• తాజా వార్తలు

రెడ్ మీ తన ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా పెంచుకుంటోందటే..

ఇండియాలో విపరీతమైన ఆదరణ పొందిన చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కస్టమర్ బ్యాంకును మరింత పెంచుకునేందుకు గట్టి ఏర్పాట్లు చేసుకుంటోంది. ముఖ్యంగా ఆన్ లైన్ అమ్మకాలలో అదరగొట్టే ఈ సంస్థ ఆఫ్ లైన్ లో కనపడకపోవడంతో దీని ఆఫ్టర్ సేల్ సర్వీస్ పై భయంతో చాలామంది ఇంకా ఇది కొనేందుకు ఇష్టపడడం లేదు. ఇల్లు దాటి రోడ్డు మీదకు రాగానే నలువైపులా కనిపించే ఒప్పో, వివో వంటి బ్రాండ్లను నమ్ముతున్నారు. మన వీధిలోని దుకాణాల వద్ద కూడా ఆ బ్రాండ్ల బ్యానర్లు కనిపించడం... ఏ షాప్ కు వెళ్లినా కస్టమర్ సపోర్టు దొరుకుతుండడంతో ఇవే బెస్టన్న భావన చాలామందిలో ఉంటోంది. షియోమీ అక్కడే కాస్త వెనుకబడుతోంది. కస్టమర్ సపోర్టు విషయంలో ఇంకా చాలామందిలో నమ్మకం కలిగించలేకపోతోంది. ఇప్పుడు ఆ విషయంపైనే షియోమీ దృష్టి పెట్టింది. 

    ఇండియాలో షియోమీయే అతి పెద్ద బ్రాండని ఆ సంస్థ చెబుతోంది. ఆ టాప్ లెవల్ ను నిలబెట్టుకునేందుకు గాను ఆఫ్టర్ సేల్ సర్వీస్ ను మరింత మెరుగుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతానికి దేశంలోని 350 నగరాలు, పట్టణాల్లో 500 సర్వీసు సెంటర్లు షియోమీకి ఉణ్నాయి. 


    ప్రస్తుతం రిపేరుకు వస్తున్న ఫోన్లలో 86 శాతం ఫోన్లను 4 గంటల్లోనే బాగుచేసి తిరిగి ఇస్తున్నామని సంస్థ వర్గాలు చెప్తున్నాయి. అయినా కూడా దేశంలోని మరిన్ని ప్రాంతాలకు తమ సర్వీస్ నెట్ వర్క్ విస్తరిస్తామని... మరింతమంది టెక్నాలజీ పార్టనర్లతో కలిసి ఎక్కువ సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. వచ్చే ఆర్నెళ్లలో షియోమీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్తున్నారు.
 

జన రంజకమైన వార్తలు