• తాజా వార్తలు
  •  

అమెజాన్‌లో ఫేక్ రివ్యూలు క‌నిపెట్ట‌డం ఎలా?

అమెజాన్‌లో ఏదైనా ప్రొడ‌క్ట్ కొంటున్నారా? అయితే ప్రొడక్ట్ డిస్క్రిప్ష‌న్ కంటే ముందు చాలామంది చూసే అంశం రివ్యూలు, రేటింగ్సే. 5 స్టార్ రివ్యూ క‌నబ‌డ‌గానే ప్రొడ‌క్ట్ కొనే అల‌వాటు మీకుందా? అయితే ఇదొక్క‌సారి చ‌ద‌వండి. ఎందుకంటే చాలామంది వెండ‌ర్లు డబ్బులిచ్చి మంచి రివ్యూలు, 5 స్టార్ రేటింగ్‌లు ఇప్పిస్తుంటారు. అమెజాన్లో కొంత‌కాలంగా ఈ ప్రాబ్లం ఉంది.

ఫేక్ రివ్యూల‌ను గుర్తించండి ఇలా..

* ఎక్కువ రివ్యూల్లో ఒకేలాంటి కీ వ‌ర్డ్స్ ఉంటే అనుమానించాల్సిందే. వాటిలో ప‌దాలు, వాక్యాలు కూడా ఒకేలా ఉంటాయి.

* ఫ‌లానాది బాగుంది, ఫ‌లానాది బాగోలేదు అని చెప్ప‌కుండా అన్నీ పాజిటివ్‌గా రివ్యూ రాసి5స్టార్లు ఇచ్చేసినా అది ఫేక్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌.

* చాలా త‌క్కువ టైమ్‌లో నెంబ‌ర్ ఆఫ్ రివ్యూస్ వ‌చ్చినా కూడా అవి స‌స్పెక్ట‌బుల్ అని న‌మ్మాలి.

యాప్స్ ఉన్నాయి

రివ్యూ మేటా (ReviewMeta), ఫేక్ స్పాట్ (Fakespot) ఈ రెండు యాప్‌ల‌ను ఉప‌యోగించి ఫేక్ రివ్యూల‌ను క‌నిపెట్టొచ్చు. ఇందులో రివ్యూ మేటా పాత‌ది. ఫేక్ స్పాట్ కొత్త టెక్నిక్స్‌తో వ‌చ్చింది. అమెజాన్ ప్రొడ‌క్ట్ లింక్‌ను ఈ యాప్‌కు లింక్ చేస్తే చాలు. వాటిలో ఉండే స్మార్ట్ ఆల్గ‌రిథ‌మ్స్ ఆ రివ్యూల‌ను ఎన‌లైజ్ చేసి అది ఫేకా, ఒరిజిన‌లా చెప్పేస్తాయి.

ఏం చేయాలి?

* 3 స్టార్ రేటింగ్స్ ఉన్న రివ్యూల‌ను చాలావ‌ర‌కు న‌మ్మొచ్చు.  ఎందుకంటే ఈ స్టార్ రేటింగ్స్‌తో రివ్యూలిచ్చేవాళ్లు ఆ ప్రొడ‌క్ట్ కాన్స్‌, ప్రోస్ ఏవో వివ‌రిస్తారు.

* Amazon Sort extensionను వాడితే నెంబ‌ర్ ఆఫ్ రివ్యూస్‌ను ఫిల్ట‌ర్ చేసి ప్రొడ‌క్ట్ క్వాలిటీని ఎసెస్ చేసే అవ‌కాశం ఇస్తుంది.

* వెరిఫైడ్ క‌స్ట‌మ‌ర్ అని ట్యాగ్ ఉన్న‌వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే సెల్ల‌ర్స్ నుంచి డబ్బులుతీసుకుని మామూలు రివ్యూకుకూడా వెరిఫైడ్ క‌స్ట‌మ‌ర్ అని ట్యాగ్ త‌గిలించే బోగ‌స్ సంస్థ‌లున్నాయి.

* ఫేక్ రివ్యూస్ చాలావ‌ర‌కు పాజిటివ్ ఎండింగ్స్ ఇస్తాయి. ఫ‌లానా ఫ‌లానా క్వాలిటీస్  ఉన్నాయి కాబ‌ట్టి ఈ ప్రొడ‌క్ట్ కొనవ‌చ్చు అనే స‌ల‌హా ఇస్తే దాన్ని ఇగ్నోర్ చేయ‌డం బెట‌ర్‌.

* ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చే ప్రొడ‌క్ట్‌ల‌ను న‌మ్మ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే ఎక్కువ రివ్యూల కోసం వీటికి హెవీ డిస్కౌంట్లు పెట్టే ఛాన్స్ ఎక్కువ‌.

 

జన రంజకమైన వార్తలు