• తాజా వార్తలు

 ఈ-కామ‌ర్స్ కంపెనీలు మ‌న‌కిచ్చే డిస్కౌంట్ల మీద ఐటీ కొర‌డా.. తీస్తే ఏమ‌వుతుందో తెలుసుకోండి

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ లాంటి ఈ-కామ‌ర్స్ కంపెనీలు మ‌న‌కిచ్చే డిస్కౌంట్ల‌మీద ఐటీ డిపార్ట్‌మెంట్ కొర‌డా ఝుళిపిస్తోంది.  కంపెనీలు డిస్కౌంట్స్ మీద పెట్టే ఖ‌ర్చు marketing expenditureగా కాకుండా  capital expenditureగా చూపించాల‌ని ఐటీ డిపార్ట్‌మెంట్ ఆర్డ‌ర్స్ పాస్ చేసింది.  దీంతో త‌మ మీద భారం ప‌డుతోంద‌ని ఈ -కామ‌ర్స్ కంపెనీలు గ‌గ్గోలు పెడుతున్నాయి.  దీనిపై మ‌రోసారి ఆలోచించాల‌ని  క‌మిష‌న‌ర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ (అప్పీల్స్‌)ను రిక్వెస్ట్ చేస్తున్నాయి. 
ప్రాబ్లం ఏమిటి? 
క‌స్ట‌మ‌ర్ల‌కు ఇచ్చే డిస్కౌంట్ల‌ను ఈ-కామ‌ర్స్ కంపెనీలు marketing expenditureగా చూపిస్తున్నాయి. దీనివ‌ల్ల త‌మ‌కు న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని ట్యాక్స్ క‌ట్ట‌డం లేద‌ని ఐటీ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. అదే దీన్ని క్యాపిట‌ల్ ఎక్స్‌పెండిచ‌ర్‌గా చూపిస్తే లాస్ చూపించ‌డానికి వీలుండ‌దు కాబ‌ట్టి ట్యాక్స్ క‌ట్టాలి. అందుకే దీన్ని కంపెనీలు వ్య‌తిరేకిస్తున్నాయి. 
కంపెనీలు ఏమంటున్నాయి?
మార్కెట్‌లో పోటీ త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం కోసం క‌ష్ట‌మైనా భారీ డిస్కౌంట్లు పెడుతున్నామ‌ని, ఇప్పుడు వాటిని క్యాపిట‌ల్‌ ఎక్స్‌పెండిచ‌ర్లో క‌లిపి లాభాలు వ‌స్తున్నాయి కాబ‌ట్టి ట్యాక్స్‌లు క‌ట్ట‌మంటే క‌ష్ట‌మంటున్నాయి.  గ‌వ‌ర్న‌మెంట్ ట్యాక్స్ విధించ‌గ‌ల‌దు కానీ కంపెనీని ఎలా ర‌న్ చేయాలో చెప్ప‌డానికి  అథారిటీ లేద‌ని ఎక్స్‌ప‌ర్ట్‌లు అంటున్నారు. ఇలా చేస్తే ఈ -కామ‌ర్స్ కంపెనీల‌కే కాదు.. స‌ర్వీసెస్‌, ప్రొడ‌క్ట్‌ల రంగంలో వ‌స్తున్న స్టార్ట‌ప్‌ల‌కు 
మ‌రింత ఇబ్బంది అని చెబుతున్నారు. 
క‌స్ట‌మ‌ర్ల‌కు లాసే..
 ఒకవేళ గ‌వ‌ర్న‌మెంట్ ఇలా డిస్కౌంట్ల‌ను క్యాపిట‌ల్ ఎక్స్‌పెండిచ‌ర్లో క‌లిపి ట్యాక్స్‌లు వేస్తే కంపెనీలు డిస్కౌంట్లు ఇవ్వ‌డం త‌గ్గిస్తాయి. ఎందుకంటే డిస్కౌంట్‌తో ప్రొడ‌క్ట్ రేట్ త‌గ్గించ‌డ‌మే కాకుండా దాన్ని క్యాపిట‌ల్ ఎక్స్‌పెండిచ‌ర్లో చూపించి రెవెన్యూ మీద ట్యాక్స్‌లు క‌ట్టుకోవాలంటే రెండు ర‌కాలుగా లాస్‌. కాబ‌ట్టి డిస్కౌంట్లు ఇవ్వ‌డం త‌గ్గించేస్తాయి.  జీఎస్టీతో ఇప్ప‌టికే ఈ-కామ‌ర్స్‌లోనూ ట్యాక్స్‌ల బాదుడు మొద‌లైంది. ఇక ఈ ట్యాక్స్‌లు కూడా క‌లిసి డిస్కౌంట్లు త‌గ్గిస్తే క‌స్ట‌మ‌ర్ల‌కు ఎలాంటి లాభం మిగ‌ల‌దు.  


 

జన రంజకమైన వార్తలు