• తాజా వార్తలు
  •  

ఇంకా ఇన్స్యూరెన్స్ లేని వెహిక‌ల్స్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ రెడీ

ట్రాఫిక్ రూల్స్ ఎంత  కేర్ తీసుకుని ఫ్రేమ్ చేసినా, ఎంత స్ట్రిక్ట్‌గా త‌నిఖీలు చేస్తున్నా ఇన్స్యూరెన్స్ లేకుండా న‌డుస్తున్న వాహ‌నాలు దేశంలో ల‌క్ష‌ల కొద్దీ ఉన్నాయి. క‌నీసం మ్యాండేట‌రీగా ఉన్న థ‌ర్డ్ పార్టీ  ఇన్స్యూరెన్స్ కూడా లేకుండా వాహ‌నాలు  న‌డిపేస్తున్నారు. దీంతో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ దీనిపై సీరియ‌స్‌గా దృష్టి పెట్టింది.
> 55% వాహ‌నాల‌కే ఇన్స్యూరెన్స్
> ఇన్స్యూరెన్స్  ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో  (IIB)  లెక్క‌ల ప్ర‌కారం దేశంలో 21 కోట్ల వాహ‌నాలు రిజిస్ట‌ర్ అయి ఉన్నాయి. అయితే  వీటిలో కేవ‌లం ఆరున్న‌ర కోట్ల వెహిక‌ల్స్‌కు మాత్ర‌మే ఇన్స్యూరెన్స్  ఉంది.  అయితే 21 కోట్ల వాహ‌నాల్లో చాలా వ‌ర‌కు పాత‌వి అయితే మూల‌న‌ప‌డేయడం, చెత్త కింద అమ్మేయ‌డం లేదా ప‌నికిరాకుండా పోయిన స్టేజ్‌లో ఉన్నాయి.  మొత్తంగా చూస్తే దేశంలో ప్ర‌స్తుతం తిరుగుతున్న వెహిక‌ల్స్‌లో 50 నుంచి 55% వాటికి మాత్ర‌మే ఇన్స్యూరెన్స్  ఉంద‌ని అంచ‌నా.
టూవీల‌ర్సే ఎక్కువ
> ఇండియాలోని వెహిక‌ల్ సంఖ్య‌లో 70% వ‌ర‌కు టూవీల‌ర్స్ ఉన్నాయి. వీటిలోనే ఎక్కువ వాటికి ఇన్స్యూరెన్స్  లేదు. థ‌ర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్  కూడా లేక‌పోవ‌డంతో యాక్సిడెంట్లు జ‌రిగిన‌ప్పుడు కాంపెన్సేష‌న్ రాబ‌ట్ట‌డం క‌ష్ట‌మ‌వుతోంది. ఏడాదికి వెయ్యి రూపాయల్లోపే థ‌ర్డ్‌పార్టీఇన్స్యూరెన్స్  దొరుకుతున్నా చాలా మంది వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే వెహిక‌ల్ అమ్మేట‌ప్పుడే టూ వీల‌ర్ అయితే మూడేళ్లు, కార్ అయితే ఐదేళ్ల‌పాటు థ‌ర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్  క‌ట్టించుకున్నాకే రిజిస్ట్రేష‌న్ చేయాల‌ని రోడ్ సేఫ్టీ మీద సుప్రీం కోర్టు ప్యాన‌ల్ ఐఆర్‌డీఏకి సూచించింది. ఇది కూడా అమ‌ల‌వుతున్నది త‌క్కువే.
 ఆన్‌లైన్ ట్రాకింగ్
   థ‌ర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్ లేకుండా ప‌ట్టుబ‌డితే పోలీసులు9 1000 రూపాయ‌ల జ‌రిమానా, అవ‌స‌ర‌మైతే .జైలు శిక్ష కూడా విధించ‌వచ్చ‌ని ఆదేశాలున్నాయి. అయితే ఫిజిక‌ల్‌గా వెహిక‌ల్‌ను ఆపి డాక్యుమెంట్స్ చెక్ చేస్తేనే త‌ప్ప   ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియ‌డం లేదు. అందుకే ఇన్స్యూరెన్స్  అయిన వెహిక‌ల్స్ నంబ‌ర్లు, డిటెయిల్స్ ఇవ్వాల‌ని  ఇన్స్యూరెన్స్  కంపెనీల‌న్నింటినీ కోరింది.  ఈ వివ‌రాల‌ను ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంపైకి తీసుకురావాల‌ని, వాటిని అన్ని రాష్ట్రాల ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్లు, ట్రాఫిక్ పోలీసులు యాక్సెస్ చేయ‌గలిగేలా చూస్తే  ఇన్స్యూరెన్స్  క‌ట్ట‌కుండా తిరుగుతున్న వాహ‌నాల‌ను అడ్డుకోవ‌చ్చ‌న్న‌ది సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప్లాన్‌.

జన రంజకమైన వార్తలు