట్టిన జీఎస్‌టీ కంటే ఎక్కువే కట్టాల్సి రావొచ్చు. దాదాపు అన్ని రెస్టారెంట్లు ఇదే  వ్యూహాన్ని అమ‌లు చేయ‌చ్చు. బిల్‌లో జీఎస్‌టీతో పాటు అద‌న‌పు ఛార్జీల‌ను కూడా ఇక‌పై మ‌నం చూడొచ్చు. అంటే ప్ర‌భుత్వం ఇన్‌పుట్ క్రెడిట్ ఎత్తేస్తే ఆ భారం మామూలు జ‌నం మీద ఇన్‌డైరెక్ట్‌గా  ప‌డ‌బోతుంద‌న్న‌మాట‌.                                                            

జన రంజకమైన వార్తలు