• తాజా వార్తలు

మొబైల్ వాలెట్ల‌లో న‌యా సంచ‌ల‌నం.. ఫోన్ పే

పేటీఎం, ఫ్రీఛార్జి, మొబీక్విక్‌...  డీమానిటైజేష‌న్ నేప‌థ్యంలో ఈ మొబైల్ వాలెట్ల‌న్నీ ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను  సంపాదించుకుంటున్నాయి. కూరగాయ‌ల దుకాణాలు, టీ బ‌డ్డీల ద‌గ్గ‌ర కూడా వీటిని వినియోగిస్తున్నారంటే అవి ఎంతగా జ‌నంలోకి చొచ్చుకెళుతున్నాయో గుర్తించొచ్చు. ఇప్ప‌డు ఈ జాబితాలో చేరింది ఫోన్ పే.. ఆన్‌లైన్ సేల్స్‌లో ప్ర‌త్యేక స్థానం క‌లిగిన ఫ్లిప్ కార్ట్ సంస్థ నుంచి వ‌చ్చిన మొబైల్ వాలెట్ ఇది. జూన్ లోనే మార్కెట్‌లోకి వ‌చ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 50 వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని ఫ్లిప్‌కార్ట్ చెప్పింది. మిగిలిన వాలెట్ల‌తో పోల్చితే దీనిలోఉన్న సౌక‌ర్యాలు చూస్తే మాత్రం ఇది మొబైల్ వాలెట్ల‌లో కొత్త సంచ‌ల‌నం అని ఒప్పుకుని తీరాల్సిందే.

ఏంటి ప్రత్యేకత‌?
* ఏటీఎం పిన్ మాదిరిగా ఉండే నాలుగు అంకెల ఎంపిన్‌తో మీ ట్రాన్సాక్ష‌న్ల‌ను సులువుగా పూర్తి చేసుకోవ‌చ్చు.  మీరు పేమెంట్ చేయాల‌నుకున్న ప్ర‌తిసారి ఎంపిన్ ఎంట‌ర్ చేయాలి. ఇది మీ అకౌంట్ మంచి సెక్యూరిటీ ఫీచ‌ర్ .
*  మీరు డ‌బ్బులు పంపాల‌నుకున్న వ్య‌క్తి ఫోన్ నెంబ‌ర్‌ను ఉప‌యోగించుకుని ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు.  సెండ్ మ‌నీ సెక్ష‌న్‌లో రిసీవ‌ర్ ఫోన్ నెంబ‌ర్ వేసి మీ బ్యాంక్ అకౌంట్ లేదా ఫోన్‌పే వాలెట్‌ను సెలెక్ట్ చేసి నేరుగా డబ్బులు పంప‌వ‌చ్చు.
దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు.
*  ఐఎంపీఎస్ ద్వారా క్ష‌ణాల్లో మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ పూర్త‌వుతుంది.
 
ఫోన్‌పే ఫీచ‌ర్లు
పేటీఎం, ఫ్రీఛార్జి, మొబీక్విక్ త‌దిత‌ర మొబైల్ వాలెట్ల‌లో ఉండే అన్ని ఫీచ‌ర్లు ఫోన్ పేలో కూడా ఉన్నాయి.  దీంతోపాటు ఫోన్ పేకి అద‌న‌పు ఆకర్ష‌ణ‌గా నిలిచే మ‌రికొన్ని ఫీచ‌ర్లున్నాయి.

సెండ్ లేదా రిక్వెస్ట్ మ‌నీ
ఫోన్‌పే ద్వారా మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న ఎవ‌రికైనా ఏ క్ష‌ణంలోనైనా డ‌బ్బులు పంపొచ్చు. మీరు మీ ఫ్రెండ్‌కు కొంత మొత్తం పంపాల్సి ఉంది. వెఓంట‌నే ఫోన్‌పేలో అత‌ణ్ని యాడ్ చేసి మీ ఫోన్ పే వాలెట్‌లో ఉన్న అమౌంట్‌ను అత‌నికి పంప‌వ‌చ్చు.  మీ ఫోన్‌పేలో డబ్బులు లేక‌పోతే మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఆ మ‌నీ మీ మిత్రుడికి ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది.

ఫోన్ పేలో ఉన్న మ‌రో ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ ఏమిటంటే  రిక్వెస్ట్ మ‌నీ.  మీకు కొంత డ‌బ్బు అవ‌స‌ర‌మైంద‌నుకోండి. ఒక్క క్లిక్ చేస్తే చాలు మీ కాంటాక్ట్స్‌లో ఉన్నమీ కుటుంబ‌స‌భ్యులు లేదా ఫ్రెండ్‌కు ఎస్ ఎంఎస్ వెళ్లిపోతుంది.
 
రీ ఛార్జికి సై అనండి  
ఫోన్‌పే ద్వారా మొబైల్ ఫోన్ రీఛార్జి చేసుకోవ‌చ్చు.  పోస్ట్‌పెయిడ్ బిల్లులు పే చేయ‌వ‌చ్చు. లాండ్ లైన్ బిల్, డాటా కార్డు,  క‌రెంట్‌, గ్యాస్ బిల్లులు కూడా పే చేయ‌వ‌చ్చు.

మీ బిల్లును పంచండి
మీకు 1000 రూపాయ‌ల ఫోన్ బిల్ వ‌చ్చింది. దీన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవాల‌నుకుంటే షేర్ బిల్‌ను క్లిక్ చేస్తే  ఆ అమౌంట్ వివ‌రాల‌తో మీ ఫ్రెండ్ కి ఎస్ఎంఎస్ వెళుతుంది.


ఫ్లిప్‌కార్ట్ లో బిల్లు చెల్లించండి..
ఫోన్‌పే ఫ్లిప్‌కార్ట్ వెంచ‌ర్ కాబట్టి ఫ్లిప్‌కార్ట్ పేమెంట్‌కు కూడా దీన్ని వాడుకోవ‌చ్చు.  మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా కొనేట‌ప్పుడు చెక్ అవుట్ అయ్యే స‌మ‌యంలో ఫోన్‌పేను సెల‌క్ట్ చేసుకుని మీ ఎంపిన్ ఎంట‌ర్ చేసి బిల్ చెల్లించ‌వ‌చ్చు.  త్వ‌రలో మింత్రా, జబాంగ్‌ల‌కు కూడా ఫోన్‌పే ద్వారా చెల్లించే అవ‌కాశం రానుంది.

షాపుల్లో వినియోగించండి.
ఇత‌ర మొబైల్ వాలెట్ల మాదిరిగానే ఫోన్ పేను కూడా షాపుల్లో ఏదైనా కొనుగోలు చేసిన‌ప్పుడు బార్‌కోడ్ ద్వారా వినియోగించి బిల్ల క‌ట్ట‌వ‌చ్చు.
 
రోజుకు ల‌క్ష.. ట్రాన్సాక్ష‌న్‌కు నో ఛార్జి
రోజుకు ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు సెండ్ చేసుకోవ‌చ్చు.   అంటే నెల‌కు 30 ల‌క్ష‌లు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు. పేటీఎం, మొబీక్విక్ వంటి మిగ‌తా  మిగ‌తా మొబైల్ వాలెట్ల‌లో నెల‌కు 20 వేల రూపాయ‌ల వ‌ర‌కే పంప‌గ‌ల‌రు. అంటే ఫోన్‌పే వాలెట్‌కు ఉన్న లిమిట్ ఎంత ఎక్కువో గుర్తించండి.  మీరే ఆశ్చర్య‌పోతారు.
మిగిలిన మొబైల్ వాలెట్ల‌లో మీరు ఎవ‌రికైనా మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలంటే ముందుగా మీ బ్యాంకు అకౌంట్ నుంచి వాలెట్‌లోకి డ‌బ్బులు నింపాలి. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి మీరు కావాల‌నుకున్న వారికి డ‌బ్బులు పంప‌గ‌ల‌రు. అదే ఫోన్‌పేలో అయితే మీ యాప్‌కు లింక‌యి ఉన్న బ్యాంకు అకౌంట్‌లో నుంచి డ‌బ్బులు నేరుగా క‌ట్ అయి కావాల్సిన అకౌంట్ కు చేరిపోతాయి. దీంతో టైం ఆదా అవుతుంది. 

మొబైల్ వాలెట్లు ఇంత‌కు ముందు ఇలాంటి మ‌నీ ట్రాన్సాక్ష‌న్ల‌కు ఇంత‌కు ముందు 1 నుంచి 4 శాతం వ‌ర‌కు ఛార్జి వ‌సూలు చేసేవి.  
డీ మానిటైజేష‌న్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఆ ఛార్జీల‌ను ర‌ద్దు చేశాయి. అయితే ఈ  సౌక‌ర్యం ఎప్ప‌టివ‌ర‌కు ఉంటుందో తెలియ‌దు. కొన్ని వాలెట్లు డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కే దీన్ని ప‌రిమితం చేసే ఆలోచ‌న‌లో ఉన్నాయి.  ఫోన్ పేలో మాత్రం జీవితాంతం ట్రాన్సాక్ష‌న్ల‌పై ఎలాంటి ఛార్జీ ఉండదు.

జన రంజకమైన వార్తలు