• తాజా వార్తలు

పేటిఏం VIP కస్టమర్ అవ్వడం ఎలా? రూ 5000/- ల వరకూ క్యాష్ బ్యాక్ పొందడం ఎలా?

ప్రియమైన కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఈ రోజు అందించనున్నాము. ప్రముఖ వ్యాలెట్ కంపెనీ అయిన పేటిఎం ఒక సరికొత్త సర్వీస్ ను లాంచ్ చేసింది. నగదు రహిత లావాదేవీల నేపథ్యం లో చాలా మందికి క్లిష్ట తరంగా మారుతున్న kyc ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు పే టిఎం VIP కస్టమర్ అనే ఆఫర్ ను లాంచ్ చేసింది. దీనినే ఆధార్ బేస్డ్ ekyc ప్రక్రియ అంటున్నారు. అవును ఈ ప్రక్రియ ద్వారా మీరు కూడా పే టిఎం యొక్క VIP కస్టమర్ గా మారిపోయి రూ 5000/- లాస్ వరకూ క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. అంతేకాదు ఒక్కోసారి మీ ట్రాన్స క్షణ్ పై 100% క్యాష్ బ్యాక్ ను కూడా పొందవచ్చు. మూవీ టికెట్స్, బస్సు తికెత్సం ఫ్లైట్ టికెట్స్ మరియు హోటల్ టికెట్ బుకింగ్ లాంటి ట్రాన్సక్షణ్ లపై 100 శాతం వరకూ క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. అంతేకాదు షాపింగ్ పై కూడా క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదో ఆన్ లైన్ అయినా లేక ఆఫ్ లైన్ అయినా సరే మీకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పే టిఎం యొక్క ఏజెంట్ మీ దగ్గరకు వచ్చి మొబైల్ బేస్డ్ బయో మెట్రిక్ స్కానర్ ద్వారా మీ ఆదార్ ను సేకరించి ekyc ప్రక్రియ ను పూర్తీ చేస్తాడు. పేపర్ ను వాడకుండానే ఈ ప్రక్రియ ద్వారా మొబైల్ లోనే కస్టమర్ యొక్క అనుమతిని ఆదార్ ద్వారా సేకరిస్తారు.

మరి ఇన్ని లాభాలు పొందాలంటే ఈ VIP కస్టమర్ అయ్యేదేలా? దీనికి ఉన్న ఇతర లాభాలు ఏమిటి? ఇలాంటి ఆసక్తికరమైన కథనాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.

పే టిఎం యొక్క VIP కస్టమర్ అయ్యేదేలా?

  1. మొదటగా పే టిఎం యాప్ ను మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోండి.
  2. ఆ తర్వాత ఈ యాప్ లో కుడి వైపు కార్నర్ లో ఉండే ప్రొఫైల్ సెలక్షన్ పై క్లిక్ చేయాలి.
  3. “ రిక్వెస్ట్ వ్యాలెట్ అప్ గ్రేడ్  “ పై క్లిక్ చేయాలి.
  4. మీ దగ్గరలోని KYC సెంటర్ ను కనుగొనండి.
  5. అక్కడకు వెళ్లి ఈ క్రింద పేర్కొనే డాక్యుమెంట్ లలో ఏదో ఒక దానిని సబ్మిట్ చేయండి.
  6. అంతే, ఇక మీ పే టిఎం ఎకౌంటు అప్ గ్రేడ్ అయినట్లే. మీరు పే టిఎం యొక్క VIP కస్టమర్ అయినట్లే.

మరి దీనికి కావలసిన డాక్యుమెంట్ లు ఏవి?

  1. ఆధార్ కార్డు
  2. పాస్ పోర్ట్
  3. వాటర్ ఐడి
  4. డ్రైవింగ్ లైసెన్స్
  5. NREGA జాబు కార్డు

దీని వలన లాభాలు ఏమిటి?

  1. పే టిఎం అధికారుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది.
  2. పే టిఎం VIP కస్టమర్ యొక్క వెల్ కం ఆఫర్ కు అర్హులు అవుతారు.
  3. మీరు మీ వ్యాలెట్ లో ఒక లక్ష రూపాయల వరకూ స్టోర్ చేసుకోవచ్చు.
  4. పే టిఎం VIP యూజర్ లకు పరిమితులు ఏవీ ఉండవు.
  5. పే టిఎం నుండీ రూ 5000/- ల వరకూ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
  6. అదనపు క్యాష్ బ్యాక్ లు, ప్రమోషనల్ ఆఫర్ లు కేవలం మీకు మాత్రమే లభిస్తాయి.
  7. బస్సు, ఫ్లైట్ టికెట్ లకూ మరియు రీఛార్జి, బిల్ పేమెంట్ లకు అదనపు కోపాన్ లు లభిస్తాయి.

పేటిఎం VIP కస్టమర్ షరతులు మరియు నిబంధనలు

  1. KYC విజయవంతం అయిన తర్వాత ఈ ఆఫర్ 6 నెలల వరకూ మాత్రమే వర్తిస్తుంది.
  2. డబ్బు ను బ్యాంకు కు కానీ లేదా వేరే పే టిఎం ఎకౌంటు కు కానీ పంపేటపుడు ఇది వ్యాలిడ్ అవ్వదు.
  3. యాడ్ మనీ, QR కోడ్ లేదా OTP బేస్డ్ పేమెంట్ మరియు ఎయిర్ టెల్ ట్రాన్స క్షన్స్ లకు వర్తించదు.
  4. ఈ ఆరునెలల కాలం లో ఒక్కసారి మాత్రమే ఏ ఆఫర్ వర్తిస్తుంది.

దీని తేదీ లు డిసెంబర్ 31 ,20.16 నుండీ జూన్ 3020.17 వరకూ మాత్రమే

జన రంజకమైన వార్తలు