• తాజా వార్తలు
  •  

డెబిట్‌, క్రెడిట్ కార్డులు వాడ‌డం వ‌ల్ల లాభాలు..న‌ష్టాలు!

ఈ డిజిట‌ల్ యుగంలో అంతా కార్డుల మాయే.  అన్ని కంపెనీలూ ఇప్పుడు కార్డుల బాట ప‌ట్టాయి. లావాదేవీల‌న్నీ డిజిట‌ల్ రూపంలోనే జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాయి. ముఖ్యంగా భార‌త్‌లో డీమానిటైజేష‌న్ తర్వాత కార్డుల వాడ‌కం బాగా పెరిగింది. ఒక‌ప్పుడు డెబిట్‌, క్రెడిట్ కార్డులు వాడాలంటే భ‌య‌ప‌డిన వారు సైతం ఇప్పుడు కార్డులు యధేచ్ఛ‌గా వాడేస్తున్నారు. ఇదే అద‌నుగా అన్ని ప్ర‌ముఖ బ్యాంకుల‌న్నీ త‌మ ఖాతాదారుల‌కు కార్డుల మీద కార్డులు ఇష్యూ చేసేస్తున్నాయి. మ‌రి డెబిట్, క్రెడిట్ కార్డులు వాడ‌డం వ‌ల్ల లాభాలేంటి? న‌ష్టాలేంటో చూద్దామా...

డెబిట్ కార్డులు వాడడం వ‌ల్ల లాభాలివే..
1. మ‌నం డ‌బ్బులును క్యారీ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. మ‌న‌కు ఏ ట్రాన్సాక్ష‌న్ ఎప్పుడు చేశామో స్పష్టంగా తెలిసిపోతుంది.  రోజు వారీ ఖ‌ర్చుల‌పై కూడా ఒక అవ‌గాహ‌న  వ‌స్తుంది

2. మీ సేవింగ్స్ అకౌంట్‌కు ఆటోమెటిక్ ట్రాన్స‌ఫ‌ర్ల‌ను కూడా సెట్ చేసుకోవ‌చ్చు

3.  డెబిట్ కార్డ్ సాయంతో మీరు ఏటీఎం నుంచి లేదా వెండ‌ర్ నుంచి డ‌బ్బులు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

4. డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డం వ‌ల్ల మీ క్రెడిట్ స్కోరు మీద ఎలాంటి ప్ర‌భావం చూపించ‌దు

డెబిట్ కార్డుల వ‌ల్ల నష్టాలు
1. క్రెడిట్ కార్డుతో పోలిస్తే దీనికి  సెక్యూరిటీ త‌క్కువే.  సాధార‌ణంగా మీ అకౌంట్లోంచి డ‌బ్బులు డెబిట్ అయితే క్రెడిట్ కార్డుకు వ‌చ్చినంత వేగంగా రిఫండ్ డెబిట్ కార్డుకు రాదు

2.  మీ కార్డును పోగొట్టుకున్నా.. ఎవ‌రైనా దొంగిలించినా....  మీకు దాన్ని తిరిగి పొంద‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అంతేకాదు కార్డు పోగొట్టుకున్నందుకు అమెరికాలో అయితే  ఏకంగా 500 డాల‌ర్లు జ‌రిమానా కూడా క‌ట్టాల్సి ఉంటుంది.

3. డెబిట్ కార్డుతో ఎంత మ‌నం స్పెండ్ చేసినా మ‌న క్రెడిట్ స్కోరును పెంచుకోలేం

క్రెడిట్ కార్డుల వ‌ల్ల లాభాలు
1. మీరు స్పెండ్ చేసిన దాన్ని బ‌ట్టి పాయింట్లు, రివాడ్డ్స్‌, క్యాష్‌బ్యాక్‌లు లాంటి స‌దుపాయాలు పొందొచ్చు. 

2. డెబిట్ కార్డుతో పోలిస్తే ఇదెంతో సెక్యూర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ చేసే స‌మ‌యంలో ఈ సెక్యూరిటీ మీకెంతో సాయం చేస్తుంది

3. మీ కార్డు పోగొట్టుకుంటే కేవ‌లం 50 డాల‌ర్లే మీపై ఫైన్ ప‌డుతుంది. అంతేకాదు రిఫండ్ పొంద‌డం కూడా చాలా సుల‌భం

4. మీ పేమెంట్స్ హిస్ట‌రీని మెరుగుప‌రుచుకోవ‌డానికి క్రెడిట్ స్కోరు పెంచుకుని... త‌ద్వారా భ‌విష్య‌త్‌లో రుణాలు పొంద‌డానికి మీకు క్రెడిట్ కార్డు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

క్రెడిట్‌కార్డు వ‌ల్ల న‌ష్టాలు...
1. క్రెడిట్‌కార్డు చేతిలో ఉంద‌ని చెప్పి ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఖ‌ర్చు చేస్తారు. దీంతో అప్పుల్లో పడే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి

2.  క్రెడిట్ కార్డుల్లో ఎన్నో ర‌కాలు ఉండ‌డం వ‌ల్ల ఏది ఎలా ఉపయోగ‌ప‌డుతుందో చెప్ప‌డం, కంపేర్ చేయ‌డం క‌ష్టం.

3. స్పెండింగ్ విష‌యంలో, డ‌బ్బులు తిరిగి చెల్లించ‌డం విష‌యంలో అజాగ్ర‌త్త‌గా ఉంటే మీ క్రెడిట్ స్కోరు మీద ప్ర‌భావం చూపిస్తుంది

జన రంజకమైన వార్తలు