• తాజా వార్తలు
  •  

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7 ఫోన్‌ను రూ.5090కు పొంద‌డం ఎలా?

 భార‌త్‌లో ఎక్కువ‌శాతం అమ్ముడ‌య్యే ఫోన్ల‌లో శాంసంగ్  ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ఇటీవ‌ల మార్కెట్లో ఉన్న పోటీ దృష్ట్యా ఆ సంస్థ వేగంగా భిన్న‌మైన  మోడ‌ల్స్‌ను బ‌రిలో దించుతోంది. గెలాక్సీ సిరీస్‌లో ఎన్నో విజ‌యవంత‌మైన మోడ‌ల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన శాంసంగ్ మ‌రో కొత్త మోడ‌ల్‌ను ప‌రిచ‌యం చేసింది అదే గెలాక్సీ ఎస్‌7.   సాధార‌ణంగా గెలాక్సీ మోడ‌ల్స్ ధ‌ర కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ రూ.5090కు మాత్ర‌మే ఈ ఫోన్ పొందొచ్చ‌ని ఆ సంస్థ ఫ్యాన్స్‌కు ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.  మ‌రి అంత త‌క్కువ ధ‌ర‌కు ఫోన్ పొంద‌డం ఎలా?

ఫ్లిప్‌కార్ట్‌లో మాత్ర‌మే
శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7 మోడ‌ల్‌ను రూ.5090కే  పొందే మార్గం ఒక‌టుంది. అదే ఫ్లిప్‌కార్ట్‌. ఇ-కామ‌ర్స్ సంస్థ ద్వారా ఈ ఫోన్‌ను మూడు రోజుల‌పాటు అతి త‌క్కువ ధ‌ర‌కే అందించాల‌ని శాంసంగ్ నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ప్ర‌త్య‌క‌మైన సేల్ కూడా పెట్టింది. ఈ ఒక్క ఫోన్ మాత్ర‌మే కాదు ఇత‌ర ఫోన్ల మీద కూడా శాంసంగ్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది.   ఈ శాంసంగ్ ఫెస్ట్‌లో భాగంగా రూ.29,990 ధ‌ర ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7 ఫోన్‌ను కేవ‌లం రూ.5090కు కూడా చేజిక్కించుకునే అవ‌కాశం మ‌న‌కుంది.  అయితే ఈ ఆఫ‌ర్‌ను మీరు చేజిక్కించుకోవాలంటే మీ ద‌గ్గ‌రో యాపిల్ ఐఫోన్ 7 ఉండి తీరాలి. పాత యాపిల్ ఐఫోన్ 7ను మీరు ఎక్స్‌ఛేంజ్‌లో ఇచ్చేస్తే మీకు రూ.5090కే శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7ను ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంది.

రూ.25 వేలు డిస్కౌంట్‌
 సాధార‌ణంగా రెండో మూడు వేలో డిస్కౌంట్ ఇవ్వ‌డం స‌ర్వ సాధార‌ణం. కానీ శాంసంగ్ ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్ ఇచ్చి అంద‌ర్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. అయితే ఇది యాపిల్ డివైజ్‌లు వాడుతున్న వాళ్ల‌కు మాత్ర‌మే బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. వేరే డివైజ్‌ల‌తో కూడా ఎక్సేంజ్ చేసుకోవ‌చ్చు కానీ.. అంత మొత్తంలో రాయితీ పొందే అవ‌కాశం లేదు.  అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7లో ఉన్న ఫీచ‌ర్లును బ‌ట్టి మ‌నం యాపిల్ ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసైనా తీసేసుకోవ‌చ్చు. 5.1  అంగుళాల డిస్‌ప్లే, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఎక్స్‌నోస్‌ 8890 64 బిట్ ఆక్టా కోర్ ప్రాసెస‌ర్, 4 జీబీ ర్యామ్‌, 12 ఎంపీ డ్యుయ‌ల్ పిక్స‌ల్ కెమెరా త‌దిత‌ర అదిరే ఆప్ష‌న్లు ఈ ఫోన్ సొంతం

జన రంజకమైన వార్తలు