• తాజా వార్తలు
  •  

అమెజాన్ ఆధార్ వివ‌రాలు అడిగిందా..త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

ఆధార్ ఉందా....ఇప్పుడు అన్ని చోట్లా అడుగుతున్న ప్ర‌శ్నే ఇది. కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని సేవ‌ల కోసం ఆధార్ ఏ ముహూర్తాన త‌ప్ప‌నిస‌రి చేసిందో కానీ.. ఆధార్ నంబ‌ర్ ఇప్పుడు సర్వ‌వ్యాప్త‌మైపోయింది. ఎటు వెళ్లాల‌న్నా ఆధార్‌.. ఏం చేయాల‌న్నా ఆధార్‌... చివ‌రికి ఆన్‌లైన్‌లో ఏమైనా వ‌స్తువులు కొనుగోలు చేయ‌డానికి కూడా ఆధార్‌!! ఇది నిజంగా టూమ‌చ్‌గా అనిపిస్తోంది. కానీ  కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో మ‌న ఆధార్ వివ‌రాలు వెల్ల‌డించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉంటోంది. చివ‌రికి ఆన్‌లైన్ ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ సైతం ఆధార్ ఉందా? అని అడుగుతోంది. మ‌రి  అమెజాన్‌కు ఆధార్ ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కు సేఫ్?

ఆధార్ ఇస్తే అంతే!
ఆధార్‌.. 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య‌. కానీ దీంతో భార‌తీయుల జీవితాలే ముడిప‌డి ఇన్నాయిప్పుడు. ఎందుకంటే ప్ర‌తి దానికి ఆధార్ లింక్ పెట్ట‌డంతో జ‌స్ట్ ఆధార్ నంబ‌ర్ దొరికితే చాలు మ‌న వివ‌రాలు ట్రాక్ చేసే ప్ర‌మాదం వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్లో కొనుగోళ్ల‌కు ఆధార్ నంబ‌ర్ ఇవ్వడం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌? మ‌నకు ఆన్‌లైన్ ద్వారా రావాల్సిన వ‌స్తువులు దారి త‌ప్పిన‌ప్పుడు అమెజాన్ సంస్థ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను వెంట‌నే ఆధార్ నంబ‌ర్ అడుగుతోంది. ఎందుకంటే ఐడెంటిటీ కోసం అంట‌. కానీ ఇలా ఆధార్‌ను ఇవ్వడం వ‌ల్ల మిస్ యూజ్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌నేది సైబ‌ర్ నిపుణుల మాట‌. ఆధార్‌ను ఇష్యూ చేసే యూఐడీఏఐ కూడా ఇదే మాట చెబుతోంది. త‌మ వ‌ద్ద వినియోగ‌దారుల డేటా ఎంతో భద్రంగా ఉంటుంద‌ని కానీ అన్యుల చేతుల్లోకి వెళితే ట్రాక్ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తోంది.

థ‌ర్డ్ పార్టీకి ఇవ్వొద్దు
ఆధార్ వివ‌రాలు గోప్యంగా ఉంచాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యూఐడీఏఐని ఆదేశించింది. సుప్రీం కోర్టు కూడా అదే ఉత్త‌ర్వులు జారీ చేసింది. కానీ సిమ్ కార్డుల‌కు కూడా ఆధార్ నంబ‌ర్లు అడుగుతుండ‌డంతో ఇప్పుడు మ‌న డేటా ఎంత వ‌ర‌కు సుర‌క్షితం అనే ఆందోళ‌న బ‌య‌ల్దేరింది. తాజాగా జియో సిమ్‌ల‌కు సంబంధించిన ఆధార్ డేటా బేస్ ఏకంగా ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో వినియోగ‌దారులు ఆందోళ‌న చెందారు. ఆధార్ ద్వారా మ‌న డేటా  సుర‌క్షిత‌మేనా అనే అనుమానాలు మ‌రోసారి తలెత్తిన సంఘ‌ట‌న ఇది. ఈ నేప‌థ్యంలో అమెజాన్ లాంటి ఆన్‌లైన్ సంస్థ  మ‌న డేటాకు ఎలా ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంద‌నేది నిపుణుల మాట‌. అందుకే ఆధార్ వివ‌రాలు ఇస్తే క‌ష్ట‌మేన‌ని ఏమైనా జ‌రిగితే ఆ న‌ష్టాన్ని వినియోగ‌దారులే భ‌రించాల‌ని వారు అంటున్నారు.

జన రంజకమైన వార్తలు