• తాజా వార్తలు
  •  

ఇంపోర్ట్ ట్యాక్స్ పెరిగింది..  సెల్‌ఫోన్ రేట్లు కూడా పెర‌గబోతున్నాయా?

మ‌నకు కావ‌ల్సిన వ‌స్తువుల‌న్నీ ఇండియాలోనే త‌యారు చేసుకోవాల‌నే టార్గెట్‌తో ప్ర‌ధాని మోడీ మేకిన్ ఇండియా ఇనీషియేష‌న్ తీసుకొచ్చారు. స్వ‌దేశీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్సహించాలంటే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అవుతున్న గూడ్స్‌ను కంట్రోల్ చేయలి.  ఎందుకంటే ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌లో  అక్టోబ‌ర్ వ‌ర‌కు ఏడు నెలల్లో  ఇండియా దిగుమ‌తి చేసుకున్న వ‌స్తువుల విలువ 22%  పెరిగి  రూ .16,42,514 కోట్ల‌కు చేరింది.  దీన్ని కంట్రోల్ చేయ‌డానికి గ‌వ‌ర్న‌మెంట్ డ‌జ‌న్ల కొద్దీ ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల‌పై ఇంపోర్ట్ ట్యాక్స్‌ను లేటెస్ట్‌గా పెంచింది.  మొబైల్స్‌, టీవీలు వంటివి ఇంపోర్టెడ్ కొనేవారికి 10 నుంచి 15% వ‌ర‌కు ఎక్స్‌ట్రా ట్యాక్స్ ప‌డ‌బోతోంది. 
సెల్‌ఫోన్ మార్కెట్‌పై ప్ర‌భావం ఎంత‌?
ఇంపోర్ట్ ట్యాక్స్ పెర‌గ‌డంతో విదేశీ సెల్‌ఫోన్‌ కంపెనీల దూకుడు త‌గ్గుతుంద‌ని  ఇండియన్ సెల్‌ఫోన్ కంపెనీలు ఆశిస్తున్నాయి. ఇండియాలో స్మార్ట్‌ఫోన్ బిజినెస్ ఏడాదికి 65 వేల కోట్ల రూపాయ‌లు. అయితే ఇండియాలో అమ్మే 10 మొబైల్ ఫోన్స్‌ల్ 8 ఇక్క‌డ త‌యారుచేసేవే. సెల్‌కాన్‌, కార్బ‌న్‌, లావా, ఇంటెక్స్ లాంటి దేశీయ కంపెనీల‌తోపాటు శాంసంగ్ లాంటి విదేశీ కంపెనీలు కూడా ఇక్క‌డ ప్లాంట్ పెట్టి ఇక్క‌డే త‌యారు చేసి మ‌న‌కు ఫోన్లు అమ్ముతున్నాయి. కాబట్టి ఇంపోర్ట్ ట్యాక్స్ పెరిగినా వారికేమీ ప్రాబ్లం లేదు. సో వాటి రేట్లు పెర‌గ‌వు.  ఇక  యాపిల్  త‌యారుచేసే ఐఫోన్ల మీద ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే  88% యాపిల్ ఫోన్లు విదేశాల్లోనే త‌యార‌వుతున్నాయి.  బెంగ‌ళూరు ద‌గ్గ‌ర అసెంబ్లింగ్ ప్లాంట్ ప్రారంభించినా అది ఐఫోన్ ఎస్ఈ మోడ‌ల్‌ను మాత్ర‌మే ఇక్క‌డ త‌యారు చేస్తుంది. ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌, 10 వంటివ‌న్నీ విదేశాల్లోనే త‌యారవుతున్నాయి. వాటిపై ఇంపోర్ట్ ట్యాక్స్ 10 నుంచి 15% వ‌ర‌కు పెర‌గ‌బోతోంది. కాబ‌ట్టి  యాపిల్‌కు దెబ్బే. అలాగ‌ని రేటు పెంచితే ఇప్ప‌టికే భారీగా ఉన్న ఐఫోన్ రేటు మ‌రింత పెరిగే ప్ర‌మాదం. మ‌రి రేట్లు పెంచుతుందా లేక ఆ మోడ‌ల్స్‌ను కూడా ఇండియాలో త‌యారుచేస్తుందా చూడాలి.
టీవీలు, వీడియోకామ్‌ల‌పైనా..
వీడియో కెమెరాల‌పై 10% ఉన్న ఇంపోర్ట్ ట్యాక్స్ 15%కు పెంచారు.  ఇంపోర్టెడ్ టీవీల‌పై ఉన్న ట్యాక్స్ 10% నుంచి ఏకంగా 20% పెరిగింది.
 

జన రంజకమైన వార్తలు