• తాజా వార్తలు

ఇండియా నగదు రహిత దేశమవుతోందా?

భారత్ లో నగదు రహిత చెల్లింపులు పెరిగాయి. రిటైలర్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా, ప్రైస్ వాటర్  హౌస్ కూపర్స్ సంయుక్తoగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. షాపింగ్ సందర్భంగా చేసే చెల్లింపుల్లో డెబిట్ కార్డు వినియోగం భారత్ లో అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయంలో తేల్చింది. డెబిట్ కార్డు చెల్లింపుల విషయంలో ప్రపంచ సగటు కంటే కూడా భారత్ సగటే అధికంగా ఉంది.  అయితే.. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ర్టేలియా వంటి దేశాలతో పోల్చితే భారత్ లో నగదు రహిత చెల్లింపులు ఇంకా బాగా తక్కువనే చెప్పాలి.

కాగా ఇండియాలో మొబైల్ ఫోన్లు ప్రధాన కొనుగోలు సాధనాలుగా ఉంటున్నాయట. అంతేకాదు ..మొబైల్ ఆధారిత చెల్లింపులూ భారత్ లో ఎక్కువవుతున్నాయి.మొబైల్ బ్యాంకింగ్, వ్యాలట్ సేవలను ఉపయోగించుకుని చెల్లింపు చేయడం పెరిగింది. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది మొబైల్ ఆధారిత చెల్లింపులు చేస్తున్నారట.

ఇక ఆన్ లైన్ కొనుగోళ్లు జరుపుతున్నవారిలో అత్యధికులు అందులో సౌలభ్యం వల్ల అటువైపు మొగ్గుతున్నారు. ఇలాంటివారు 65 శాతం ఉన్నారు. ధరలు అనుకూలంగా ఉన్న కారణంగా కొనుగోలు చేస్తున్నవారు 31 శాతం ఉంటున్నారు. అంతేకాదు..కొనుగోలు చేసిన ఉత్పత్తులు డెలివరీ విషయంలోనూ సౌలభ్యాలను చూస్తున్నారు. సత్వర డెలివరీ కోసం అవసరమైతే అదనంగా చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇది ప్రపంచ సగటు కంటే ఇండియాలోనే ఎక్కువ.

మిగతా దేశల్లో ఈన్ లైన్ వినియోగదారులతో పోల్చితే భారతీయ ఆన్ లైన్ కొనుగోలుదార్లు అన్ని రకాల వస్తువులను కొంటున్నారు. పుస్తకాలు, దుస్తులు , ఫ్యాషన్ గూడ్స్ మాత్రమే కాకుండా హెల్త్, బ్యూటీ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ భారీ స్ధాయిలో కొనుగోలు చేస్తున్నారు.అంతేకాదు.. ఇంటికి  కావాల్సిన  సరకుల్లో 50 శాతానికి పైగా ఆన్ లైన్లోనే కొనుగోలు చేస్తున్నవారు 35 శాతం మంది ఉన్నారు. కాగా ప్రతి కేటగిరిలోనూ సుమారు 5 శాతం  మంది భారతీయులు పూర్తిగా ఆన్ లైన్లోనే కొనుగోలు చేస్తున్నారట. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ. మిగతా ప్రపంచంలో ఇలా పూర్తిగా ఆన్ లైన్ కొనుగోళ్లు జరిపేవారి  శాతం 2 నుంచి 3 మాత్రమే ఉంది.

 

జన రంజకమైన వార్తలు