• తాజా వార్తలు
  •  

ఐఆర్‌సీటీసీ ఈ-టికెట్స్‌పై స‌ర్వీస్ ఛార్జి తొల‌గించ‌డంలో మ‌త‌ల‌బేంటి? 

రైలు ప్ర‌యాణానికి  టికెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేవారికి శుభ‌వార్త‌.   ఈ-టికెట్ పై స‌ర్వీస్ ఛార్జిని  2018 మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు తొల‌గిస్తున్న‌ట్లు  ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (IRCTC) లేటెస్ట్‌గా ఎనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయ‌ర్ డీమానిటైజేష‌న్ త‌ర్వాత డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌ను ప్రోత్స‌హించేందుకు  గ‌వ‌ర్న‌మెంట్ డిపార్ట్‌మెంట్ల‌న్నీ ఇనీషియేష‌న్స్ తీసుకున్నాయి. అలాగే ఐఆర్‌సీటీసీ కూడా త‌న ఫ్లాట్‌ఫాంపై టికెట్స్ బుక్ చేసుకునేవారికి మూడు నెల‌ల‌పాటు స‌ర్వీస్ ఛార్జి ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌ర్వాత దాన్ని అలా అలా సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగించింది. ఆ గ‌డువు కూడా పూర్త‌వ‌డంతో వ‌చ్చే సంవ‌త్స‌రం మార్చి వ‌ర‌కు స‌ర్వీస్ ఛార్జి ఉండ‌ద‌ని లేటెస్ట్‌గా ఎనౌన్స్ చేసింది. 
భారీ లాసే  
ఈ-టికెట్స్‌పై స‌ర్వీస్ ఛార్జి ర‌ద్ద‌దు చేయ‌డం రైల్వేకు భారీగా లాస్ వ‌స్తుంది. స్లీప‌ర్ టికెట్‌పై 20 రూపాయ‌లు, ఏసీ క్లాస్ టికెట్స్‌పై 40 రూపాయ‌ల స‌ర్వీస్ ఛార్జి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రోజుకు 10 నుంచి 13 లక్ష‌ల టికెట్స్ బుక్ అవుతుంటాయి. వీటన్నింటిపై స‌ర్వీస్ ఛార్జి ర‌ద్దు చేయ‌డం అంటే రోజూ ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్ట‌మే. ఐఆర్‌సీటీసీ ఆదాయంలో 33% ఈ సర్వీస్ ఛార్జితోనే వస్తుంది. డీమానిటైజేష‌న్ నుంచి ఫిబ్ర‌వరి నెలాఖ‌రు వ‌ర‌కు స‌ర్వీస్ ఛార్జి ర‌ద్దుతో ఐఆర్‌సీటీసీ 184 కోట్లు న‌ష్ట‌పోయింది.  
గ‌వ‌ర్న‌మెంట్‌ను అడగాలి
ఇలా స‌ర్వీస్ ఛార్జి వెయివ్ ఆఫ్ చేసుకుంటూ వెళితే ఏడాదికి 500 కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌స్తుంద‌ని ఐఆర్‌సీటీసీ  చెబుతోంది. అయితే ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ పెంచాల‌న్న గ‌వ‌ర్న‌మెంట్ ఇనీషియేటివ్ క‌నుక ఈ లాస్‌ను గ‌వ‌ర్న‌మెంటే ఫుల్‌ఫిల్ చేయాల‌ని అడుగుతోంది.  

జన రంజకమైన వార్తలు