• తాజా వార్తలు
  •  

పేటీఎం రూట్ యాక్సెస్ అడుగుతుంది..ఎంత‌వ‌ర‌కు న‌మ్మొచ్చు?

పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ .. త‌మ ఆండ్రాయిడ్ డివైస్‌ల‌ను అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ కోసం రూట్ లేదా మాడిఫై చేసిన యూజ‌ర్ల‌ను వాటి వివ‌రాలు అడుగుతోంది.  మీ డివైస్ మీద ఫుల్ యాక్సెస్ ఇవ్వాల‌ని రిక్వెస్ట్‌లు పంపుతోంది. అయితే కేవ‌లం పేమెంట్ యాప్ అయిన పేటీఎంకు యూజ‌ర్ డివైస్ రూట్ యాక్సెస్ ఎందుకు అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. 
రూట్ యాక్సెస్ అంటే?
రూట్ యాక్సెస్ అంటే మీ డివైస్ మీద వేరేవాళ్ల‌కు ఫుల్ కంట్రోల్ ఇవ్వ‌డ‌మే. అంటే ఎలాంటి యాక్ష‌న్ అయినా చేయ‌డానికి,ఎలాంటి  మాడిఫికేష‌న్స్ అయినా చేసేయ‌డానికి ఫుల్ యాక్సెస్ అన్న‌మాట‌. ఒక‌ర‌కంగా చెప్పాలంటే మ‌న ఇంటి తాళం వేరేవాళ్ల చేతిలో పెట్టిన‌ట్లు. ఒక్క‌సారి రూట్ చేస్తే డివైస్ మాన్యుఫాక్చ‌ర్ ఆధీనంలో కూడా ఉండ‌దు. దాన్ని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మార్చిపారేయొచ్చు
పేటీఎంకు ఏం పని?
ఒక్క‌సారి మీ ఆండ్రాయిడ్ డివైస్‌కు రూట్ యాక్సెస్ ఎవ‌రికైనా ఇచ్చారంటే వాళ్లు మీ డివైస్‌కు సూప‌ర్ యూజ‌ర్ అవుతారు. వాళ్లు మీ ఫోన్‌లో సెట్టింగ్స్‌ను మార్చేయొచ్చు. మీకాల్ లాగ్‌ను చూడొచ్చు.మెసేజ్‌లు చ‌దివేయొచ్చు. మీ ఫోన్ నుంచి ఎలాంటి యాక్ష‌న్ అయినా మీకు తెలియ‌కుండానే చేసేయొచ్చు. అంటే మీ ప్రైవ‌సీ, భ‌ద్ర‌త ప్ర‌మాదంలో ప‌డొచ్చు. పేటీఎంకు మీరు యాక్సెస్ ఇస్తే వీట‌న్నింటికీ మీరు అవ‌కాశం ఇచ్చినట్లే. 
పేటీఎం ఏమంటోంది?
బిబాస్ దేబాంత్ అనే పేటీఎం యూజ‌ర్ దీన్ని ఫ‌స్ట్‌టైం గుర్తించారు.  రూట్ యాక్సెస్ కోసం పేటీఎం రిక్వెస్ట్‌ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్ట‌ర్‌లో పెట్టారు. ఈ ట్వీట్ చాలామంది దృష్టికి వ‌చ్చింది.  పేటీఎం సీఈవో  విజయ్ శేఖర్ శర్మ దీనికి రెస్పాండ్ అయ్యారు. యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెస్ చేయడానికి ముందు రూట్ చేసిన డివైస్‌ల‌ను చెక్ చేయాల‌ని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) త‌మ‌ను అడిగింద‌ని స‌మాధాన‌మిచ్చారు. అయితే దీనిపై సైబ‌ర్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పేటీఎం మాత్ర‌మే కాదు ఏ యూజ‌ర్‌, ఎలాంటి యాప్, కంపెనీ అయినా మీ డివైస్ రూట్ యాక్సెస్ అడిగితే ఇవ్వ‌ద్ద‌ని చెబుతున్నారు.
 

జన రంజకమైన వార్తలు